SWIPE STYLE NEWS

  • Go Full Screen for a better reading experience.Choose your reading categories
డాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం..

డాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం..

ఈశ్వర్ సాయిపై ఫిర్యాదు చేసినా అరెస్ట్ చేయకపోవడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నం చేసిన మాధురి రాథోడ్డోర్ పగలగొట్టి ఫ్యాన్‌కు వేలాడుతున్న మాధురి రాథోడ్‌ను కాపాడిన కుటుంబ సభ్యులుపెళ్లి చేసుకుంటానని మోసం చేయడంతో తట్టుకోలేక ఆత్మహత్యాయత్నంఈశ్వర్ సాయిపై ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదంటూ మాధురి రాథోడ్ ఆవేదనఈశ్వర్ సాయిని తప్పించే ప్రయత్నాలు నార్సింగి పోలీసులు చేస్తున్నారంటూ మాధురి రాథోడ్ ఆరోపణ

డ్రంక్ అండ్ డ్రైవ్‌లో ఒకరికి 7 రోజుల జైలు

డ్రంక్ అండ్ డ్రైవ్‌లో ఒకరికి 7 రోజుల జైలు

గోదావరిఖని,(తెలంగాణ నేత్రం)డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన 16 మందిని గోదావరిఖని ప్రిన్సిపల్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ వెంకట సచిన్ రెడ్డి ఎదుట హాజరుపరచగా, 15 మందికి రూ.41,500 జరిమానా విధించారు. కమ్యూనిటీ సర్వీస్‌లో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రిలో శుభ్రత పనులు చేయించారు. మరో వ్యక్తికి 7 రోజుల జైలు శిక్ష విధించడంతో కరీంనగర్ జిల్లా జైలుకు తరలించారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, హెల్మెట్ ధరించి ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ బి. రాజేశ్వరరావు సూచించారు.

కరీంనగర్ జిల్లా పర్యటనలో కేటీఆర్ కారుకు ప్రమాదం

కరీంనగర్ జిల్లా పర్యటనలో కేటీఆర్ కారుకు ప్రమాదం

అలుగునూర్ వద్ద కేటీఆర్ కారుకు తగిలిన లారీ

ఆ సమయంలో కారులోనే ఉన్న కేటీఆర్

స్వల్పంగా దెబ్బతిన్న కారు …..

సింగరేణి కార్మికులపై వేధింపులు ఆపాలి.

సింగరేణి కార్మికులపై వేధింపులు ఆపాలి.

టీబీజీకేఎస్, బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన

సస్పెన్షన్లు, ఛార్జ్‌షీట్లు వెంటనే రద్దు చేయాలి

కార్మికుల జోలికొస్తే ఊరుకునేది లేదు: కోరుకంటి చందర్

గోదావరిఖని(తెలంగాణ నేత్రం)సింగరేణి వ్యాప్తంగా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్), బీఆర్ఎస్ ఆధ్వర్యంలో శనివారం నిరసన చేపట్టారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలనను నిరసిస్తూ ఆర్జీ-1 ఏరియాలోని జీడీకే 2, 2ఏ ఇన్‌క్లైన్ వద్ద ఈ ధర్నా నిర్వహించారు.వడ్డేపల్లి శంకర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో నాయకులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్లకార్డులతో నిరసన తెలిపారు. కార్మికులపై జారీ చేసిన ఛార్జ్‌షీట్లు, సస్పెన్షన్లు, డిస్మిసల్స్‌ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.సింగరేణి రికార్డుల్లో పెండింగ్‌లో ఉన్న మారుపేర్ల సమస్యను పరిష్కరించాలని, కారుణ్య, డిపెండెంట్ ఉద్యోగాల నియామకాలను పునరుద్ధరించాలని కోరారు. ఖాళీల ఆధారంగా అర్హులైన కార్మికులకు ప్రమోషన్లు కల్పించాలని, 60 ఏళ్లు దాటిన వారికి బకాయిలతో కూడిన పింఛన్ మంజూరు చేయడంతో పాటు క్రమం తప్పకుండా మెడికల్ బోర్డులు నిర్వహించాలని డిమాండ్ చేశారు.కార్మికులను ప్రభుత్వం మోసం చేసిందిఈ సందర్భంగా రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు గడుస్తున్నా కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని విమర్శించారు. ఎన్నికల సమయంలో ప్రకటించిన 250 గజాల ఇంటి స్థలాలు, 100 శాతం ఇన్‌వాలిడేషన్ ఉద్యోగాలు, ఇన్‌కమ్ ట్యాక్స్ మినహాయింపు వంటి హామీలను ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు.గతంలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో 19 వేల మందికి ఉద్యోగాలు కల్పించడంతో పాటు మెడికల్ కాలేజీల్లో కార్మికుల పిల్లలకు 5 శాతం కోటా కల్పించామని చందర్ పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో కొత్తగా ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా కార్మికులపై సస్పెన్షన్లు, ఛార్జ్‌షీట్ల పేరుతో వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.కార్మికుల హక్కులను కాలరాస్తే ఊరుకునేది లేదని, అవసరమైతే పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని కోరుకంటి చందర్ హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మాదాసి రామ్మూర్తి, నూనె కొమరయ్య, ఉప్పులేటి తిరుపతి, మీస రాజు, దూత శేషగిరి, మేకల సమ్మయ్య, మూల విజయరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఈఎస్ఐ ఆసుపత్రికి స్థలం కేటాయించాలి.సోమారపు లావణ్య

ఈఎస్ఐ ఆసుపత్రికి స్థలం కేటాయించాలి.సోమారపు లావణ్య

రామగుండం,(తెలంగాణ నేత్రం)మంజూరైన ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణానికి తక్షణమే స్థలం కేటాయించి పనులు ప్రారంభించాలని బీజేపీ రాష్ట్ర నాయకురాలు సోమారపు లావణ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఆసుపత్రి మంజూరై ఏళ్లు గడుస్తున్నా స్థల కేటాయింపు జరగకపోవడం వల్ల కార్మికులు, వారి కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నారని ఆమె అన్నారు. వారం రోజుల్లోగా ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే బీజేపీ ఆధ్వర్యంలో ప్రత్యక్ష కార్యాచరణ చేపడతామని హెచ్చరించారు. అనంతరం రామగుండం తహసీల్దార్‌కు కూడా వినతిపత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాశీపేట శివాజీ, జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి మామిడి రాజేష్, మాజీ జిల్లా ఉపాధ్యక్షురాలు మాతంగి రేణుక, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు వడ్డేపల్లి భారతి, మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి సుల్వ పద్మ, మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు సుజా శ్రీ, ఎన్టీపీసీ మండల అధ్యక్షుడు మిట్టపల్లి సతీష్, తిలక్ నగర్ మండల అధ్యక్షుడు ఐత పవన్, సీనియర్ నాయకులు కొండపర్తి సంజీవ్, కొమ్మ శ్రీనివాస్ యాదవ్, అరిగేల శ్రావణ్ యాదవ్, పశం రాజు యాదవ్, బరిగల సంతోష్, మేడి రాజు, మంథని మహేష్, కచ్చకాయల శ్రావణ్ తదితర కార్యకర్తలు, స్థానిక ప్రతినిధులు పాల్గొన్నారు.

కొండా సురేఖ బర్తరఫ్..

కొండా సురేఖ బర్తరఫ్..

తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త రికార్డు!

తెలంగాణ రాజకీయాల్లో గత కొద్దిరోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న కొండా సురేఖ ఎపిసోడ్‌కు ఎట్టకేలకు ఎండ్ కార్డ్ పడింది. వివాదాస్పద పరిణామాల నేపథ్యంలో కొండా సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేస్తూ కాంగ్రెస్ అధిష్టానం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు.సురేఖను మంత్రి వర్గం నుంచి తక్షణమే తొలగించాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డి పంపిన లేఖ లోక్ భవన్‌కు చేరింది. ఈ ప్రతిపాదనపై గవర్నర్ అధికారిక నిర్ణయం తీసుకోవడమే తరువాయిగా మిగిలింది.తెలంగాణ చరిత్రలో సరికొత్త రికార్డు:ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న ఈ కఠిన నిర్ణయంతో తెలంగాణ రాజకీయాల్లో ఒక అరుదైన రికార్డు నమోదు కాబోతోంది. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మంత్రివర్గం నుంచి ఉద్వాసనకు గురైన మూడో మంత్రిగా, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో తొలి మంత్రిగా కొండా సురేఖ నిలవనున్నారు. అంతేకాకుండా, రాష్ట్రంలో బర్తరఫ్ అయిన తొలి మహిళా మంత్రిగా కూడా కొండా సురేఖ చరిత్రకెక్కనున్నారు.గతంలో బర్తరఫ్ అయిన మంత్రులు వీరే:తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత కేబినెట్ నుంచి మంత్రులను తొలగించడం ఇది మూడోసారి. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత బీఆర్ఎస్ ఫస్ట్ టర్మ్ ప్రభుత్వంలో డాక్టర్ తాటికొండ రాజయ్యను 2015 లో నాటి సీఎం కేసీఆర్ బర్తరఫ్ చేశారు. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో తొలి ఉప ముఖ్యమంత్రి, వైద్యారోగ్య శాఖ మంత్రిగా ఉన్న రాజయ్యపై అవినీతి ఆరోపణలు రావడంతో ఈ చర్యలు తీసుకున్నారు. అనంతరం బీఆర్ఎస్ రెండో దఫా ప్రభుత్వంలో మే 2021లో ఈటల రాజేందర్‌పై కూడా కేసీఆర్ బర్తరఫ్ చేశారు. వైద్యారోగ్య శాఖ మంత్రిగా ఉండగా ఈటలపై అసైన్డ్ భూముల ఆక్రమణ ఆరోపణలు రావడంతో ఆయనను కూడా కేబినెట్ నుంచి తొలగించారు. అయితే ఇప్పటి వరకు బర్తరఫ్ అయిన ముగ్గురిలో రాజయ్య, ఈటల రాజేందర్ ఇద్దరు వైద్యారోగ్యశాఖ మంత్రులుగా పని చేస్తుండగా చర్యలకు గురికాగా కొండా సురేఖ మాత్రం దేవాదాయ శాఖకు ప్రాతినిధ్యం వహిస్తూ వేటుకు గురయ్యారు.

రేవంత్‌ను CM చేసింది అధిష్టానమే..

రేవంత్‌ను CM చేసింది అధిష్టానమే..

ఎవరెవరు ఏం చేస్తున్నారో అన్నీ తెలుసు:AICC

తెలంగాణ కాంగ్రెస్‌లో కొంతకాలంగా నెలకొన్న అంతర్గత పరిణామాలు, నేతల వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధిష్టానం తీవ్రస్థాయిలో స్పందించింది. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తూ, పార్టీ ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా వ్యవహరిస్తున్న నేతలకు ఏఐసీసీ గట్టి హెచ్చరికలు జారీ చేసింది.రాష్ట్రంలో పార్టీకి వ్యతిరేకంగా ఎవరెవరు మాట్లాడుతున్నారు.. వెనుక ఉండి ఎలాంటి పనులు చేస్తున్నారనే దానిపై తమ దగ్గర పూర్తి సమాచారం ఉందని హైకమాండ్ స్పష్టం చేసింది. ఇకపై ఇటువంటి చర్యలను ఏమాత్రం సహించేది లేదని తేల్చిచెప్పింది.సహనానికి హద్దు ఉంటుంది..పార్టీ నేతల ఓపికకు, అధిష్టాన సహనానికి కూడా ఒక హద్దు ఉంటుందని.. ఇకపై క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఎవరినీ విడిచిపెట్టేది లేదని, కఠిన చర్యలు (వేటు) తప్పవని హెచ్చరించింది. ఏఐసీసీ స్పష్టమైన నిర్ణయంతోనే రేవంత్ రెడ్డిని తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రకటించిందని ప్రస్తావించింది. అధిష్టానం నియమించిన సీఎంపై తరచూ బహిరంగ వ్యాఖ్యలు చేయడం తీవ్రమైన క్రమశిక్షణా రాహిత్యమని పేర్కొంది. సొంత పార్టీ ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చేలా మాట్లాడే నాయకులు ఇప్పటికైనా తమ తీరు మార్చుకోవాలని, లేనిపక్షంలో క్రమశిక్షణా కమిటీ ద్వారా చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. రాష్ట్రంలో పబ్లిక్ డొమైన్‌లో జరుగుతున్న చర్చలు, నాయకుల వ్యాఖ్యలను నిశితంగా పరిశీలిస్తున్నామని, పార్టీ నిర్ణయాలకు కట్టుబడి ఉండని వారిపై రాబోయే రోజుల్లో కఠిన నిర్ణయాలు ఉంటాయని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి.

వైఎస్ఆర్ పాలనను ప్రతిపక్షాలు సైతం మెచ్చుకున్నాయి

వైఎస్ఆర్ పాలనను ప్రతిపక్షాలు సైతం మెచ్చుకున్నాయి

ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన నేత వైఎస్ఆర్.ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్

గోదావరిఖని(తెలంగాణ నేత్రం)దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని రామగుండం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో NSUI నాయకుడు మెంటం ఉదయ్ రాజ్ ఆధ్వర్యంలో నివాళి కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ వైఎస్ఆర్ పాలనలో పేదలు, రైతులు, విద్యార్థుల సంక్షేమానికి పెద్దపీట వేశారని అన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు కార్పొరేట్ వైద్యం, ఫీజు రీయింబర్స్‌మెంట్ ద్వారా ఉన్నత విద్యకు అవకాశం కల్పించారని, జలయజ్ఞం ద్వారా సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇచ్చారని కొనియాడారు. వైఎస్ఆర్ పాలనను ప్రతిపక్షాలు సైతం మెచ్చుకున్నాయని, ఆయన సంక్షేమ పథకాలు నేటికీ ప్రజల మనసుల్లో నిలిచిపోయాయని పేర్కొన్నారు.రామగుండం పట్టణంలో వైఎస్ఆర్ విగ్రహం ఏర్పాటుకు ఖాళీ స్థలం కేటాయించాలని మేయర్ మహంకాళి స్వామిని ఎమ్మెల్యే కోరారు.కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య, కార్పొరేషన్ అధ్యక్షుడు బొంతల రాజేష్, కార్పొరేటర్లు, NSUI, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

వైఎస్సార్‌కు ఘన నివాళి

వైఎస్సార్‌కు ఘన నివాళి

రామగిరి,(తెలంగాణ నేత్రం)దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి 17వ వర్ధంతిని పురస్కరించుకుని రామగిరి మండలం బేగంపేట ఎక్స్‌రోడ్‌లోని మంథని బ్లాక్‌ కాంగ్రెస్‌ కార్యాలయంలో బుధవారం ఘనంగా నివాళులర్పించారు. మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు రొడ్డ బాపన్న పటేల్‌ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మంథని బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు తొట్ల తిరుపతి యాదవ్‌ వైఎస్సార్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆరోగ్యశ్రీ, 108 వంటి సంక్షేమ పథకాలతో వైఎస్సార్‌ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. సిరిసిల్ల ప్రాంతంలో వైఎస్సార్‌ చేపట్టిన పాదయాత్రలో తాను, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పాల్గొనడం తన అదృష్టమన్నారు. వైఎస్సార్‌ ఆశయాలను కొనసాగిస్తూ మంత్రి శ్రీధర్‌బాబు నాయకత్వాన్ని మరింత బలోపేతం చేయాలని కాంగ్రెస్‌ శ్రేణులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

రామగుండం ఏరియా-1లో 124 శాతం బొగ్గు ఉత్పత్తి- జీఎం లలిత్‌కుమార్‌

రామగుండం ఏరియా-1లో 124 శాతం బొగ్గు ఉత్పత్తి- జీఎం లలిత్‌కుమార్‌

రామగుండం ఏరియా-1లో రికార్డు స్థాయిలో బొగ్గు ఉత్పత్తి సాధించినట్లు జీఎం లలిత్‌కుమార్‌ తెలిపారు. ఆర్జీ-1 పరిధిలోని బొగ్గు గనులు, ఉపరితల గనుల ప్రాజెక్టుల్లో ఆగస్టు నెలలో 124 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించినట్లు పేర్కొన్నారు. మంగళవారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని సింగరేణి జీఎం కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఆగస్టు నెల ఉత్పత్తి వివరాలను వెల్లడించారు. ఆగస్టు నెలలో 2,45,200 టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యానికి గాను 3,04,086 టన్నుల ఉత్పత్తి సాధించినట్లు లలిత్‌కుమార్‌ వివరించారు. నిర్ణీత లక్ష్యం కంటే అధికంగా ఉత్పత్తి సాధించడం పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. రామగుండం ఏరియా నుంచి 2,45,200 టన్నుల బొగ్గు రవాణా లక్ష్యానికి గాను 2,50,739 టన్నుల బొగ్గును రవాణా చేసి 102 శాతం సాధించినట్లు తెలిపారు. అదేవిధంగా జీడీకే-1,3 బొగ్గు గనుల్లో 64 శాతం, జీడీకే-2, 2ఏ బొగ్గు గనిలో 71 శాతం, జీడీకే-1ఏ గనిలో 298 శాతం ఉత్పత్తి సాధించినట్లు లలిత్‌కుమార్‌ స్పష్టం చేశారు. ఈ ఏడాది నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను అధిగమించే దిశగా కృషి చేస్తున్నామని తెలిపారు. కార్మికుల రక్షణకు పూర్తిస్థాయిలో కట్టుబడి ఉన్నామని జీఎం పేర్కొన్నారు. గనుల్లో భద్రతా ప్రమాణాలను పాటిస్తూ ఉత్పత్తి కొనసాగిస్తున్నట్లు తెలిపారు. పరిశ్రమలకు అవసరమైన బొగ్గును వేగంగా రవాణా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేశామని లలిత్‌కుమార్‌ తెలిపారు. సింగరేణి చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగవంతం చేస్తామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో అధికారులు చంద్రశేఖర్‌, రెడ్డిమల్ల తిరుపతి, ఆంజనేయులు, జితేందర్‌సింగ్‌, వేణు, హనుమంతరావు, వీరారెడ్డి, శ్రావణ్‌ తదితరులు పాల్గొన్నారు.

అర్ధరాత్రి ‘ఆపరేషన్ చబుత్రా’.. 30 మంది అదుపులోకి

అర్ధరాత్రి ‘ఆపరేషన్ చబుత్రా’.. 30 మంది అదుపులోకి

గోదావరిఖని,(తెలంగాణ నేత్రం)రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో అర్ధరాత్రి వేళ అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు ‘ఆపరేషన్ చబుత్రా’ నిర్వహించారు. గోదావరిఖని 1 టౌన్, ఎన్టీపీసీ, రామగుండం పరిధిలో విస్తృతంగా నైట్ పెట్రోలింగ్, తనిఖీలు చేపట్టారు. గుంపులుగా తిరుగుతున్న యువకులు, మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిని తనిఖీ చేసి 30 మంది యువకులను, వారి ద్విచక్ర వాహనాలను అదుపులోకి తీసుకున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించి ఈ-పెట్టీ కేసులు నమోదు చేసి కౌన్సెలింగ్ ఇచ్చారు. గంజాయి అనుమానిత ప్రాంతాలు, బెల్ట్ షాపులపై తనిఖీలు నిర్వహించి రెండు బెల్ట్ షాపులపై కేసులు నమోదు చేశారు. రాత్రి 10 గంటల తర్వాత అనవసరంగా గుంపులుగా తిరిగితే వాహనాలు సీజ్ చేస్తామని పోలీసులు హెచ్చరించారు.

పదవీ విరమణ ఉద్యోగులకు ఘన సన్మానం

పదవీ విరమణ ఉద్యోగులకు ఘన సన్మానం

గోదావరిఖని,(తెలంగాణ నేత్రం)
సింగరేణి ఆర్జీ-1 ఏరియాలో సుదీర్ఘకాలం సేవలందించి పదవీ విరమణ పొందుతున్న ముగ్గురు ఉద్యోగులను సోమవారం జీఎం కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. నాగేశ్వరరావు (ఏజీఎం–సివిల్ క్వాలిటీ), రాజాజీ (ఏజీఎం–ఇ&ఎం), బరుపటి పార్వతి (ఎస్టేట్ డిపార్ట్‌మెంట్ ఆఫీస్ అటెండర్)లను ఆర్జీ-1 ఏరియా జీఎం డి.లలిత్ కుమార్ శాలువాలతో సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. సంస్థ అభివృద్ధిలో ఉద్యోగుల సేవలు కీలకమని, పదవీ విరమణ అనంతరం వారు కుటుంబ సభ్యులతో సంతోషంగా, ఆరోగ్యంగా జీవించాలని జీఎం ఆకాంక్షించారు. కార్యక్రమంలో అధికారులు, కార్మిక సంఘాల ప్రతినిధులు, ఉద్యోగులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

భార్యపై కత్తెరతో హత్యాయత్నం.. భర్తకు రెండేళ్ల జైలు

గోదావరిఖని: భార్య స్వప్నపై కత్తెరతో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన పర్లపల్లి సంపత్‌ (43)కు గోదావరిఖని అసిస్టెంట్‌ సెషన్స్‌ కోర్టు రెండేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధించింది. 2022లో రూ.1,000 ఇవ్వలేదన్న కోపంతో భార్య మెడ, పక్కటెముకలపై కత్తెరతో దాడి చేసిన ఘటనపై గోదావరిఖని 1 టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణలో నేరం రుజువు కావడంతో న్యాయస్థానం శిక్ష విధించింది. కేసు దర్యాప్తు, కోర్టు విచారణలో సహకరించిన పోలీసు సిబ్బందిని రామగుండం సీపీ అంబర్‌ కిషోర్‌ ఝా అభినందించారు.

‘శక్తి’ స్కీమ్ జీవో-97ను వెంటనే రద్దు చేయాలి

‘శక్తి’ స్కీమ్ జీవో-97ను వెంటనే రద్దు చేయాలి

విద్యార్థి సేన అధ్యక్షులు టి.కె. శివప్రసాద్ డిమాండ్

‘శక్తి’ స్కీమ్‌లో భాగంగా పాలిటెక్నిక్ కళాశాలలను స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకురావడానికి సంబంధించిన జీవో-97ను వెంటనే రద్దు చేయాలని విద్యార్థి సేన అధ్యక్షులు టి.కె. శివప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. షాద్‌నగర్ విద్యార్థి సేన కమిటీ ఆధ్వర్యంలో పాలిటెక్నిక్ విద్యార్థులతో కలిసి నిర్వహించిన నిరసన ర్యాలీలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా టి.కె. శివప్రసాద్ మాట్లాడుతూ.. పేద, మధ్యతరగతి విద్యార్థులకు అందుబాటులో ఉండేలా దశాబ్దాలుగా విజయవంతంగా కొనసాగుతున్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలను యథాతథంగా బలోపేతం చేయకుండా స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకురావడం ఎవరి ప్రయోజనం కోసం అని ప్రశ్నించారు. పాలిటెక్నిక్ కళాశాలల విలీన నిర్ణయాన్ని ప్రభుత్వం పునఃపరిశీలించాలని కోరారు. గత రెండు వారాలుగా వేలాది మంది పాలిటెక్నిక్ విద్యార్థులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారని, విద్యావేత్తలు, విద్యార్థి సంఘాలు సైతం అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నప్పటికీ ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోకపోవడం సరికాదన్నారు. తెలంగాణలో సుమారు 60 పాలిటెక్నిక్ కళాశాలలు పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఉపాధికి ఉపయోగపడే వివిధ సాంకేతిక కోర్సులను అందిస్తున్నాయని తెలిపారు. పాలిటెక్నిక్ విద్యను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని, కళాశాలల మౌలిక వసతులు, ల్యాబ్‌లు, హాస్టళ్లు, నిధులను మెరుగుపరచాలని డిమాండ్ చేశారు.
పాలిటెక్నిక్ కళాశాలలకు సంబంధించిన విలువైన భూములపై ప్రభుత్వం దృష్టి సారించిందనే అనుమానాలు విద్యార్థుల్లో ఉన్నాయని పేర్కొంటూ, ప్రభుత్వం వెంటనే జీవో-97ను ఉపసంహరించుకుని పాత విధానంలోనే పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పాలిటెక్నిక్ విద్యార్థులతో పాటు విద్యార్థి సేన రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు రిషబ్ జైన్, హైదరాబాద్ అధ్యక్షులు చింతల పవన్, షాద్‌నగర్ శాఖ అధ్యక్షులు నర్సింహా ముదిరాజ్, పరమేశ్వర్, బాలు, రాజు, రాంమోహన్ రెడ్డి, చింటూ తదితరులు పాల్గొన్నారు..

1000 రోజులుగా ఫామ్‌హౌస్‌కే పరిమితమైన కేసీఆర్‌..ప్రజల మధ్యకు రావాలి: రాజ్‌ఠాకూర్‌

1000 రోజులుగా ఫామ్‌హౌస్‌కే పరిమితమైన కేసీఆర్‌..ప్రజల మధ్యకు రావాలి: రాజ్‌ఠాకూర్‌

హైదరాబాద్‌: (తెలంగాణ నేత్రం)
మాజీ సీఎం, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ 1000 రోజులుగా ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారని రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్‌ఠాకూర్‌ విమర్శించారు. సోమవారం గాంధీభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన బీఆర్‌ఎస్‌ తీరుపై మండిపడ్డారు.

రైతులు, ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్న సమయంలో కేసీఆర్‌ ఎప్పుడైనా వారి మధ్యకు వచ్చారా అని ప్రశ్నించారు. ప్రతిపక్ష హోదా అంటే జీతం, పదవి, ప్రభుత్వ సదుపాయాలు పొందడం మాత్రమే కాదని, ప్రజల సమస్యలపై పోరాడాల్సిన బాధ్యత కూడా ఉంటుందని అన్నారు.

కేసీఆర్‌కు ప్రభుత్వం కల్పిస్తున్న జీతాలు, సిబ్బంది, వాహనాలు తదితర సదుపాయాలను ప్రజలు గమనిస్తున్నారని రాజ్‌ఠాకూర్‌ పేర్కొన్నారు. ఇప్పటివరకు జీతాల రూపంలో సుమారు ₹1.24 కోట్లు తీసుకున్నారని, ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌, హైదరాబాద్‌లోని నందినగర్‌ నివాసం తదితర ప్రాంతాల్లో 57 మందికి పైగా సిబ్బంది పనిచేస్తున్నారని తెలిపారు. నాలుగు బుల్లెట్‌ప్రూఫ్‌ కార్లు, ఫాలోయింగ్‌ వాహనాలు, అంబులెన్స్‌, పికప్‌ వాహనాల వంటి సదుపాయాల కోసం గత 32 నెలల్లో సుమారు ₹21 కోట్ల ప్రజాధనం ఖర్చవుతున్నట్లు ఆరోపించారు. ఈ లెక్కలపై అధికారిక ఆధారాలను సంబంధిత శాఖల నుంచి ధృవీకరించాల్సి ఉంది.

కాంగ్రెస్ హామీల అమలు ఏదీ?– బీజేపీ రాష్ట్ర నాయకురాలు సోమారపు లావణ్య

కాంగ్రెస్ హామీల అమలు ఏదీ?– బీజేపీ రాష్ట్ర నాయకురాలు సోమారపు లావణ్య

గోదావరిఖని: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడుస్తున్నా ఆరు గ్యారంటీలు, 13 డిక్లరేషన్లు, ఇతర హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయడంలో విఫలమైందని బీజేపీ రాష్ట్ర నాయకురాలు సోమారపు లావణ్య ఆరోపించారు. సోమవారం శివాజీనగర్‌లోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ఇకపై హామీలు అమలు చేసే వరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీజేపీ ప్రతిరోజూ ప్రశ్నిస్తుందని అన్నారు. రామగుండంలో అభివృద్ధి కంటే కూల్చివేతలతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని విమర్శించారు. సమావేశంలో బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసిపేట శివాజీతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.

ఉద్యాన పంటలతో అధిక ఆదాయం పొందాలి

ఉద్యాన పంటలతో అధిక ఆదాయం పొందాలి

పెద్దపల్లి, ఆగస్టు 31(తెలంగాణ నేత్రం)
రైతులు వరి సాగుకే పరిమితం కాకుండా ఆయిల్‌పామ్, పండ్ల తోటలు, కూరగాయలు, పూల వంటి ఉద్యాన పంటలను సాగు చేసి అధిక ఆదాయం పొందాలని జిల్లా ఉద్యానశాఖ అధికారి గడ్డం శ్యామ్ ప్రసాద్ సూచించారు. ప్రభుత్వం వివిధ పథకాల కింద ఉద్యాన పంటలకు భారీగా సబ్సిడీలు అందిస్తోందన్నారు. పండ్ల తోటలకు రూ.36 వేల వరకు, కూరగాయల పందిళ్లకు ఎకరాకు రూ.లక్ష వరకు, డ్రిప్‌కు 70–90 శాతం వరకు రాయితీ ఉందని తెలిపారు. ఆయిల్‌పామ్ సాగుకు నాలుగేళ్లలో రూ.49 వేల వరకు సహాయం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. రైతులు తమ భూమి, నీటి వనరులు, మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా పంటలను ఎంచుకుని ప్రభుత్వ రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

22ఏ భూములపై ఆధారాలతోనే నిర్ణయాలు తీసుకోవాలి

22ఏ భూములపై ఆధారాలతోనే నిర్ణయాలు తీసుకోవాలి

ప్రైవేట్‌ భూముల సమస్యలను 48 గంటల్లో పరిష్కరించాలి: కలెక్టర్ కోయ శ్రీహర్ష

పెద్దపల్లి, ఆగస్టు 31(తెలంగాణ నేత్రం)
22ఏ నిషేధిత భూములకు సంబంధించిన వ్యవహారాల్లో పూర్తి ఆధారాలు, రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం మాత్రమే నిర్ణయాలు తీసుకోవాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష రెవెన్యూ అధికారులను ఆదేశించారు.

సోమవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలో అదనపు కలెక్టర్ బి. శ్రీరాములుతో కలిసి 22ఏ నిషేధిత భూముల జాబితాపై రెవెన్యూ అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలకు వస్తున్న ఫిర్యాదులు, భూముల రికార్డుల పరిశీలన, 22ఏ జాబితాలో భూములను చేర్చడం, తొలగించడం తదితర అంశాలపై అధికారులతో చర్చించారు.

22ఏ జాబితాలో చేర్చే ప్రతి భూమికి స్పష్టమైన ఆధారాలు ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఏదైనా ప్రైవేట్‌ భూమి పొరపాటున 22ఏ నిషేధిత జాబితాలో నమోదైనట్లు నిర్ధారణ అయితే, సర్వే నంబర్‌ వారీగా డిలీటెడ్‌ లిస్ట్‌ రూపొందించి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాలని సూచించారు. భూములను జాబితాలో చేర్చే సమయంలో అనుసరించే విధానాన్నే తొలగింపు ప్రక్రియలోనూ పాటించాలని ఆదేశించారు.

తొలగించే ప్రతి సర్వే నంబర్‌కు నిర్దిష్ట కారణాలు, స్పష్టమైన రిమార్క్స్‌ తప్పనిసరిగా నమోదు చేయాలని కలెక్టర్ తెలిపారు. జిల్లావ్యాప్తంగా 22ఏ భూముల పరిశీలన, తొలగింపు ప్రక్రియకు ఒకే ఫార్మాట్‌ను రూపొందించాలని సూచించారు.

ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా 22ఏ సమస్యలను పారదర్శకంగా, వేగంగా పరిష్కరించాలని, నిజమైన ప్రైవేట్‌ భూములకు సంబంధించిన సమస్యలను 48 గంటల్లో పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అదే సమయంలో ప్రభుత్వ భూముల పరిరక్షణ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడవద్దని స్పష్టం చేశారు.

ఫిర్యాదులపై అధికారులు సమన్వయంతో పనిచేస్తూ, సంబంధిత రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం మాత్రమే నిర్ణయాలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.

సమావేశంలో ఆర్డీఓ గంగయ్య, తహసీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

పొంగులేటి చేసిన పనికి తలలు పట్టుకుంటున్న అధికారులు

పొంగులేటి చేసిన పనికి తలలు పట్టుకుంటున్న అధికారులు

22A అంశంలో అధికారుల మెడకు చుట్టుకుంటున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తప్పిదాలు

అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ మాట్లాడి, 22A ద్వారా నిషేధిత జాబితాలో పెట్టిన భూములను వెంటనే తొలగించాలని ఆదేశాలు జారీ చేసిన CCLA కమిషనర్ లోకేష్ కుమార్, ఐఏఎస్

కలెక్టర్ల పరిధిలో లేకుండా, CCLA పరిధిలో ఉన్న భూములు తొలగించేందుకు కూడా వెంటనే ప్రతిపాదనలు పంపాలని ఆదేశాలు

ఆదివారం(ఈరోజు) నాడు దాదాపు 3 గంటలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో మాట్లాడిన CCLA కమిషనర్

హరీష్ రావు, ఇతర బీఆర్ఎస్ పార్టీ నాయకులు 22A అంశంపై ప్రజలతో కలిసి పోరాడుతున్నారని, కొద్ది రోజుల్లో అసెంబ్లీ కూడా మొదలవుతుందని, ఈలోగా నిషేధిత జాబితాలో పెట్టిన భూములు తొలగించాలని ఆదేశాలు

లేకపోతే అసెంబ్లీలో హరీష్ రావు ప్రభుత్వంపై విరుచుకుపడతాడని, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసిన చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ లోకేష్ కుమార్

సౌత్ ఇండియా ఓపెన్ కరాటేలో రామగుండం విద్యార్థుల సత్తా

సౌత్ ఇండియా ఓపెన్ కరాటేలో రామగుండం విద్యార్థుల సత్తా

గోదావరిఖని,(తెలంగాణ నేత్రం)
హుజురాబాద్‌లో ఆదివారం డబ్ల్యూ.ఎఫ్.ఎస్.కె.ఓ ఆధ్వర్యంలో బీఎస్‌ఆర్ గార్డెన్స్‌లో నిర్వహించిన సౌత్ ఇండియా ఓపెన్ కరాటే ఛాంపియన్‌షిప్‌–2026లో రామగుండానికి చెందిన జపాన్ షిటోరియో కరాటే స్కూల్ విద్యార్థులు సత్తా చాటారు. వివిధ రాష్ట్రాల నుంచి విద్యార్థులు పాల్గొన్న ఈ పోటీల్లో కాటాస్, కుమితి విభాగాల్లో రామగుండం విద్యార్థులు పలు పతకాలు సాధించారు.బ్లాక్ బెల్ట్ కాటాస్‌లో కీర్తి మహాజీ బంగారు పతకం సాధించగా, బ్లాక్ బెల్ట్ కుమితిలో ఎం. కార్తికేయన్ బంగారు, కీర్తి మహాజీ వెండి పతకాలు సాధించారు. కలర్ బెల్ట్ కాటాస్‌లో శివన్య, పి. వీర వెండి పతకాలు, నిహాల్ నందన్ కాంస్య పతకం సాధించారు. కలర్ బెల్ట్ కుమితిలో శివన్య బంగారు పతకం, పి. వీర వెండి పతకం, నిహాల్ నందన్ కాంస్య పతకం సాధించారు.పతకాలు సాధించిన విద్యార్థులను, కోచ్ కరాటే శ్రీనివాస్‌ను జపాన్ షిటోరియో కరాటే స్కూల్ అధ్యక్షుడు ఎం. రమేష్, సీనియర్ ఇన్‌స్పెక్టర్లు ఎస్. శ్రీనివాస్, శ్రావణ్ కుమార్ పటేల్, బి. పరమేష్, నిదిష్ కుమార్, రోహిత్ కుమార్ తదితరులు అభినందించారు. అలాగే స్పందన క్లబ్ సెక్రటరీ డా. కె. నరేంద్ర సోనీ, స్పోర్ట్స్ కౌన్సిల్ సెక్రటరీ శ్రీరామ్, విద్యార్థుల తల్లిదండ్రులు, ఇతర ప్రముఖులు అభినందనలు తెలిపారు.

గద్వాల ఫ్లై ఓవర్ బ్రిడ్జి పై..

గద్వాల ఫ్లై ఓవర్ బ్రిడ్జి పై..

మద్యం మత్తులో డివైడర్ ను ఢీకొట్టిన కారు….

కారు వదిలి వెళ్లిన కారు యజమాని

భారీగా ట్రాఫిక్ జాం

ట్రాఫిక్ ను క్లియర్ చేసిన గద్వాల ట్రాఫిక్ ఎస్ఐ బాలచంద్రుడు

జోగులాంబ గద్వాల జిల్లా:గద్వాల ఫ్లై ఓవర్ బ్రిడ్జి పై కారు నడుపుతూ మద్యం మత్తులో ఉన్న యువకుడు బ్రిడ్జి పై డివైడర్ ను ఢీకొనడం జరిగింది. డివైడర్ ను ఢీకొన్న అనంతరం మద్యం మత్తులో కారు నడుపుతున్న వ్యక్తి కారును వదిలి పరారైనట్లు సమాచారం. ఇతడు పెబ్బేరు మండలం రంగాపురం గ్రామానికి చెందిన వ్యక్తిగా సమాచారం. ఫ్లై ఓవర్ బ్రిడ్జి పై ప్రమాదం జరగడంతో వాహనాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సమాచారం తెలుసుకున్న గద్వాల ట్రాఫిక్ ఎస్ఐ బాలచంద్రడు తోపాటు వారి సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని ట్రాఫిక్ ను క్లియర్ చేసి వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చేశారు…

సత్యనారాయణ గౌడ్‌ను పరామర్శించిన తొట్ల తిరుపతి యాదవ్

సత్యనారాయణ గౌడ్‌ను పరామర్శించిన తొట్ల తిరుపతి యాదవ్

కరీంనగర్,(తెలంగాణ నేత్రం)
కరీంనగర్ మెడికవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సుందిళ్ల శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం చైర్మన్ కొరకొప్పుల సత్యనారాయణ గౌడ్‌ను మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తొట్ల తిరుపతి యాదవ్ పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఎల్లే రామ్మూర్తి, ముస్కుల నరేందర్ రెడ్డి, తీగల సమ్మయ్య, కండె పోషం తదితరులు పాల్గొన్నారు.

మంథని ఆర్టీసీ నిర్లక్ష్యం.. ప్రయాణికుల నరకయాతన!

మంథని ఆర్టీసీ నిర్లక్ష్యం.. ప్రయాణికుల నరకయాతన!

పావుగంటకో బస్సు నడపకపోతే బస్టాండ్ ముట్టడిస్తాం

ఎక్స్‌ప్రెస్ పేరుతో నడిరోడ్డుపై దింపేస్తే సహించేది లేదు

అధిక ఛార్జీల దోపిడీకి అడ్డుకట్ట వేయాలి.. వెంటనే బస్సులు పెంచాలి

ప్రజా సంఘాల డిమాండ్

మంథని,(తెలంగాణ నేత్రం)
మంథని ఆర్టీసీ డిపో పరిధిలో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సు సర్వీసులు అందుబాటులో లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మహాలక్ష్మి పథకం అమలులోకి వచ్చిన తర్వాత మహిళా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగినప్పటికీ, అందుకు అనుగుణంగా డిపోలో బస్సుల సంఖ్యను పెంచకపోవడంపై ప్రయాణికులు, ప్రజా సంఘాల నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

బస్సుల కోసం గంటల తరబడి బస్టాండ్‌లో వేచి చూడాల్సి వస్తోందని వృద్ధులు, విద్యార్థులు, మహిళలు, సాధారణ ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మంథని–కరీంనగర్, మంథని–గోదావరిఖని, మంథని–పెద్దపల్లి రూట్లలో నిత్యం తీవ్ర రద్దీ ఉంటుందని, ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని కనీసం ప్రతి పావుగంటకు ఒక ఆర్డినరీ బస్సును నడపాలని డిమాండ్ చేస్తున్నారు.

ఎక్స్‌ప్రెస్ పేరుతో అధిక ఛార్జీలు

ఆర్డినరీ బస్సులను ఎక్స్‌ప్రెస్ సర్వీసులుగా మార్చి ప్రయాణికుల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేయడం సరికాదని ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. అంతేకాకుండా ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ప్రయాణించే సామాన్యులు, మహిళలు, వృద్ధులను మార్గమధ్యంలోనే దింపేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రయాణికుల అవసరాలను పట్టించుకోకుండా ఇలాంటి విధానాలను అవలంబించడం వెంటనే నిలిపివేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

రద్దీ రోజుల్లో ప్రత్యేక సర్వీసులు

రాబోయే పండుగలు, ఆదివారాలు, సోమవారాల్లో ప్రయాణికుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉన్నందున ఆర్టీసీ అధికారులు ముందస్తు ప్రణాళికతో ప్రత్యేక బస్సు సర్వీసులు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. రద్దీకి అనుగుణంగా బస్సులు అందుబాటులో ఉంచకుండా ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేస్తే సహించేది లేదని హెచ్చరిస్తున్నారు.

బస్సులు పెంచకపోతే బస్టాండ్ ముట్టడి

ఇప్పటికైనా ఆర్టీసీ ఉన్నతాధికారులు స్పందించి మంథని డిపోలో బస్సుల సంఖ్యను పెంచాలని, ప్రతి ప్రధాన రూట్‌లో తరచూ సర్వీసులు నడపాలని ప్రయాణికులు, స్థానికులు, ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. సమస్యను వెంటనే పరిష్కరించకపోతే మంథని బస్టాండ్ ఎదుట పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టి, అవసరమైతే బస్టాండ్‌ను ముట్టడిస్తామని వారు హెచ్చరించారు.

వికసిత్ భారత్ సాకారం కావాలంటే డ్రగ్స్ రహిత దేశంగా మారాలి:ప్రధాని మోదీ

వికసిత్ భారత్ సాకారం కావాలంటే డ్రగ్స్ రహిత దేశంగా మారాలి:ప్రధాని మోదీ

భారతదేశం ‘వికసిత్ భారత్’గా అవతరించాలంటే దేశం తప్పనిసరిగా ‘మాదకద్రవ్య రహితం’గా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు.ఆదివారం తన నెలవారీ రేడియో ప్రసంగ కార్యక్రమంz ‘మన్ కీ బాత్’ 137వ ఎపిసోడ్ ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన ప్రధాని, దేశ భవిష్యత్తును కాపాడటమే ప్రభుత్వ సంకల్పమని స్పష్టం చేశారు. డ్రగ్స్ రహిత యువత, మత్తు లేని భారతదేశాన్ని నిర్మించడమే ప్రభుత్వ స్పష్టమైన లక్ష్యమని ప్రధాని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘వికసిత్ భారత్ కోసం నషా-ముక్త్ యువ’ (మత్తు రహిత యువత) ప్రచారాన్ని ఆయన కొనియాడారు. పెద్ద సంఖ్యలో ప్రజలు, ముఖ్యంగా యువత ఈ ప్రచారంలో ఉత్సాహంగా, చురుగ్గా భాగస్వాములవుతున్నారని హర్షం వ్యక్తం చేశారు.”మాదకద్రవ్యాల వ్యసనం మొత్తం కుటుంబాలను, సమాజాన్ని కబళిస్తుంది,” అని ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. “డ్రగ్స్ కు వ్యతిరేకంగా అవగాహన కల్పించే వారిని, వ్యసనంతో పోరాడుతున్న వ్యక్తులకు సహాయం చేయడానికి ముందుకు వచ్చే వారిని నేను అభినందిస్తున్నాను. మాదకద్రవ్యాల ప్రమాదాలను హైలైట్ చేస్తూనే, కోలుకునే మార్గాన్ని చూపే శక్తివంతమైన నినాదాలు, పాటలు, చిన్న నాటకాలను మీరు రూపొందించగలరా?” అని ప్రధాని పిలుపునిచ్చారు. అలాగే, మాదకద్రవ్యాలకు యువత ఎందుకు దూరంగా ఉండాలో వివరిస్తూ వివిధ ప్రాంతీయ భాషల్లో సమాచారాన్ని, కంటెంట్‌ను రూపొందించాలని కంటెంట్ క్రియేటర్లను ఆయన కోరారు.ఆగస్టు నెల భారతీయులలో దేశభక్తి భావాన్ని ఎలా నింపిందో ప్రధాని గుర్తు చేశారు. జాతీయ చేనేత దినోత్సవం, స్వాతంత్ర్య దినోత్సవం, జాతీయ అంతరిక్ష దినోత్సవం వంటి సందర్భాలు, అలాగే క్విట్ ఇండియా ఉద్యమం, విభజన విభీషిక స్మృతి దినం వార్షికోత్సవాలు ఈ నెలలోనే రావడం విశేషమన్నారు. ఆగస్టు నెలలో దేశంపై ప్రేమ ప్రతి ఒక్కరి హృదయంలో తీవ్రమవుతుందని ఆయన అన్నారు.’హర్ ఘర్ తిరంగా’ ప్రచారం ఈ భావాన్ని మరింత బలోపేతం చేసిందని ప్రధాని మోదీ అన్నారు. “వందేమాతరం 150వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నందున ఈ సంవత్సరం మరింత ప్రత్యేకంగా మారింది. త్రివర్ణ పతాక వేడుకలు భారతదేశానికే పరిమితం కాలేదు. ఈ సంవత్సరం, ‘సూర్యపథ్ తిరంగా’ చొరవ ద్వారా మన జెండా ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రత్యేకమైన ప్రయాణాన్ని చేపట్టింది,” అని ఆయన వివరించారు.’పీఎం స్వనిధి యోజన’ గురించి కూడా ప్రధాని మాట్లాడుతూ, ఈ పథకం దేశవ్యాప్తంగా 35 లక్షల మంది మహిళలు తమ వ్యాపారాలను విస్తరించుకోవడానికి దోహదపడిందని తెలిపారు. ఒక మహిళ వ్యాపారం పెరిగినప్పుడు, ఆమె మొత్తం కుటుంబ భవిష్యత్తు దానితో పాటు ముందుకు సాగుతుందని ఆయన అన్నారు.

నిరాధార ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నాం

నిరాధార ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నాం

మదర్‌ థెరిస్సా పొదుపు సమితి నిర్వాహకుల స్పష్టీకరణ

మంథని: మదర్‌ థెరిస్సా పొదుపు సమితిపై నామని హరికృష్ణ చేసిన ఆరోపణలు నిరాధారమని, వాటిని తీవ్రంగా ఖండిస్తున్నామని సమితి నిర్వాహకులు తెలిపారు. శనివారం మంథని డివిజన్ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సమితి లోడీ సంస్థ డివిజన్ కోఆర్డినేటర్ మేకల మల్లేశం మాట్లాడారు.

మహిళలకు ఆర్థికంగా చేయూత అందించాలనే ఉద్దేశంతో 2001 నవంబర్‌ 1న సమితిని ప్రారంభించామని, అప్పటి నుంచి సంస్థ అభివృద్ధి చెందుతూ కొనసాగుతోందన్నారు. సమితికి సంబంధించిన లెక్కలు, వాస్తవాలు తమ వద్ద ఉన్నాయని, వాటిని మీడియా ముందు వెల్లడించామని తెలిపారు.

సమితి అధ్యక్షురాలు మాదేశి పద్మ, కోశాధికారి నామని సుగుణ మాట్లాడుతూ.. సంస్థ ప్రతిష్ఠను దెబ్బతీసేలా నిరాధార ఆరోపణలు చేయడం సరికాదన్నారు. తప్పుడు ఆరోపణలపై సంబంధిత అధికారులు సమగ్రంగా విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో సమితి డైరెక్టర్లు, సభ్యులు పాల్గొన్నారు.

మంత్రి శ్రీధర్‌బాబుతో మారిషస్ మంత్రి భేటీ

మంత్రి శ్రీధర్‌బాబుతో మారిషస్ మంత్రి భేటీ

హైదరాబాద్‌: డా. బీఆర్‌ అంబేద్కర్‌ తెలంగాణ సచివాలయంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబును మారిషస్‌ పబ్లిక్‌ సర్వీస్‌, అడ్మినిస్ట్రేటివ్‌ రిఫార్మ్స్‌ శాఖ మంత్రి లుచ్‌మనన్‌ పెంతియా శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ–మారిషస్‌ మధ్య పరిపాలన, టూరిజం, ఐటీ/ఐటీఈఎస్‌, ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌, నైపుణ్యాభివృద్ధి, విద్యా రంగాల్లో సహకారంపై చర్చించారు. మారిషస్‌ ప్రభుత్వ ఉద్యోగుల సామర్థ్యాభివృద్ధికి తెలంగాణ సహకరించాలని పెంతియా కోరారు. రాష్ట్రంలోని ఎంసీహెచ్‌ఆర్‌డీ, యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీతో కలిసి పనిచేయడానికి ఆసక్తి ఉందన్నారు. అన్ని రంగాల్లో సహకారానికి తెలంగాణ సిద్ధంగా ఉందని శ్రీధర్‌బాబు తెలిపారు. డిసెంబర్‌ 7, 8 తేదీల్లో జరిగే తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌–2026కు మారిషస్‌ మంత్రిని ఆయన ఆహ్వానించారు.

మాదిగ విలేకరులకు ఘన సన్మానం

మాదిగ విలేకరులకు ఘన సన్మానం

మంథని: ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో మాదిగ సామాజిక వర్గానికి చెందిన విలేకరులు బూడిద రాజు, కొయ్యల రాజమల్లు, తగరం రాజులను ఘనంగా సన్మానించారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో విలేకరుల పాత్ర కీలకమని ఎమ్మార్పీఎస్ నాయకులు పేర్కొన్నారు. అణగారిన వర్గాల సమస్యలను ప్రజలు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ సామాజిక బాధ్యతను నిర్వర్తిస్తున్న జర్నలిస్టుల సేవలను అభినందించారు. కార్యక్రమంలో పలువురు ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

నిరుద్యోగ యువత, మహిళలకు ఉచిత వృత్తి శిక్షణ

నిరుద్యోగ యువత, మహిళలకు ఉచిత వృత్తి శిక్షణ

రామగుండం, ఆగస్టు 29: నిరుద్యోగ యువతీ యువకులు, మహిళలకు స్వయం ఉపాధి కల్పించడంతో పాటు నైపుణ్యాలను అభివృద్ధి చేసేందుకు సింగరేణి సేవా సమితి, రామగుండం ఏరియా–1 ఆధ్వర్యంలో ఉచిత వృత్తి శిక్షణా కోర్సులను నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. టైలరింగ్, బ్యూటీషియన్, ఫ్యాషన్ డిజైనింగ్, మగ్గం వర్క్, స్పోకెన్ ఇంగ్లీష్, జూట్–బంజారా బ్యాగ్స్ తయారీ, ఫోటోషాప్, కంప్యూటర్ డి.టి.పి. కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. శిక్షణ పూర్తి చేసిన వారికి ధృవీకరణ సర్టిఫికెట్లు అందజేస్తామని తెలిపారు. సింగరేణి ఉద్యోగులు, మాజీ ఉద్యోగుల పిల్లలు, కుటుంబ సభ్యులతో పాటు సింగరేణి ప్రభావిత, పరిసర ప్రాంతాల నిరుద్యోగ యువతీ యువకులు, మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆసక్తి గల అభ్యర్థులు 2 పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు, ఆధార్ కార్డు, స్టడీ సర్టిఫికెట్ జిరాక్స్ ప్రతులతో రామగుండం ఏరియా–1 జీఎం కార్యాలయంలోని పర్సనల్ విభాగం, సింగరేణి సేవా సమితి కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. అలాగే శిక్షణ అందించేందుకు అర్హత, అనుభవం కలిగిన ఫ్యాకల్టీలు తమ విద్యార్హతలు, అనుభవం, ధృవీకరణ పత్రాలతో సెప్టెంబర్ 10లోపు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు.

కాంగ్రెస్‌ మోసాలపై కదం తొక్కాలి: పుట్ట మధూకర్‌

కాంగ్రెస్‌ మోసాలపై కదం తొక్కాలి: పుట్ట మధూకర్‌

మంథని: కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌ ఆరోపించారు. శనివారం రాజగృహాలో నియోజకవర్గంలోని మండలాల నాయకులతో సమావేశం నిర్వహించిన ఆయన, కేటీఆర్‌ పిలుపు మేరకు సెప్టెంబర్‌ 2 నుంచి వారం రోజుల పాటు ప్రతి మండల కేంద్రంలో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీల అమలులో కాంగ్రెస్‌ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, గ్యారెంటీ కార్డులతో నిరసనలు నిర్వహించి ప్రభుత్వ తీరును ఎండగట్టాలని కార్యకర్తలకు సూచించారు.

ఏజీఎం పల్లెర్ల నాగేశ్వరరావుకు ఘన వీడ్కోలు

ఏజీఎం పల్లెర్ల నాగేశ్వరరావుకు ఘన వీడ్కోలు

రామగిరి: పన్నూర్ గ్రామపంచాయతీ పరిధిలోని సీఏన్ సీఓఏ క్లబ్‌లో రామగుండం రీజియన్ సివిల్ క్వాలిటీ కంట్రోల్ సెల్ ఏజీఎం పల్లెర్ల నాగేశ్వరరావు పదవీ విరమణ సందర్భంగా వీడ్కోలు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఆర్జీ-3 జీఎం సుంకరి మధుసూదన్, మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తోట్ల తిరుపతి యాదవ్ ఆయనను శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేశారు. సంస్థకు నాగేశ్వరరావు అందించిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో సివిల్ డీజీఎం రాజేంద్రకుమార్, సర్పంచ్ వనం రామచంద్రరావు, మాజీ సర్పంచ్ తీగల సమ్మయ్య, ఐఎన్‌టీయూసీ నాయకులు బెల్లం శ్రీనివాస్, సింగరేణి ఉద్యోగులు, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.

నీట్‌-పీజీ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు

నీట్‌-పీజీ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు

నీట్‌-పీజీ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు : పెద్దపల్లి జిల్లాలో ఆగస్టు 30న నిర్వహించనున్న నీట్‌-పీజీ 2026 పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. పెద్దపల్లి, రామగిరి మండలాల్లోని మూడు పరీక్షా కేంద్రాలను డీసీపీ రామ్‌రెడ్డితో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఉదయం 7:30 నుంచి 8:45 గంటల వరకు మాత్రమే అభ్యర్థులను కేంద్రాల్లోకి అనుమతిస్తామని తెలిపారు. విద్యుత్, వైద్యం, పోలీస్ బందోబస్తు, సీసీటీవీ, మొబైల్ జామర్లతో భద్రతా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పరీక్ష పర్యవేక్షణకు రెండు ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

భద్రాచలం కాంగ్రెస్ ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు పీఏపై కేసు నమోదు

భద్రాచలం కాంగ్రెస్ ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు పీఏపై కేసు నమోదు

భద్రాచలం కాంగ్రెస్ ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు పీఏపై కేసు నమోదు : ప్రభుత్వ ఉద్యోగాల పేరిట దాదాపు రూ.8 నుంచి రూ.10 కోట్లు వసూలు చేసి, ఫేక్ అపాయింట్‌మెంట్ ఆర్డర్లు ఇచ్చిన తెల్లం వెంకటరావు పీఏ కళ్యాణ్ కుమార్ఏజెన్సీలో టీచర్ ఉద్యోగాలు, థర్మల్ పవర్ ప్లాంట్‌లో ఉద్యోగాలు, ఐటీసీ పేపర్ బోర్డులో ఉద్యోగాలు ఇప్పిస్తానని, ఒక్కో నిరుద్యోగి దగ్గర రూ.30 లక్షల వరకు అక్రమ వసూళ్లుఏడు నెలల క్రితమే విషయం తెలిసినా తన పీఏపై ఎలాంటి చర్యలు తీసుకోని తెల్లం వెంకటరావుబాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులుమూడు రోజులుగా పరారీలో ఉన్న కళ్యాణ్ కుమార్

గులాబీ దళంలో సీట్ల రాజకీయ వేడి..

గులాబీ దళంలో సీట్ల రాజకీయ వేడి..

సిట్టింగ్‌లకు చెక్..

కొత్త ముఖాలకే ప్రాధాన్యం?

గులాబీ దళంలో సీట్ల రాజకీయ వేడి.. : తెలంగాణ గులాబీ దళంలో ‘సీట్ల’ రాజకీయం ఊపందుకుంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే ఏకైక ప్రామాణికంగా భారత్ రాష్ట్ర సమితి అధినాయకత్వం వ్యూహాలకు పదును పెడుతోంది.

గతంలో పాటించిన సాంప్రదాయాలకు భిన్నంగా, ఈసారి నియోజకవర్గాల్లో అసంతృప్తిని ఎదుర్కొంటున్న ప్రస్తుత ఎమ్మెల్యేలు (సిట్టింగ్లు) చాలా మందికి టికెట్ల కోత తప్పదని సమాచారం. నియోజకవర్గాల్లో పట్టు కోల్పోయిన సిట్టింగ్లకు చెక్ పెట్టి, కొత్త ముఖాలకు అవకాశం ఇవ్వడమే లక్ష్యంగా పార్టీ అధిష్టానం కసరత్తు వేగవంతం చేసినట్లు సమాచారం.

ఆలోచనలో గులాబీ..

తెలంగాణలో నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్ గా గులాబీ పార్టీ పావులు కదుపుతోంది. అందులో భాగంగా ఇప్పటి నుంచే యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తోంది. పార్టీలో ఉన్న సిట్టింగులను పక్కనబెట్టి కొత్త ముఖాలకు వచ్చే ఎన్నికల్లో అవకాశం ఇవ్వాలనే ఆలోచనలో గులాబీ పార్టీ ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగులను మార్చకపోవడంతోనే అధికారం కోల్పోయామనిఅనేక సందర్భాల్లో బీఆర్ఎస్ నేతలు సైతం కామెంట్స్ చేశారు.దీంతో ప్రస్తుతం ఉన్న గులాబీసిట్టింగులను మార్చి కొత్త వారికి ఛాన్స్ ఇవ్వడం ద్వారా వారి క్లిన్ ఇమేజ్ గెలుపునకు దోహదం చేస్తుందని అధిష్టానం లెక్కలు వేస్తోందని సమాచారం.

ఆడబిడ్డ మనసు గాయపడింది’..

ఆడబిడ్డ మనసు గాయపడింది’..

నాకూ ఆత్మగౌరవం ఉంటుంది..

రాఖీ పండుగ పూట కవిత ఎమోషనల్ కామెంట్స్

ఆడబిడ్డ మనసు గాయపడింది’.. : రక్షా బంధన్ (రాఖీ పండుగ) వేళ తెలంగాణ రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. తన సోదరుడు, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తీరుపై టీఆర్ఎస్ పార్టీ అధినేత్రి, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు.

పండుగ రోజున కేటీఆర్ అందుబాటులో లేకపోవడంపై ఆమె తీవ్ర తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పండుగ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కవిత, సోదరుడి వ్యవహార శైలిపై మనస్తాపం చెందారు. “గత ఏడాది రాఖీ పండుగ సమయంలో ఆయన నగరంలో లేకుండా వెళ్లిపోయారు. కానీ ఈసారి ఏకంగా దేశంలోనే లేకుండా పారిపోయారు” అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పండుగ రోజున అన్నకు రాఖీ కట్టలేకపోవడంపై తన ఆవేదనను వెళ్లగక్కారు.

నాకూ ఆత్మగౌరవం ఉంటుంది..

కుటుంబంలోనూ, రాజకీయాల్లోనూ జరుగుతున్న పరిణామాలపై స్పందిస్తూ.. “ఒక ఆడబిడ్డగా నాక్కూడా ఆత్మగౌరవం ఉంటుంది. ఆయన ప్రవర్తించిన తీరుతో నేను కూడా చాలా హర్ట్ అయ్యాను” అని పేర్కొన్నారు. రాఖీ పండుగ అనేది పవిత్రమైన రక్తసంబంధానికి సంకేతమని, దానిని రాజకీయాలతో ముడిపెట్టకూడదని హితవు పలికారు. “రాఖీ అంటే రక్తసంబంధం.. రాజకీయం కాదు” అని ఆమె స్పష్టం చేశారు. కాగా, రాఖీ పండుగ పూట కవిత చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి.

ఇంటి దొంగలకు మంత్రి పొంగులేటి క్లాస్..!

ఇంటి దొంగలకు మంత్రి పొంగులేటి క్లాస్..!

విభేదాలకు స్వస్తి.. ఐక్యతే లక్ష్యం

గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలి

ఇంటి దొంగలకు మంత్రి పొంగులేటి క్లాస్..! : కూసుమంచి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక సూచనలు చేశారు.

పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడంతో పాటు నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం పెంచుకోవాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు తగిన ప్రాధాన్యత ఇస్తూ అందరినీ కలుపుకొని ముందుకు సాగాలని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పార్టీలో అంతర్గత విభేదాలు, వ్యక్తిగత విభేదాలకు తావివ్వకుండా నాయకులు సమన్వయంతో వ్యవహరించాలని మంత్రి సూచించినట్లు సమాచారం. పార్టీకి నష్టం కలిగించేలా ఎవరైనా వ్యవహరిస్తే అలాంటి విషయాలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలని, పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించే చర్యలను సహించేది లేదని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. పార్టీలో ఉంటూ పార్టీ ప్రయోజనాలకు విరుద్ధంగా పనిచేసే “ఇంటి దొంగల” విషయంలో నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించినట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో కష్టపడి పనిచేసిన నాయకులు, కార్యకర్తలే పార్టీకి వెన్నెముక అని మంత్రి పేర్కొన్నట్లు సమాచారం. క్షేత్రస్థాయిలో కార్యకర్తలకు ఎదురయ్యే సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి నాయకులు చొరవ చూపాలని సూచించారు. నాయకుల మధ్య ఏవైనా అభిప్రాయ భేదాలు ఉంటే వాటిని బహిరంగంగా చర్చించకుండా పార్టీ వేదికపై పరిష్కరించుకోవాలని, వ్యక్తిగత విమర్శలకు దూరంగా ఉండాలని సూచించినట్లు తెలుస్తోంది.

గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలి

కూసుమంచి మండలంలోని ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని మంత్రి సూచించారు. గ్రామాల్లో పార్టీ కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉండాలని, ప్రజల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయాలని చెప్పారు. ప్రతి గ్రామంలో పార్టీకి బలమైన కార్యకర్తల బృందాన్ని ఏర్పాటు చేసుకుని, ప్రజలతో నిరంతరం సంబంధాలు కొనసాగించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత పార్టీ నాయకులు, కార్యకర్తలపై ఉందన్నారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలతో లబ్ధి పొందుతున్న ప్రజలకు వాటి వివరాలను వివరించాలని సూచించారు. ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా నాయకులు సహకరించాలని అన్నారు.

కార్యకర్తలకు అండగా నిలవాలి

పార్టీ కోసం నిరంతరం పనిచేస్తున్న కార్యకర్తలకు నాయకత్వం అండగా నిలవాలని మంత్రి సూచించారు. గ్రామస్థాయిలో కార్యకర్తల అభిప్రాయాలను తెలుసుకుని వారి సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. పార్టీ కార్యక్రమాలను విజయవంతం చేయడంలో కార్యకర్తల పాత్ర కీలకమని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. రాబోయే రోజుల్లో కూసుమంచి మండలంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నాయకులు సమష్టిగా పనిచేయాలని మంత్రి పిలుపునిచ్చారు. వ్యక్తిగత ప్రయోజనాలు, పదవుల కోసం కాకుండా పార్టీ సిద్ధాంతాలు, ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పనిచేయాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలకు కట్టుబడి, పార్టీ క్రమశిక్షణను పాటిస్తూ ముందుకు సాగాలని స్పష్టం చేశారు.

విభేదాలకు స్వస్తి.. ఐక్యతే లక్ష్యం

మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు నాయకులు, కార్యకర్తలంతా ఐక్యంగా పనిచేస్తేనే పార్టీ మరింత బలపడుతుందని మంత్రి పేర్కొన్నట్లు సమాచారం. చిన్నచిన్న విభేదాలను పక్కనపెట్టి పార్టీ కోసం అందరూ ఒకే తాటిపైకి రావాలని సూచించారు. పార్టీని బలహీనపరిచే ప్రయత్నాలకు అవకాశం ఇవ్వకుండా నాయకులు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. “పదవులు, వ్యక్తిగత ప్రయోజనాల కంటే పార్టీ ప్రయోజనాలే ముఖ్యమని.. కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త బాధ్యతగా పనిచేయాలి. ప్రజల్లో పార్టీకి మరింత విశ్వసనీయత పెంచేలా సమన్వయంతో ముందుకు సాగాలి” అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించినట్లు సమాచారం.

నేపాల్ వరదల్లో హైదరాబాద్ యువతి గల్లంతు

నేపాల్ వరదల్లో హైదరాబాద్ యువతి గల్లంతు

నేపాల్ వరదల్లో హైదరాబాద్ యువతి గల్లంతు : నేపాల్ వరదల్లో హైదరాబాద్ లోని ఎల్బీనగర్ కు చెందిన యువతి గల్లంతయింది. ఎల్బీనగర్ పరిధిలోని వాస్తు కాలనీకి చెందిన సుహాసిని రెడ్డి అనే యువతి నేపాల్ లో సంభవించిన భారీ వరదల్లో చిక్కుకుని గల్లంతయ్యారు.

విషయం తెలుసుకున్న వాస్తు కాలనీలో ప్రజలు కన్నీటి పర్యంతమయ్యారు. వివరాల్లోకి వెళితే.. నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామానికి చెందిన కందిమల్ల మహేందర్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఎల్బీనగర్ వాస్తు కాలనీలో ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. సుహాసిని రెడ్డి ఉన్నత చదువులు చదివింది.

కాగా 2004లో నల్గొండ జిల్లా మునుగోడు మండలం గూడపూర్ గ్రామానికి చెందిన సంజీవరెడ్డితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. సుహాసిని రెడ్డి, సంజీవరెడ్డి ఇద్దరు భార్యాభర్తలు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ లుగా పనిచేస్తున్నారు. మొదటగా న్యూజిలాండ్ దేశానికి వెళ్లి, స్థిరపడ్డారు. ఉద్యోగరీత్యా ఆస్ట్రేలియాకు వెళ్లారు. ఈ క్రమంలో అమెరికా నుంచి వచ్చిన తన స్నేహితురాలితో కలిసి సుహాసిని రెడ్డి ఆస్ట్రేలియా నుంచి ఈ నెల 19న హైదరాబాద్ కు చేరుకున్నారు. ఆస్ట్రేలియా నుంచి మరో స్నేహితురాలితో మానస సరోవరం యాత్ర టికెట్స్ ను మూడు నెలల క్రితం బుక్ చేసుకుంధి

ఈ క్రమంలో సుహాసిని రెడ్డి హైదరాబాద్ నుంచి వెళ్లగా ఆమె స్నేహితురాలు ఆస్ట్రేలియా నుంచి నేపాల్ రాజధాని ఖాట్మండుకు వచ్చింది. ఆదివారం అక్కడ ఇద్దరు కలిశారు. అనంతరం టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా మొత్తంగా 29 మందితో కలిసి మానస సరోవరం యాత్రకి వెళ్తున్నట్లు సుహాసిని రెడ్డి తన కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. కాగా మంగళవారం రాత్రి 8 గంటల నుంచి సుహాసిని రెడ్డి ఫోన్ కలవకపోవడం కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. సుహాసిని రెడ్డి వెళ్లిన ప్రాంతాల్లో వరదలు వచ్చాయని తెలియడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఇప్పటి వరకు సుహాసిని రెడ్డి ఆచూకీ లభించలేదని ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా సమాచారం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారత ప్రభుత్వం వెంటనే మానస సరోవరం యాత్రికుల వివరాలు, సమాచారం చెప్పాలని యాత్రీకులను సురక్షితంగా తీసుకురావాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

యూపీలో NDAకు షాక్,

యూపీలో NDAకు షాక్,

పెరుగుతున్న INDIA గ్రాఫ్..

తాజా సర్వేలో షాకింగ్ ఫలితాలు

యూపీలో NDAకు షాక్,:ఇప్పటికిప్పుడు లోక్ సభ ఎన్నికలు జరిగితే యూపీలో ఎన్డీఏకు షాక్ తప్పదు అనేలా ఓ సర్వేలో షాకింగ్ ఫలితాలు వచ్చాయి. లోక్ సభ ఎన్నికలపై మూడ్ ఆఫ్ నేషన్ సంస్థ ఆగస్టు 2026కు సంబంధించి నర్వే నిర్వహించింది.

ఈ సర్వేలో ఇండియా కూటమికి 41 సీట్లు వస్తాయని తేలింది. ఎన్డీఏ కూటమికి 38 సీట్లు వస్తాయని తేలింది. జనవరి సర్వేతో పోలిస్తే ఎన్డీఏ 48 నుండి 38కి పడిపోగా, ఇండియా కూటమి 31 నుండి 41కి పెరగడం ఆశ్చర్యకరం. ఓట్ల శాతం విషయానికి వస్తే ఇండియా కూటమికి 40 శాతం ఓట్లు వస్తాయని ఫలితాలు చెబుతున్నాయి.
ఇది జనవరి సర్వేతో పోలిస్తే 2శాతం ఓట్లు తగ్గుతాయని సూచిస్తోంది. సర్వేలో అయోధ్యలోని రామ మందిర విరాళాల దొంగతనం వివాదం మోడీ, మోగి ప్రభుత్వాలు రెండింటిపై ప్రతికూల ప్రభావం చూపించిందని 47శాతం మంది అభిప్రాయపడ్డారు. అదే సమయంలో ఇది కేవలం కేంద్రాన్ని ప్రభావితం చేసిందని 8శాతం మంది, యూపీ ప్రభుత్వంపై మాత్రమే ప్రభావం చూపించిందని 7శాతం మంది అభిప్రాయపడ్డారు. ఇక ఈ ఫలితాల చూసిన తరవాత ఉత్తర భారతదేశంలో పెరుగుతున్న యాంటీ ఇన్ కంబెన్సీకి ఈ రిజల్ట్స్ కారణమా అని విశ్లేషకులు భావిస్తున్నారు

మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్

మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్

హరీష్ రావు పట్ల పోలీసుల దురుసు ప్రవర్తన

మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్ : కనీసం వాహనం కూడా ఎక్కించకుండాకలెక్టరేట్ నుంచి పోలీస్ స్టేషన్‌కు కాలినడకన హరీష్ రావుని తరలించిన పోలీసులుహనుమకొండ కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తతTNGO ధర్నాలో పాల్గొన్న హరీష్ రావుని అరెస్ట్ చేసిన పోలీసులుపాలిటెక్నిక్ విద్యార్థులను కలవకుండా అదుపులోకి తీసుకొని.. సుబేదారి పోలీస్ స్టేషన్‌కు తరలింపుపోలీసుల తీరుపై మండిపడుతున్న బీఆర్ఎస్ శ్రేణులు

suryapet bus accident : బస్సు-కంటైనర్‌ – “ఢీ”

suryapet bus accident : బస్సు-కంటైనర్‌ – “ఢీ”

6గురు మృతి

20 మందికి తీవ్ర గాయాలు

దొరకుంట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

బస్సు-కంటైనర్‌ – “ఢీ”, రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మహిళలు సహా ఆరుగురు మృతి

ఏలూరు వెళ్తున్న బస్సుకు ఘోర ప్రమాదం..దొరకుంట శివారులో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

హైదరాబాద్‌ నుంచి ఏలూరు వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు ఆగి ఉన్న కంటైనర్‌ లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు.

ప్రమాద సమయంలో బస్సులో 42 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే కోదాడ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది…

హైదరాబాద్లో 11 మంది నకిలీ వైద్యుల అరెస్టు

హైదరాబాద్లో 11 మంది నకిలీ వైద్యుల అరెస్టు

హైదరాబాద్ నగరంలో నకిలీ వైద్యుల ముఠాపై టాస్క్ఫోర్స్

పోలీసులు చర్యలు చేపట్టారు. జూబ్లీహిల్స్, సికింద్రాబాద్పరిధిలో జరిగిన ఆపరేషన్లో 11 మంది నకిలీ డాక్టర్లనుఅదుపులోకి తీసుకున్నారు. వీరు ఇతర రాష్ట్రాల ప్రముఖవిశ్వవిద్యాలయాల పేరుతో నకిలీ డిగ్రీ సర్టిఫికెట్లు సృష్టించి,నగరంలో క్లినిక్లు తెరిచి అల్లోపతి వైద్యం అందిస్తున్నట్లుప్రాథమిక విచారణలో తేలింది. అర్హత లేకపోయినా రోగులప్రాణాలతో చెలగాటమాడుతున్న వీరిపై పోలీసులు లోతుగా
విచారణ జరుపుతున్నారు. ప్రజలు అప్రమత్తంగాఉండాలని అధికారులు సూచించారు..

తెలంగాణలో డిసెంబర్ నెలలో రెండో దశ స్థానిక సంస్థల ఎన్నికలు

తెలంగాణలో డిసెంబర్ నెలలో రెండో దశ స్థానిక సంస్థల ఎన్నికలు

ఎస్ఐఆర్ ప్రక్రియ ముగిశాక ఎన్నికల ప్రక్రియ మొదలయ్యే అవకాశం..

సైబరాబాద్, మల్కాజ్‌గిరి, హైదరాబాద్, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లకు ఈ ఏడాది డిసెంబర్ నెలలో ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనలో తెలంగాణ ప్రభుత్వంవివిధ కారణాల వల్ల ఆగిపోయిన అచ్చంపేట, మందమర్రి, మణుగూరు, నకిరేకల్, కొత్తూరు, సిద్ధిపేటకు కూడా అదే నెలలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు సమాచారం

హెడ్ కానిస్టేబుల్ ఇంట్లోనే దొంగతనం

హెడ్ కానిస్టేబుల్ ఇంట్లోనే దొంగతనం

Aug 25, 2026, హెడ్ కానిస్టేబుల్ ఇంట్లోనే దొంగతనం ఆంధ్రప్రదేశ్ : కర్నూలు శ్రీనివాస నగర్‌లో హెడ్ కానిస్టేబుల్ మహేష్, ఆర్‌ఎస్‌ఐ సుబ్బయ్య ఇళ్లలో చోరీ జరిగింది. దొంగలు భారీగా బంగారం, వెండి ఆభరణాలు, నగదు అపహరించారు. తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకున్న దొంగలు, సుమారు 23 తులాల బంగారం, 6 తులాల వెండి (మహేష్ ఇంట్లో), 5 తులాల బంగారం, 5 తులాల వెండి, రూ. 30 వేల నగదు (సుబ్బయ్య ఇంట్లో) దోచుకున్నారు. ఒకే ప్రాంతంలో పోలీసుల ఇళ్లల్లో వరుస దొంగతనాలు జరగడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. పోలీసులు సీసీ టీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తూ, అనుమానితుల కోసం గాలిస్తున్నారు.

కాలువ ఆక్రమణ.. ప్రమాదకర భవనాలు కూల్చివేత

కాలువ ఆక్రమణ.. ప్రమాదకర భవనాలు కూల్చివేత

Aug 25, 2026, కాలువ ఆక్రమణ.. ప్రమాదకర భవనాలు కూల్చివేతతెలంగాణ : గచ్చిబౌలి అంజయ్య నగర్ లో కూలిన భవనం సమీపంలోని మరికొన్ని ప్రమాదకర భవనాలను ఆదివారం సాయంత్రం నుండి అధికారులు కూల్చివేస్తున్నారు. వరద కాలువను ఆక్రమించి, అనుమతికి మించి ఏడెనిమిది అంతస్తులు నిర్మించడం వల్ల భవనం పటిష్టత దెబ్బతిన్నట్లు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ప్రాథమికంగా గుర్తించారు. ఈ ఘటనలో మరణించిన కూలీల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలవాలని స్థానికులు కోరుతున్నారు. భవన నిర్మాణదారుడు సయ్యద్ సాజిద్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

నేడు దేవాదుల ఎత్తిపోతల పథకంపై మంత్రి ఉత్తమ్ సమీక్ష

నేడు దేవాదుల ఎత్తిపోతల పథకంపై మంత్రి ఉత్తమ్ సమీక్ష

Aug 25, 2026, నేడు దేవాదుల ఎత్తిపోతల పథకంపై మంత్రి ఉత్తమ్ సమీక్షతెలంగాణ : దేవాదుల ఎత్తిపోతల పథకం పురోగతిపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మంగళవారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమీక్షలో ప్యాకేజీల వారీగా ప్రాజెక్టు భౌతిక, ఆర్థిక పురోగతిని అధికారులు మంత్రికి వివరించనున్నారు. ప్రాజెక్టు పూర్తికి ఆటంకంగా మారిన భూసేకరణ సమస్యల పరిష్కారంపై మంత్రి ప్రత్యేక దృష్టి సారించనున్నారు. సాంకేతిక, పరిపాలనాపరమైన సమస్యలను త్వరితగతిన పరిష్కరించి, మిగిలిన పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించనున్నారు.

నేడు క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల అర్హుల తుది జాబితా విడుదల

నేడు క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల అర్హుల తుది జాబితా విడుదల

Aug 25, 2026, నేడు క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల అర్హుల తుది జాబితా విడుదలతెలంగాణ : హైదరాబాద్ క్యూఆర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నవారికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. నేడు ఇందిరమ్మ ఇళ్ల అర్హుల తుది జాబితా విడుదల చేయనుంది. ఆగస్ట్ 27 నుంచి 30వ తేదీ వరకు లాటరీ తీయనున్నారు. క్యూర్ పరిధిలో 16 నియోజకవర్గాల్లో ఇండ్ల కోసం 60,720 మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే దరఖాస్తుదారులు ఇందిరమ్మ ఇళ్లకు అర్హత సాధించారా.. లేదా అనేది tghb.telangana.gov.in వెబ్‌సైట్‌ ద్వారా వివరాలు చెక్ చేసుకోవచ్చు. అలాగే 040-24603572 కాల్ సెంటర్ను సంప్రదించవచ్చని హౌసింగ్ బోర్డు వీసీ తెలిపారు.

పిల్లలు ఆకలితో పాఠశాలకు వెళ్లకూడదు: మంత్రి శ్రీధర్‌బాబు

పిల్లలు ఆకలితో పాఠశాలకు వెళ్లకూడదు: మంత్రి శ్రీధర్‌బాబు

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పోషకాహారంతో అల్పాహారం

గంటలో 10 వేల ఇడ్లీలు, 3 వేల దోసెలు, 5,600 పూరీల తయారీ సామర్థ్యం

మంథని, ఆగస్టు 24: పిల్లలు ఆకలితో పాఠశాలకు వెళ్లే పరిస్థితి ఉండకూడదని, ప్రతి ప్రభుత్వ పాఠశాల విద్యార్థికి పోషకాహారంతో కూడిన అల్పాహారం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. విద్యార్థుల ఆరోగ్యం, శారీరక ఎదుగుదలతో పాటు చదువుపై ఏకాగ్రత పెంచేందుకు అల్పాహార పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు.మంథనిలో సింగరేణి సంస్థ సీఎస్‌ఆర్‌ నిధులతో సుమారు రూ.7.5 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన ఆధునిక సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్‌ను సోమవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి మంత్రి ప్రారంభించారు. అనంతరం కిచెన్‌లో తయారు చేసిన అల్పాహారాన్ని విద్యార్థులతో కలిసి స్వీకరించి వారి అనుభవాలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మార్గదర్శకత్వంలో తొలుత కొడంగల్ నియోజకవర్గంలో ప్రయోగాత్మకంగా పాఠశాల విద్యార్థులకు అల్పాహార పథకాన్ని ప్రారంభించామని చెప్పారు. ఈ పథకం అమలుతో కొడంగల్ నియోజకవర్గంలో విద్యార్థుల హాజరు 21 శాతం పెరిగిందని తెలిపారు. ప్రస్తుతం కొడంగల్‌తో పాటు మధిరలోనూ ఈ పథకం అమలవుతోందన్నారు.మంథనిలో ఏర్పాటు చేసిన సెంట్రలైజ్డ్ కిచెన్‌లో ఆధునిక యంత్రాల సాయంతో గంటకు 10 వేల ఇడ్లీలు, 3 వేల దోసెలు, 5,600 పూరీలు తయారు చేసే సామర్థ్యం ఉందని మంత్రి తెలిపారు. విద్యార్థులకు ప్రతిరోజూ విభిన్న రకాల అల్పాహారం అందించేలా ప్రత్యేక మెనూను రూపొందించామని, వారానికి కనీసం మూడు సార్లు పాలు అందించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామని చెప్పారు.హరే రామ హరే కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 2011లో ఆసుపత్రుల్లోని రోగుల సహాయకులకు ఆహారం అందించే కార్యక్రమం ప్రారంభమైందని మంత్రి గుర్తుచేశారు. ‘పది మైళ్ల పరిధిలో ఒక్కరు కూడా ఆకలితో ఉండకూడదు’ అనే ఏ.సి. భక్తివేదాంత స్వామి ప్రభుపాద సందేశం తెలంగాణ ప్రభుత్వానికి స్ఫూర్తిగా నిలిచిందన్నారు.విద్యార్థుల భవిష్యత్తే లక్ష్యంవిద్యార్థులతో కలిసి అల్పాహారం తీసుకున్న మంత్రి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గతంలో ఆహారం లేకుండానే పాఠశాలకు హాజరైన పరిస్థితి ఉండేదని ఓ విద్యార్థిని తన కష్టాలను మంత్రికి వివరించింది. ఇలాంటి పరిస్థితులను విద్యార్థులు ఇకపై ఎదుర్కోకుండా చూడటమే ప్రభుత్వ లక్ష్యమని శ్రీధర్‌బాబు అన్నారు. పోషకాహారం తీసుకోవడం ద్వారా విద్యార్థులు మంచి ఆరోగ్యం, శారీరక ఎదుగుదలతో పాటు చదువుపై మరింత ఏకాగ్రత సాధిస్తారని పేర్కొన్నారు.విద్యకు పెద్దపీట: కలెక్టర్జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ మంత్రి సూచనల మేరకు జిల్లాలో విద్యాశాఖకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తూ పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన అధ్యయనాల ప్రకారం విద్యాశాఖకు సంబంధించిన వివిధ కార్యక్రమాల అమలులో పెద్దపల్లి జిల్లా రాష్ట్రంలో మూడో స్థానంలో నిలిచిందని చెప్పారు.ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు కొత్త ఉపాధ్యాయుల నియామకంతో పాటు మౌలిక వసతుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అల్పాహార పథకం ద్వారా విద్యార్థుల ఆరోగ్యం, హాజరు, విద్యా ప్రమాణాలు మరింత మెరుగుపడతాయని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన ఆహారం, నాణ్యమైన విద్య ఉచితంగా అందుతున్నందున తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కలెక్టర్ సూచించారు.కార్యక్రమంలో మంథని ఆర్డీవో సురేష్, మున్సిపల్ చైర్మన్ వి. శ్రీనివాస్, వైస్ చైర్మన్ సయేందర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకన్న, మున్సిపల్ కమిషనర్ మనోహర్, ఆర్జీ-3 జీఎం, తహసీల్దార్ ఆరిపోద్దిన్, ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

సీతారామ ప్రాజెక్టు కాలువలోకి దూసుకెళ్లిన కారు

సీతారామ ప్రాజెక్టు కాలువలోకి దూసుకెళ్లిన కారు

అశ్వాపురం మండలంలో గత రాత్రి సీతారామ ప్రాజెక్టు కాలువలోకి అదుపుతప్పి DL 3CBW2385 నెంబర్ గల కారు బోల్తా పడి పూర్తిగా ధ్వంసం అయింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.ఈ ప్రమాదంలో ప్రయాణికులు సురక్షితంగా చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారని సమాచారం. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది

SIR Phase-2పై ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సమీక్ష

SIR Phase-2పై ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సమీక్ష

రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ SIR Phase-2 ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు. SIR ఇన్‌చార్జ్‌లు, కార్పొరేటర్లతో ప్రక్రియ పురోగతిపై చర్చించి, సమన్వయంతో పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు.సమావేశంలో మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య, కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్, కార్పొరేటర్లు, ఇన్‌చార్జ్‌లు పాల్గొన్నారు.

కాంగ్రెస్‌లో ముదురుతున్న అసమ్మతి..

కాంగ్రెస్‌లో ముదురుతున్న అసమ్మతి..

క్రమశిక్షణకు సవాల్

ఎవరికివారే సీనియర్లమనే భావన..

పార్టీకి చేటు చేస్తున్న నేతల ప్రకటనలు

అధికార కాంగ్రెస్పార్టీలో ధిక్కార స్వరాలు పెరుగుతున్నాయి. నాయకుల్లో అసహనం కట్టలు తెంచుకుంటున్నది. పవర్‌లోకి వచ్చామనే కంటే తమకు లాభం ఏమి జరగలేదని, తమ తర్వాత వచ్చిన వారికి పదవులు, ప్రాధాన్యత ఇస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటైనా పదవులు రాలేదని, గుర్తింపు ఇవ్వడం లేదని, పనులు కావడం లేదని, భవిష్యత్‌పై భరోసా లేదంటూ ఇలా ఒక్కొక్కరూ ఒక్కో సమస్య ఉందంటూ మీడియాకు ఎక్కుతున్నారు. దశాబ్దకాలం తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్పార్టీకి ప్రతిపక్షం కంటే సొంత నేతలతోనే సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. పార్టీకి ప్రభుత్వానికి మధ్య సరైన సమన్వయం లేకపోవడం, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, సీనియర్నేతలు ఇష్టారీతిన, క్రమశిక్షణ ఉల్లంఘించి బహిరంగంగా మాట్లాడినా వారిని పిలిపించి క్లాస్ పీకడంతో పాటు ఆ సమస్యను పరిష్కరించడం, రాజీ కుదర్చడం, వారికి నచ్చచెప్పే నాయకుడు లేకుండా పోయారని పార్టీలో ఆందోళన వ్యక్తమవుతోంది. పెద్దరికం చేసే నేతలు లేకపోవడం, ఈ పనిచేయాల్సిన ఏఐసీసీ పెద్దలు తెలంగాణలో జరుగుతున్న పరిణామాలపై అంతగా దృష్టి పెట్టకపోవడంతో అటు పార్టీకి, ఇటు ప్రభుత్వానికి నష్టం వాటిల్లుతోందని చర్చ జరుగుతున్నది.

జనసేన పార్టీ లోకి కొండా సుస్మిత?

జనసేన పార్టీ లోకి కొండా సుస్మిత?

రేపు జనసేన కీలక నేతలతో కొండా సుస్మిత భేటీ?

సీఎం రేవంత్‌రెడ్డిపై సుస్మిత చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపాయిఈ నేపథ్యంలో వేగంగా పావులు కదుపుతున్న సుస్మిత పరకాల టికెట్, ఉమ్మడి వరంగల్ జిల్లా పార్టీ పగ్గాలపై చర్చకు అవకాశం? జూబ్లీహిల్స్‌లో కీలక నేత ఇంట్లో భేటీకి రంగం సిద్ధమైనట్లు సమాచారం..

ప్రెస్‌మీట్‌ పెట్టండి.. ఫైళ్లు క్లియర్‌ చేసుకోండి..

ప్రెస్‌మీట్‌ పెట్టండి.. ఫైళ్లు క్లియర్‌ చేసుకోండి..

అధికార పార్టీ ఎమ్మెల్యేలకు బంపర్‌ ఆఫర్‌

అన్నా.. మీరేదో ఫైల్‌ ఉన్నదని చెప్పిండ్రు కదా.. రేపు ఒకసారి వచ్చి కలువండి

రాష్ట్రంలో అధికార పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలకు బంపర్‌ ఆఫర్‌ వచ్చింది. రాష్ట్రంలో అసమ్మతి గళం వినిపిస్తున్న వారికి వ్యతిరేకంగా నిలబడి, ముఖ్యమంత్రికి అండగా నిలిచేవారి ఫైళ్లు శరవేగంగా కదులుతున్నాయి.ప్రెస్‌మీట్‌ పెట్టే వారికి ముఖ్యనేత ఆంతరంగికుడు ప్రత్యేకంగా ఫోన్లు చేస్తున్నట్టు తెలిసింది. రాష్ట్రంలోని సుమారు 50 మంది ఎమ్మెల్యేలకు ఈ మేరకు ఫోన్లు వెళ్లినట్టు తెలిసింది. తొలుత అనేకమంది ముఖ్యనేతకు అనుకూలంగా మాట్లాడేందుకు ముందుకురాలేదు.దీంతో ‘అన్నా.. మీరేదో ఫైల్‌ ఉన్నదని చెప్పిండ్రు కదా.. రేపు ఒకసారి వచ్చి కలువండి. అది చెప్పాలని ఫోన్‌ చేసిన. అట్లనే ఒకసారి వీలైతే మన పీఆర్వోలు ఒక నోట్‌ పంపుతారు. ప్రెస్‌మీట్‌ పెట్టి మాట్లాడండి అన్నా..’ అంటూ ఆంతరంగికుడు ఎమ్మెల్యేలతో చెప్తున్నట్టు తెలిసింది. నల్లగొండ, వరంగల్‌ జిల్లాల నేతలకు ఎకువగా ఫోన్లు వెళ్లినట్టు తెలిసింది. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఓ నేత ఫైల్‌ను క్లియర్‌ చేయాలని ఆ ఆంతరంగికుడు ఓ అధికారికి చెప్పినట్టు సమాచారం. ఆరు నెలలుగా తిరుగుతున్నా పని కానిది ఒక ప్రెస్‌మీట్‌తో అయిపోయినట్టేన ని ఆ ఎమ్మెల్యే తనను కలిసిన మరో యువ ఎమ్మెల్యేతో చెప్పడం గమనార్హం

తెలంగాణ కాంగ్రెస్‌లో మీనాక్షి మార్క్ విఫలం !

తెలంగాణ కాంగ్రెస్‌లో మీనాక్షి మార్క్ విఫలం !

ఎవరు గీత దాటినా మౌనమే

కొండా సురేఖపై గతంలోనే చర్య తీసుకుంటే ఈ పరిస్థితి వచ్చేదా?

ఇప్పుడు కూడా పట్టించుకుంటున్నది అంతంతమాత్రమే!

తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గా మీనాక్షి నటరాజన్ బాధ్యతలు చేపట్టినప్పుడు పార్టీని గాడిలో పెడతారని… గాడి తప్పిన వారిని ఉపేక్షించరని అందరూ అనుకున్నారు.రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితురాలిగా, అవినీతి మచ్చ లేని కఠినమైన నాయకురాలిగా పేరుండటంతో రాష్ట్రంలో క్రమశిక్షణారాహిత్యానికి అడ్డుకట్ట వేస్తారని అంతా భావించారు. అయితే, తెలంగాణ కాంగ్రెస్ నాయకుల సొంత ఎజెండాలు, అంతర్గత ముఠా తత్వాల ముందు ఆమె వ్యూహాలు తేలిపోయినట్లు కనిపిస్తోంది. పదవి చేపట్టిన నాటి నుంచి కఠిన నిర్ణయాలు తీసుకోకుండా బుజ్జగింపు రాజకీయం అనుసరించడంతో నేతలు ఆమె ఆదేశాలను పట్టించుకోవడం లేదు.ఎవరు గీత దాటినా మౌనమేసమస్యలను ప్రాథమిక దశలోనే పరిష్కరించడంలో, క్రమశిక్షణ తప్పిన నేతలపై వెంటనే వేటు వేయడంలో ఆమె వైఖరి మరీ మెతకగా ఉందనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో బలపడింది. అంతర్గత విభేదాలు రచ్చకెక్కిన ప్రతిసారీ కమిటీల ఏర్పాటు లేదా చర్చల పేరుతో కాలాన్ని వెళ్లదీయడమే తప్ప, గట్టి చర్యలు లేకపోవడంతో అసమ్మతి నేతలు మరింతగా రెచ్చిపోతున్నారు. చివరికి సొంత రాష్ట్రం మధ్యప్రదేశ్‌లో రాజ్యసభ స్థానాన్ని కైవసం చేసుకునే విషయంలోనూ పార్టీ అంతర్గత సమీకరణాలను తట్టుకోలేక పదవిని కోల్పోవాల్సి రావడం ఆమె రాజకీయ ప్రతిష్టకు తీవ్ర విఘాతం కలిగించింది.కొండా సురేఖపై గతంలోనే చర్య తీసుకుంటే ఈ పరిస్థితి వచ్చేదా?తాజాగా మంత్రి కొండా సురేఖ , ఆమె కుటుంబ వ్యవహార శైలిపై రగులుతున్న వివాదంలోనూ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పాత్ర దాదాపు శూన్యంగా మారింది. సురేఖ చేసిన వరుస వివాదాస్పద వ్యాఖ్యలు, ఆమె అనుచరుడు సుమంత్‌పై వస్తున్న ఆర్థిక సెటిల్‌మెంట్ల ఆరోపణలు పార్టీకి, ప్రభుత్వానికి తీవ్ర నష్టం కలిగిస్తున్నప్పటికీ అధిష్టాన స్థాయి నుంచి గట్టి కౌంటర్ ఇవ్వడంలో ఆమె నిశ్శబ్దాన్ని పాటిస్తున్నారు. పీసీసీ వర్గాలు ఒకవైపు కఠిన నివేదికలు సిద్ధం చేస్తుంటే, ఇన్‌ఛార్జ్ మాత్రం ఎలాంటి స్పష్టమైన దిశానిర్దేశం చేయలేక చేతులెత్తేసినట్లు తెలుస్తోంది.ఇప్పుడు కూడా పట్టించుకుంటున్నది అంతంతమాత్రమే!మొత్తానికి, ఎంతటి వర్గపోరునైనా అదుపు చేయవచ్చనే అంచనాలతో వచ్చిన మీనాక్షి నటరాజన్, తెలంగాణ కాంగ్రెస్ నాయకుల నడుమ తన సూపర్ పవర్ సామర్థ్యాన్ని చాటుకోవడంలో విఫలమయ్యారనేది స్పష్టమవుతోంది. కఠిన నిర్ణయాలు తీసుకోకుండా సాగదీసే ధోరణి వల్లనే ప్రస్తుతం మంత్రి కొండా సురేఖ ఉదంతం అధిష్టానానికి, రేవంత్ సర్కారుకు పెద్ద తలనొప్పిగా మారింది.

కాంగ్రెస్ ముందు రెండే ఆప్షన్లు..

కాంగ్రెస్ ముందు రెండే ఆప్షన్లు..

ఏది బెస్ట్ అంటే?

కాంగ్రెస్ హైకమాండ్ ముందు రెండు ఆప్షన్లున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ లో క్రమశిక్షణ పట్టుతప్పుతోంది. నేతలే ప్రభుత్వాన్ని విమర్శలు చేయడంతో పార్టీ వచ్చే ఎన్నికల్లో తీవ్రంగా నష్టపోయే అవకాశముంది.ప్రస్తుతం కఠిన చర్యలు తీసుకోకుంటే పార్టీ మరింత గాడి తప్పే అవకాశముంది. చర్యలు తీసుకోకుంటే రానున్న కాలంలో మరింతగా నేతలు బయటపడతారు. అందుకే కాంగ్రెస్ నాయకత్వం తీవ్రంగా ఆలోచిస్తుంది. ఇప్పుడు రెండు ఆప్షన్లు ఉన్నట్లు కాంగ్రెస్ నాయకత్వం తెలిపింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత ఆయన తో చర్చించిన తర్వాత ఈ చర్యలకు దిగే అవకాశముంది. చర్యలు తీసుకోకుంటే చేతకాని తనంగా భావిస్తారు. భవిష్యత్ లో పార్టీ నేతలు మరింత కట్టు తప్పే అవకాశాలున్నాయి. *ఆప్షన్ 1 :* మంత్రి వర్గం ప్రక్షాళన…కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి ప్రస్తుతం బెస్ట్ ఆప్షన్ మంత్రి వర్గం ప్రక్షాళన అని భావిస్తుంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయి రెండున్నరేళ్లు దాటి పోతుండటంతో ఖచ్చితంగా మంత్రివర్గ ప్రక్షాళ చేస్తూ కట్టుబాటు తప్పిన నేతలను పదవుల నుంచి తప్పిస్తే కొంత సాఫీగా సాగిపోతుంది. తప్పించిన మంత్రి స్థానంలో అదే సామాజికవర్గానికి చెందిన మరొకరికి అవకాశం కల్పిస్తే కులం కార్డు కూడా వాడే అవకాశం లేదు. మంత్రుల పనితీరు, మరొకరికి అవకాశం కల్పించాలన్న ఉద్దేశ్యంతో మంత్రి వర్గం ప్రక్షాళన చేయవచ్చు. ఆ జిల్లాలో కానీ, మరొకచోట కాని ప్రత్యామ్నాయ నేతకు మంత్రి పదవి ఇవ్వొచ్చు. కొండా సురేఖను మంత్రి వర్గం నుంచి తొలగించడం కంటే.. మరికొందరితో పాటు ఆమెను కూడా తప్పించి మరొక బీసీ సామాజికవర్గానికి ఇస్తే ఏ గొడవ ఉండదని భావిస్తుంది. *ఆప్షన్ 2* :ఇద్దరినీ తప్పించడం ఒక ఆప్షన్…కాంగ్రెస్ నాయకత్వం ముందున్న మరొక ఆప్షన్ ఇద్దరు నేతలను పార్టీ నుంచి తప్పించడం. మంత్రి పదవి నుంచి తప్పించి మరొకరికి అవకాశం ఇవ్వొచ్చు. అలాగే మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన సీనియర్ నేత చిన్నారెడ్డిపై కూడా వేటు వేయవచ్చు. అప్పుడు కూడా సామాజిక కార్డు వాడుకునే అవకాశం ఉండదని ఆలోచన ఉంది. అయితే కొండా సురేఖ ప్రస్తుతం మంత్రి వర్గంలో ఉన్నారు. చిన్నారెడ్డి ప్రణాళిక సంఘం వైస్ ఛైర్మన్ గా ఉన్నారు. ఇద్దరినీ పదవి నుంచి తప్పిస్తే ఇటు బీసీ, అటు రెడ్డి సామాజికవర్గం నేతలపై చర్యలు తీసుకున్నట్లుంటుందన్న భావన కూడా ఉంది. చిన్నారెడ్డి పై చ్యలు తీసుకున్నా పెద్దగా రియాక్ట్ కాకపోవచ్చు. కానీ కొండా సురేఖను తప్పిస్తే మరింతగా ఆ కుటుంబం ఎదురుదాడి చేసే అవకాశాలున్నాయి. వాటిని ఎదుర్కొనడంపైన కూడా ఆలోచించి ముందడుగు వేయాల్సి ఉంటుందన్న అభిప్రాయం సీనియర్ నేతలలో ఉంది. మొత్తం మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లండన్ పర్యటన నుంచి వచ్చిన తర్వాత మాత్రమే దీనిపై క్లారిటీ రానుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

కాళేశ్వరంపై రేవంత్ రెడ్డి ప్రచారానికి చెక్

కాళేశ్వరంపై రేవంత్ రెడ్డి ప్రచారానికి చెక్

అన్నారం, సుందిళ్ళ బ్యారేజీలు అద్భుతంగా ఉన్నాయని తేల్చిన కేంద్ర ప్రభుత్వ సంస్థ

కాంక్రీటు క్వాలిటీ పరీక్షల్లో అన్నారం, సుందిళ్ళ బ్యారేజీలోని అన్ని పియర్స్‌లో కాంక్రీటు క్వాలిటీ చాలా బాగున్నట్టు తేలిందని స్పష్టం చేసిన సీడబ్ల్యూపీఆర్ఎస్

ఎక్కడా చిన్న లోపం కూడా కనిపించలేదని, 100% నాణ్యంగా ఉన్నాయని కేంద్ర జల, విద్యుత్ పరిశోధన సంస్థ ప్రకటన

పుట్ట మధు వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతల తీవ్ర ఆగ్రహం

పుట్ట మధు వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతల తీవ్ర ఆగ్రహం

మంథని: మంత్రి, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబుపై బీఆర్‌ఎస్‌ నేత, మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ నాయకులు తీవ్రంగా స్పందించారు. పుట్ట మధు తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని, ఇకనైనా పద్ధతి మార్చుకోవాలని మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తొట్ల తిరుపతి యాదవ్ సూచించారు.

రామగిరి మండలం బేగంపేట్ ఎక్స్‌రోడ్‌లోని కాంగ్రెస్‌ కార్యాలయంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రొడ్డ బాపన్న పటేల్ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో తిరుపతి యాదవ్ మాట్లాడారు. శ్రీధర్‌బాబు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నారని, ఆ అభివృద్ధిని చూసి ఓర్వలేకనే పుట్ట మధు విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు.

గట్టు వామన్‌రావు దంపతుల హత్య కేసుకు సంబంధించి సీబీఐ విచారణకు పుట్ట మధు హాజరైన నేపథ్యంలో ఆయన రాజకీయ భవిష్యత్తుపై ఆందోళనతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని తిరుపతి యాదవ్ ఆరోపించారు. అయితే ఈ కేసులో ఎవరి పాత్రపై అయినా తుది నిర్ణయం దర్యాప్తు సంస్థలు, న్యాయస్థానాల పరిధిలోనే ఉంటుందని పేర్కొన్నారు.

శ్రీధర్‌బాబు ఆధ్వర్యంలో మంథని నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని, పరిశ్రమలు, పెట్టుబడులను తెలంగాణకు తీసుకురావడంలో ఆయన కృషి చేస్తున్నారని తిరుపతి యాదవ్ అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ, శ్రీధర్‌బాబు కుటుంబానికి మంథని ప్రజలు దీర్ఘకాలంగా మద్దతు ఇస్తున్నారని తెలిపారు.

పుట్ట మధు మాజీ ఎమ్మెల్యే, మాజీ జెడ్పీ చైర్మన్ హోదాలకు తగినట్లుగా బాధ్యతాయుతంగా మాట్లాడాలని, వ్యక్తిగత విమర్శలకు దూరంగా ఉండాలని ఆయన సూచించారు. ప్రజలు రాజకీయ నాయకుల పనితీరును గమనిస్తున్నారని, ప్రజల తీర్పే అంతిమమని అన్నారు.

మంథని నియోజకవర్గం, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం శ్రీధర్‌బాబు నాయకత్వంలో కాంగ్రెస్‌ పార్టీ మరింత బలోపేతంగా పనిచేస్తుందని తిరుపతి యాదవ్ స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడు ఎల్లే రామ్మూర్తి, మాజీ ఎంపీపీ ఆరెల్లి దేవక్క కొమురయ్య గౌడ్, రామగిరి మండల బీసీ సెల్ అధ్యక్షుడు బండారి సదానందం, ఎస్సీ సెల్ అధ్యక్షుడు కండె పోషం, యూత్ అధ్యక్షుడు మోత్కూరి అవినాష్ గౌడ్, సుందిళ్ల లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం చైర్మన్ సత్యనారాయణ గౌడ్ తదితర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

శ్రీధర్ బాబును విమర్శించే అర్హత మధుకు లేదు

శ్రీధర్ బాబును విమర్శించే అర్హత మధుకు లేదు

మధు వ్యాఖ్యలపై రామగిరి స్టాలిన్ తీవ్ర ఆగ్రహం

-చదువును చులకనగా మాట్లాడటం మానుకోవాలి.
-యువతకు ఆదర్శంగా శ్రీధర్ బాబు
-ప్రజా తీర్పుతోనే ఎవరి సత్తా ఎంతో తేలుతుంది

మంథని: మంత్రి శ్రీధర్ బాబుపై మాజీ ఎమ్మెల్యే మధు చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. మధు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన సుందిళ్ల వార్డు నంబర్ దళిత నాయకుడు రామగిరి స్టాలిన్, శ్రీధర్ బాబును విమర్శించే నైతిక అర్హత మధుకు లేదని అన్నారు.

శనివారం రామగిరి మండల కేంద్రంలో మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తోట్ల తిరుపతి యాదవ్ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రామగిరి స్టాలిన్ మాట్లాడారు. శ్రీధర్ బాబుపై మాజీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను పూర్తిగా ఖండిస్తున్నామని తెలిపారు.

యువతకు ఆదర్శంగా శ్రీధర్ బాబు

చదువుకున్న యువత శ్రీధర్ బాబును ఆదర్శంగా తీసుకుని రాజకీయాల్లోకి వస్తున్నారని రామగిరి స్టాలిన్ పేర్కొన్నారు. విద్యకు, రాజకీయాలకు ఉన్న ప్రాధాన్యతను గుర్తించకుండా చదువును చులకనగా చేసి మాట్లాడటం సరైన పద్ధతి కాదని అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మధు మానుకోవాలని సూచించారు.

ప్రజా తీర్పు కోరుతూ సవాల్

మంథనిలో ఎమ్మెల్యేగా ఎవరు పనికిరారు అనే విషయాన్ని ప్రజలే నిర్ణయిస్తారని రామగిరి స్టాలిన్ అన్నారు. ముందుగా వార్డు నంబర్, సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ వంటి స్థానాల్లో పోటీ చేసి ప్రజల ఆదరణ పొందాలని మధుకు సవాల్ విసిరారు. ప్రజల మద్దతు ఎవరికి ఉందో ఎన్నికల ద్వారానే తేలుతుందని స్పష్టం చేశారు.

రాజకీయాల్లో మాటలకంటే ప్రజా ఆదరణే కీలకం

మంథని రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు సహజమే అయినప్పటికీ వ్యక్తిగత స్థాయిలో, ముఖ్యంగా విద్యను తక్కువ చేసి మాట్లాడటం సరైన విధానం కాదని కాంగ్రెస్ నాయకులు పేర్కొంటున్నారు. శ్రీధర్ బాబు పట్ల యువతలో ఉన్న ఆదరణను తక్కువగా అంచనా వేయవద్దని రామగిరి స్టాలిన్ అన్నారు.

మధు చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ శ్రేణులు తీవ్రంగా స్పందించడంతో మంథని రాజకీయాల్లో ఈ వ్యవహారం మరింత వేడిని రాజేసింది. రాబోయే రోజుల్లో ఇరు వర్గాల మధ్య రాజకీయ విమర్శలు మరింత తీవ్రం అయ్యే అవకాశం ఉందనే చర్చ స్థానిక రాజకీయ వర్గాల్లో సాగుతోంది.

వరలక్ష్మీ వ్రతం రోజే లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో  వరలక్ష్మి

వరలక్ష్మీ వ్రతం రోజే లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో వరలక్ష్మి

  • మంచిర్యాల జిల్లాలో ACBకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి
  • ఇంటి నిర్మాణ అనుమతి కోసం రూ.20 వేల లంచం డిమాండ్ చేసిన వరలక్ష్మి
  • రూ.13 వేలు లంచం తీసుకుంటూ ACB అధికారులకు పట్టుబడ్డారు
  • నగదు తీసుకుంటే దొరికిపోతాననే భయంతో మరో వ్యక్తి ఫోన్ నంబర్‌కు ఫోన్‌పే చేయించినట్లు గుర్తింపు
  • ఫోన్‌పే ద్వారా రూ.13 వేలు బదిలీ చేయించుకున్నట్లు అధికారుల గుర్తింపు
  • లింగాయిపల్లి పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న Platforms

వరలక్ష్మీ వ్రతం రోజే లంచం తీసుకుంటూ వరలక్ష్మి పట్టుబడటంపై స్థానికుల సెటైర్లు

కేంద్ర అనుమతి నిరాకరణతో రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దు

కేంద్ర అనుమతి నిరాకరణతో రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దు

హైదరాబాద్: కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరించిన నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం అమెరికా పర్యటనను రద్దు చేసుకుంది. UK, అమెరికా పర్యటనలో భాగంగా లండన్ చేరుకున్న ప్రతినిధి బృందానికి అమెరికా పర్యటనకు అనుమతి ఇవ్వడం లేదని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.

విధివిధానాలు, ప్రోటోకాల్ ప్రకారం సీఎం నేతృత్వంలోని ప్రతినిధి బృందం UK, అమెరికా పర్యటనలకు కేంద్ర అనుమతి కోరినట్లు అధికారులు తెలిపారు. తొలుత UK పర్యటనకు మాత్రమే అనుమతి లభించగా, ప్రతినిధి బృందం UK చేరుకున్న అనంతరం అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరించినట్లు పేర్కొన్నారు.

అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరించడంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విస్మయం వ్యక్తం చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. అయితే కేంద్ర నిర్ణయాన్ని గౌరవిస్తూ బోస్టన్ పర్యటనను రద్దు చేసి లండన్ నుంచి హైదరాబాద్‌కు తిరిగి రావాలని ఆయన నిర్ణయించుకున్నారు.

విద్యా సంస్థలతో భాగస్వామ్యాలే ప్రధాన లక్ష్యం

ప్రపంచంలోని ప్రముఖ విద్యాసంస్థలను తెలంగాణకు, హైదరాబాద్‌కు తీసుకురావడం, విద్య, నైపుణ్యాలు, శిక్షణ రంగాల్లో అంతర్జాతీయ భాగస్వామ్యాలను పెంపొందించడం అమెరికా పర్యటన ప్రధాన ఉద్దేశమని సీఎం తెలిపారు. ఇప్పటికే వివిధ విశ్వవిద్యాలయాలతో జరిగిన చర్చలను అధికారులు కొనసాగించాలని, అవసరమైన అవగాహన ఒప్పందాలు, భాగస్వామ్య ఒప్పందాలను పూర్తి చేయాలని ఆదేశించారు.

“దేశ నిర్మాణం, యువత భవిష్యత్తు విషయంలో రాజకీయాలకు, ఎన్నికలకు అతీతంగా ఆలోచించాలి” అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

హైదరాబాద్‌ను నాలెడ్జ్ హబ్‌గా తీర్చిదిద్దుతాం

హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి నాలెడ్జ్ హబ్‌గా అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని సీఎం తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, జేఎన్‌టీయూ వంటి సంస్థలతో పాటు ఐఐటీ, ఐఎస్‌బీ, ఐఐఐటీ, నల్సార్ వంటి ప్రముఖ విద్యాసంస్థలు నగరాన్ని మానవ వనరుల కేంద్రంగా తీర్చిదిద్దాయని పేర్కొన్నారు.

ప్రపంచంలోని అత్యుత్తమ విద్యాసంస్థల నుంచి విద్య, సర్టిఫికేషన్ పొందే అవకాశాలను హైదరాబాద్‌లోనే అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.

UKలో కొనసాగనున్న కీలక సమావేశాలు

షెడ్యూల్ ప్రకారం UK పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి ఆక్స్‌ఫర్డ్, కేంబ్రిడ్జ్, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, లండన్ బిజినెస్ స్కూల్, యూనివర్సిటీ ఆఫ్ లండన్ తదితర సంస్థల ప్రతినిధులతో సమావేశం కానున్నారు. అలాగే ప్రముఖ క్రీడా సంస్థలు, నైపుణ్యాభివృద్ధి రంగ నాయకులతో చర్చలు జరిపి తెలంగాణతో భాగస్వామ్యాలను ఖరారు చేసేందుకు ప్రయత్నించనున్నారు.

హైదరాబాద్‌ను ప్రపంచంలోని అగ్రశ్రేణి నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దడంతో పాటు, ప్రపంచ స్థాయి విద్య, నైపుణ్య సంస్థలను నగరానికి ఆకర్షించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు.

భూ భారతి’యే మా ప్రభుత్వానికి రెఫరెండమ్!

భూ భారతి’యే మా ప్రభుత్వానికి రెఫరెండమ్!

  • రాబోయే ఎన్నికల్లో మా పనితీరుకు ఇదే ప్రామాణికం : బేతుపల్లి సభలో మంత్రి పొంగులేటి ప్రకటన
  • అక్రమాలకు అడ్డుకట్ట.. ప్రతి అంగుళం భూమి సరిగ్గా కొలిచి టైటిల్స్ ఇస్తాం
  • ‘22A’ పేరిట దోచుకున్న ఆస్తులను వదిలిపెట్టేది లేదు.. ‘సిట్’ ద్వారా ముక్కు పిండి వసూలు చేస్తాం

సత్తుపల్లి : “ఈ ప్రజా ప్రభుత్వంలో మేము ప్రవేశపెట్టిన ‘భూ భారతి’ చట్టం అమలే రాబోయే ఎన్నికల్లో మా ప్రభుత్వ పనితీరుకు రెఫరెండమ్. చట్టం తెచ్చేనాడే ఈ మాట చెప్పాం.. ఈ రోజుకీ అదే మాట మీద నిలబడుతున్నాం. ప్రజల తీర్పు దగ్గరకు పోయినప్పుడు మీకు ఫలితాలు ఏంటో గతంలో చూపించాం.. భవిష్యత్తులోనూ అవే ఫలితాలు పునరావృతం అవుతాయి” అని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని బేతుపల్లి రెవెన్యూ గ్రామంలో భూ రీ సర్వే రైతులతో గురువారం నిర్వహించిన ముఖాముఖి – అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

  • భూమిపై రైతన్నకు ఉన్నది ఎమోషనల్ బాండింగ్…
    “భూమి అనేది కేవలం మన్ను కాదు.. అది రైతన్నకు గుండెకాయ లాంటి ఎమోషనల్ బాండ్. గత ప్రభుత్వంలో ధరణి పేరుతో తీవ్ర అవకతవకలు జరిగాయి. సాగులో ఉన్న పేద రైతుకు పాస్ పుస్తకాలు రాకపోగా, సెంట్ భూమి లేని భోగస్ వ్యక్తులకు పదుల ఎకరాల రికార్డులు సృష్టించి బ్యాంకులు, రైతుబంధు సొమ్ము దోచుకున్నారు” అని మంత్రి ధ్వజమెత్తారు. నాగార్జునసాగర్ పైలట్ ప్రాజెక్టులో సర్వే చేయగా వేలాది ఎకరాల భోగస్ భూములు బయటపడ్డాయని, అందుకే ఇప్పుడు బేతుపల్లితో పాటు రాష్ట్రవ్యాప్తంగా శాస్త్రీయ రోవర్ టెక్నాలజీతో సర్వే చేపడుతున్నామని వివరించారు.
  • అబాదీ ఆస్తులకు పక్కా సర్వే – టైటిల్స్ పంపిణీ…
    ప్రతి జిల్లాలో తొలివిడతగా 70 గ్రామాలను ఎంపిక చేసి, రాబోయే ఏడాదిన్నర వ్యవధిలో రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ భూములతో పాటు నివాస ప్రాంతాల (అబాదీ) భూములను కోఆర్డినేట్స్, మ్యాప్‌లతో సహా సర్వే చేస్తామన్నారు. ప్రతి రైతుకూ డిజిటల్ కోఆర్డినేషన్ మ్యాప్‌తో కూడిన పక్కా హక్కుల టైటిల్ డీడ్ ఇస్తామని పేర్కొన్నారు.
  • 22ఏ అక్రమాలపై ‘సిట్’ బాణం…
    ప్రతిపక్షాల విమర్శలపై స్పందిస్తూ మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “గతంలో చట్టం తెచ్చి 3 ఏళ్లు రూల్స్ చేయలేని వాళ్లు.. ఈ రోజు మూడో నెలలోనే నిబంధనలు తెచ్చిన ప్రజా ప్రభుత్వాన్ని చూసి కారుకూతలు కూస్తున్నారు. 22ఏ ప్రొహిబిటెడ్ లిస్ట్ పేరుతో అమాయక ప్రజలను కవచంగా పెట్టుకుని, తెరచాటున వేలాది ఎకరాల అక్రమ ఆస్తులను రెగ్యులరైజ్ చేసుకోవాలని పగటి కలలు కంటున్నారు. ఈ ప్రభుత్వంలో మీ పప్పులు ఉడకవు. ప్రజల సొమ్ము తింటే వంటపట్టదు. ఇందుకోసం ఇప్పటికే ‘సిట్’ వేశాం.. ముక్కు పిండి వసూలు చేస్తాం” అని హెచ్చరించారు.
  • రాష్ట్రమంతటా స్వయంగా నేనే వస్తా!…
    కరీంనగర్, నిజామాబాద్ సహా ప్రతి జిల్లాకూ రెవెన్యూ మంత్రిగా స్వయంగా వెళ్లి రైతులతో ప్రత్యక్షంగా మాట్లాడి, అక్రాస్ ది టేబుల్ సమస్యలను పరిష్కరిస్తానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, అడిషనల్ కలెక్టర్, స్థానిక శాసనసభ్యురాలు మట్టా రాగమయి దయానంద్, ప్రజాప్రతినిధులు, రెవెన్యూ అధికారులు, రైతు సోదరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
గోదావరిఖనిలో 500 సైకిళ్ల పంపిణీ

గోదావరిఖనిలో 500 సైకిళ్ల పంపిణీ

గోదావరిఖని అశోక్‌నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో NTPC రామగుండం CSR సౌజన్యంతో విద్యార్థులకు 500 సైకిళ్లను పంపిణీ చేశారు. కార్యక్రమానికి రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు సైకిళ్లు అందజేశారు. విద్యార్థులు సైకిళ్లను సద్వినియోగం చేసుకుని విద్యలో రాణించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. కార్యక్రమంలో మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య, కార్పొరేటర్లు, ఉపాధ్యాయులు, అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.

విద్యతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం.మనాలి ఠాకూర్

విద్యతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం.మనాలి ఠాకూర్

గోదావరిఖని: రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు ఆయన సతీమణి మనాలి ఠాకూర్ గంగానగర్‌లోని MPPS ఉర్దూ మీడియం పాఠశాలను సందర్శించారు. విద్యార్థులతో ముచ్చటించి వారి విద్యా ప్రగతిని తెలుసుకున్నారు. ఉపాధ్యాయులతో మాట్లాడి పాఠశాల సమస్యలు, సౌకర్యాలపై ఆరా తీశారు. అనంతరం విద్యార్థులతో కలిసి మొక్కలు నాటి, విద్యతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.

సుందిళ్లలో వైకుంఠ రథానికి ప్రత్యేక పూజలు

సుందిళ్లలో వైకుంఠ రథానికి ప్రత్యేక పూజలు

సుందిళ్ల గ్రామానికి ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సహకారంతో ఏర్పాటు చేసిన వైకుంఠ రథానికి గ్రామ సర్పంచ్ ముసుకుల నరేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కొరకొప్పుల సత్యనారాయణగౌడ్, గ్రామ కాంగ్రెస్ శాఖ అధ్యక్షుడు గర్రెపల్లి ప్రవీణ్‌గౌడ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

సుందిళ్ల లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్న పెద్దపల్లి డీసీపీ

సుందిళ్ల లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్న పెద్దపల్లి డీసీపీ

మంథని , ఆగస్టు 20: పెద్దపల్లి డీసీపీ బుక్యా రామ్‌రెడ్డి సతీసమేతంగా బుధవారం సుందిళ్ల శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అర్చన నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.గ్రామ సర్పంచ్ ముస్కుల నరేందర్ రెడ్డి, దేవస్థాన చైర్మన్ కొరకొప్పుల సత్యనారాయణ గౌడ్ సమక్షంలో ఆలయ అర్చకులు రుద్ర భట్ల జయంత్ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం డీసీపీ దంపతులకు తీర్థప్రసాదాలు అందజేశారు. స్వామివారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని వారు ఆకాంక్షించారు.

సిద్దిపేట జిల్లాలో బావిలోకి దూసుకెళ్లిన కారు!

సిద్దిపేట జిల్లాలో బావిలోకి దూసుకెళ్లిన కారు!

ఒకే కుటుంబానికి చెందిన నలుగురు జల సమాధి!

సిద్దిపేట జిల్లా:ఆగస్టు 20సిద్దిపేట జిల్లాలో అత్యంత విషాదకర ఘటన చోటు చేసుకుంది,దుబ్బాక మండలం అప్పన్న పల్లి గ్రామ శివారులో ఓ కారు బావిలోకి దూసుకెళ్లిన ప్రమాదంలో.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అక్కడిక క్కడే ప్రాణాలు కోల్పో యారు. బంధువుల అంత్యక్రియలకు వెళ్లి వస్తుండగా అర్ధరాత్రి వేళ ఈ దారుణం జరిగినట్లు తెలుస్తుంది.ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు కూడా ఉండటంతో బల వంతపూర్ గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి. ఒకే కుటుంబంలోని నలుగురిని.. కాలం కారు రూపంలో కబ లించేసింది.సిద్దిపేట జిల్లా దుబ్బాక మం డలం బల్వంతపూర్ కు చెందిన దండుగుల రాజు (30) ఇసుక వ్యాపా రం చేస్తుంటాడు అతని భార్య భాగ్య (25) కుమారుడు నిహాన్స్ (4)కుమార్తె శాన్విక (2)తో కలిసి సిద్దిపేట లో బంధువు దిశదిన కర్మకు హాజరై తిరిగి రాత్రివేళ వస్తుండగా… అప్పన్న పల్లి శివారులోకి రాగానే కారు అదుపు తప్పి బావిలోకి దూసుకెళ్లిం ది కొంతసేపటి తర్వాత జరిగిన ఘటనను గుర్తించిన స్థానికులు పోలీసు లుకు అగ్ని మాపక సిబ్బందికి సమా చారం అందించారు. ఈ క్రమంలోనే రోడ్డు పక్కనే ఉన్న ఓ లోతైన బావిలో కారు పడి ఉండటాన్ని గమనించారు.వెంటనే స్థానికుల సహాయంతో, క్రేన్‌ను రప్పించి కారును బయటకు తీశారు. అయితే అప్పటికే ఘోరం జరిగిపోయిం ది. కారు పూర్తిగా నీటిలో మునిగిపోవ డంతో శ్వాస ఆడక రాజు, భాగ్యతో పాటు ఆ ఇద్దరు పసికందులు కారులోనే ప్రాణాలు కోల్పోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు..

రాజీవ్ గాంధీ ఆశయాలను సాధించడమే నిజమైన నివాళి

రాజీవ్ గాంధీ ఆశయాలను సాధించడమే నిజమైన నివాళి

మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తొట్ల తిరుపతి యాదవ్

రామగిరి: భారత మాజీ ప్రధానమంత్రి, భారతరత్న స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను గురువారం రామగిరి మండలం బేగంపేట్ ఎక్స్‌రోడ్‌లోని పెట్రోల్ పంప్ వద్ద ఉన్న మంథని బ్లాక్ కాంగ్రెస్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. రామగిరి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ రొడ్డ బాపన్న పటేల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ తొట్ల తిరుపతి యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి తిరుపతి యాదవ్ రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి జయంతి వేడుకలను నిర్వహించారు.ఈ సందర్భంగా తిరుపతి యాదవ్ మాట్లాడుతూ.. దేశ అభివృద్ధి, ఆధునిక భారత నిర్మాణం కోసం రాజీవ్ గాంధీ అందించిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. యువతకు రాజకీయాల్లో ప్రాధాన్యత కల్పించడంతో పాటు, సాంకేతిక రంగంలో భారతదేశాన్ని ప్రపంచస్థాయిలో ముందుకు తీసుకెళ్లేందుకు ఆయన చేసిన కృషి చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినదని పేర్కొన్నారు.పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయడం, యువతకు ఓటు హక్కు వయస్సును 18 సంవత్సరాలకు తగ్గించడం, ఐటీ రంగానికి పునాదులు వేయడం వంటి కీలక నిర్ణయాలు రాజీవ్ గాంధీ దూరదృష్టికి నిదర్శనమని తెలిపారు. రాజీవ్ గాంధీ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ ప్రజాసేవలో ముందుకు సాగడమే ఆయనకు మనం అర్పించే నిజమైన నివాళి అని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో రామగిరి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువజన కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

గుండెపోటుతో గని కార్మికుడి మృతి

గుండెపోటుతో గని కార్మికుడి మృతి

భూపాల‌ప‌ల్లిలో కెటికె1 లో విషాదం

భూపాలపల్లి :సింగరేణి భూపాలపల్లి ఏరియాలో విషాద ఘటన చోటుచేసుకుంది. కేటీకే 1 ఇంక్లైన్ గని నైట్‌ షిఫ్ట్‌లో విధులు నిర్వహిస్తున్న కోల్‌ కట్టర్‌ గోపాల గోపి(45)కు గనిలోనే ఒక్కసారిగా ఛాతిలో నొప్పి రావడంతో పాటు తీవ్రంగా చెమటలు పట్టాయి. దీంతో అప్రమత్తమైన తోటి కార్మికులు, అధికారులు వెంటనే అతడిని గని లోపలి నుంచి పైకి తీసుకొచ్చారు. అనంతరం అంబులెన్స్‌లో ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో గోపికి పరిస్థితి విషమించి మృతి చెందినట్లు తోటి కార్మికులు తెలిపారు. గుండెపోటు కారణంగానే మృతి చెందినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఘటనపై సంబంధిత అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. కార్మికుడి మృతితో సహచరుల్లో విషాదం నెలకొంది.

18 నెలల్లో మంథని రహదారి పనులు పూర్తి: మంత్రి కోమటిరెడ్డి

18 నెలల్లో మంథని రహదారి పనులు పూర్తి: మంత్రి కోమటిరెడ్డి

మంథని, ఆగస్టు 19: మంథని నియోజకవర్గంలో రూ.800 కోట్లకు పైగా చేపట్టిన రహదారి, మౌలిక వసతుల అభివృద్ధి పనులను 18 నెలల్లో పూర్తి చేస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. మంథనిలో బుధవారం మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

గంగాపురి వద్ద రూ.20 కోట్లతో NAC స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌, మంథని–రామగుండం నాలుగు లేన్ల రహదారి విస్తరణ, పట్టణంలో బీటీ, సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన చేశారు. మంథని రహదారి పనులపై ప్రతి 15 రోజులకు సమీక్ష నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. కమాన్‌పూర్‌–మంథని నాలుగు లేన్ల రహదారికి రూ.200 కోట్లు మంజూరు చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ఆమోదం తీసుకుంటామని వెల్లడించారు.

NAC స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ను 6–8 నెలల్లో అందుబాటులోకి తీసుకువచ్చి యువత, మహిళలకు నైపుణ్య శిక్షణ అందిస్తామని చెప్పారు. రహదారులు, మౌలిక వసతుల అభివృద్ధితో పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు.

మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ మంథని ప్రాంతానికి పరిశ్రమలు తీసుకురావడంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని, యువతకు నైపుణ్య శిక్షణ కోసం ATC, NAC కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. తక్కువ వర్షపాతం నేపథ్యంలో రైతులు నీటిని పొదుపుగా వినియోగిస్తూ ప్రత్యామ్నాయ పంటలు, ఆయిల్‌పామ్‌ సాగు వైపు దృష్టి సారించాలని సూచించారు.

కార్యక్రమంలో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, కలెక్టర్‌ కోయ శ్రీహర్ష, ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. అనంతరం మంత్రులు వైకుంఠ రథాలను ప్రారంభించారు.

రామునిగుండాల కొండపై సామూహిక వరలక్ష్మి వ్రతం

రామునిగుండాల కొండపై సామూహిక వరలక్ష్మి వ్రతం

గోదావరిఖని, ఆగస్టు 19(తెలంగాణ నేత్రం tv)
రామునిగుండాల కొండపై వెలసిన శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానం (శ్రీరామపాద క్షేత్రం)లో శ్రావణ శుక్రవారం సందర్భంగా ఈనెల 21న సామూహిక శ్రీ వరలక్ష్మి వ్రతం, కుంకుమ పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి మేడి తిరుపతి తెలిపారు. ఉదయం 10.30 గంటలకు జరిగే కార్యక్రమంలో పాల్గొనే భక్తులకు ఉచితంగా శ్రీలక్ష్మీదేవి డాలర్, పూజా సామగ్రి అందించడంతో పాటు అన్నదానం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. మహిళలు, భక్తులు, కుటుంబ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని పూజా కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఆలయ కమిటీ కోరింది.

మీరు వస్తానంటే మేము వద్దంటామా?

మీరు వస్తానంటే మేము వద్దంటామా?

ఫిరాయింపు ఎమ్మెల్యేలకు BRS ఓపెన్ ఆఫర్!

పొగడ్తలు.. విమర్శలు.. వ్యూహాత్మక అడుగులు?

చర్చల్లో ప్రముఖుల పేర్లు

తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే ముచ్చట నడుస్తోంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్‌లోకి దూకిన ఎమ్మెల్యేలు మళ్లీ వెనక్కి వస్తారా? బీఆర్ఎస్ నిజంగానే వారికి గులాబీ కండువా కప్పడానికి ‘ఆపరేషన్ ఆకర్ష్’ మొదలుపెట్టిందా?

అనే చర్చలు విపరీతంగా సాగుతున్నాయి. అసలు తెరవెనుక ఏం జరుగుతోందనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

పొగడ్తలు.. విమర్శలు.. వ్యూహాత్మక అడుగులు?

కాంగ్రెస్ పార్టీలో చేరిన కొందరు ఎమ్మెల్యేలు ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఈ ప్రచారానికి మరింత ఆజ్యం పోశాయి. ఒకప్పుడు బీఆర్ఎస్‌ను, కేసీఆర్‌ను తీవ్రంగా విమర్శించిన నేతలే.. ఇప్పుడు ఉన్నట్టుండి కేసీఆర్ పాలనను, వారి నిర్ణయాలను పొగడటం వెనుక పెద్ద రాజకీయ వ్యూహమే ఉందనే ప్రచారం సాగుతోంది. ‘పార్టీ మారినా.. మనస్సులో బీఆర్ఎస్ ఆలోచనలే ఉన్నాయా?’ అనే అనుమానాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతున్నాయి.

చర్చల్లో ప్రముఖుల పేర్లు

ఈ తిరుగు ప్రయాణం ప్రచారంలో దానం నాగేందర్, తెల్లం వెంకట్రావ్, డాక్టర్ సంజయ్ కుమార్, బండ్ల కృష్ణమోహన్ రెడ్డిలతో పాటు సీనియర్ నేత పోచారం శ్రీనివాస్ రెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరితో పాటు మరికొందరు నేతలు కూడా బీఆర్ఎస్ అధినాయకత్వంతో టచ్‌లో ఉన్నారనే ఊహాగానాలు షికారు చేస్తున్నాయి. ముఖ్యంగా సీనియర్ నేత అయిన పోచారం శ్రీనివాస్ రెడ్డి నేతృత్వంలోనే ఈ మార్పులు చోటుచేసుకుంటాయా అనే కోణంలో విశ్లేషణలు జరుగుతున్నాయి.

కాంగ్రెస్ సైలెంట్.. కేవలం ప్రచారమేనా?

పోచారం వ్యాఖ్యలు, ఈ మార్పుల ప్రచారాలపై కాంగ్రెస్ అగ్రనేతలు, మంత్రులు పెద్దగా స్పందించకపోవడం గమనార్హం. కేవలం కొంతమంది నేతలు మాత్రమే దీనిపై వ్యాఖ్యానించారు. రాబోయే ఎన్నికల్లో గెలుపు గుర్రాలను తమవైపు తిప్పుకోవడానికి బీఆర్ఎస్ వేసిన కౌంటర్ వ్యూహమా ఇది? లేక కేవలం ఊహాగానాలకే పరిమితమయ్యే రాజకీయ ప్రచారమా? అనేది త్వరలోనే తేలనుంది. ఒకవేళ ఇది నిజమైతే మాత్రం తెలంగాణ రాజకీయం మరో పెద్ద మలుపు తిరగడం ఖాయం.

విగ్రహం కూల్చివేత ఉద్రిక్తతల వేళ నర్సంపేటలో సంచలనం..

విగ్రహం కూల్చివేత ఉద్రిక్తతల వేళ నర్సంపేటలో సంచలనం..

ఇద్దరు సీఐలపై బదిలీ వేటు?

నర్సంపేట నియోజకవర్గంలో పని చేస్తున్న ఇద్దరు సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌లపై వేటు పడినట్లు తెలుస్తోంది. నర్సంపేట రూరల్ సాయి రమణ, నెక్కొండ సీఐ శ్రీనివాస్‌లను వీ.ఆర్‌కి అటాచ్ చేస్తూ వరంగల్ సీపీ ఉత్తర్వులు వెలువడినట్లు సమాచారం.

జే. శంకర్ రావును నర్సంపేట రూరల్ సీఐగా, కే.ఫణిందర్‌ను నెక్కొండ సర్కిల్ సీఐగా బాధ్యతలు అప్పజెప్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. పెద్ది విగ్రహం కూల్చి వేసిన ఘటన నర్సంపేట డివిజన్‌లో ఉద్రిక్తతలను కలిగిస్తున్న తరుణంలో సీఐల మార్పు చర్చనీయాంశంగా మారింది.

తెలంగాణలో లిక్కర్ లవర్స్‌కు బిగ్ షాక్..

తెలంగాణలో లిక్కర్ లవర్స్‌కు బిగ్ షాక్..

భారీగా పెరగనున్న మద్యం ధరలు

రాష్ట్రంలో త్వరలోనే మద్యం ధరలు ‘ప్రియం’కానున్నాయి. తయారీ వ్యయం గణనీయంగా పెరిగిన నేపథ్యంలో తమకు చెల్లించే బేసిక్ ప్రైస్ ను సవరించాలని డిస్టిలరీలు ప్రభుత్వాన్ని ఇప్పటికే కోరిన విషయం తెలిసిందే.

దీనిపై ప్రభుత్వం ప్రైస్ ఫిక్సేషన్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ మద్యంపై 8శాతం వరకు ధరలను పెంచవచ్చని సిఫార్సు చేస్తూ నివేదిక ఇచ్చినట్టు సమాచారం. డిస్టిలరీల డిమాండ్ ను నెరవేర్చటమే కాకుండా రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకునేందుకుగాను ఎక్సయిజ్ శాఖ ఈ కసరత్తు చేసింది. మద్యం ధరల పెంపుపై కమిటీ ఇచ్చిన నివేదికను ఇప్పటికే ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపించినట్టుగా తెలిసింది. సీఎం ఆమోద ముద్ర లభించగానే ధరలను సవరించనున్నట్టు సమాచారం.

కేంద్రానివి కుట్రపూరిత రాజకీయాలు:

కేంద్రానివి కుట్రపూరిత రాజకీయాలు:

విషప్రచారాలను తిప్పికొట్టాలి…

మంత్రి పొంగులేటి

కేంద్రంలోని భాజపా ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యవస్థలను దుర్వినియోగం చేస్తూ, ఓట్ల తొలగింపు పేరిట కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసేందుకు కుట్రపూరిత రాజకీయాలకు ఒడిగడుతోందని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ధ్వజమెత్తారు.

ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో పీఏసీ సమావేశం బుధవారం జరిగింది. ఈ సమావేశంలో స్థానిక రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కో ఇన్ చార్జి సచిన్ సావంత్ హాజరయ్యారు. స్థానిక పార్లమెంట్ సభ్యులు రఘురామ్ రెడ్డి, ఖమ్మం జిల్లా డిసిసి అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్, వైరా శాసనసభ్యులు మాలోతు రాందాస్ నాయక్ తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

ఓటర్ల తొలగింపుపై సమరశంఖం…

ఎస్ఐఆర్ అనే ప్రక్రియను అడ్డం పెట్టుకుని రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీతో కలిసి భాజపా కుట్రలు చేస్తోందని మంత్రి పొంగులేటి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచే దళిత, గిరిజన, మైనారిటీ వర్గాల ఓట్లే లక్ష్యంగా సుమారు 67 నుంచి 68 లక్షల ఓట్లను తొలగించేందుకు శ్రీకారం చుట్టడమే కాకుండా, మరో 70 లక్షల ఓట్లను గాలిలో పెట్టి ఓటర్లను గందరగోళానికి గురిచేస్తున్నారని విమర్శించారు. ఈ కుట్రలను తిప్పికొట్టేందుకు రాబోయే 4-5 రోజుల్లో బూత్ స్థాయి కార్యకర్తలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు.

విషప్రచారాలను తిప్పికొట్టాలి…

రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోందని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమాన్ని పక్కనబెట్టి, ప్రతిపక్షాలు నెలకు రూ.4 నుంచి 5 కోట్లు ఖర్చు చేస్తూ సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తున్నాయని, వాటిని శ్రేణులంతా సమర్థవంతంగా ఎదుర్కొవాలని పిలుపునిచ్చారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ నుంచి అత్యధిక స్థానాలను గెలుచుకుని, రాహుల్ గాంధీని దేశ ప్రధానిని చేయడమే కాంగ్రెస్ శ్రేణుల ప్రధాన లక్ష్యమని పొంగులేటి స్పష్టం చేశారు.

సుల్తానాబాద్‌లో రూ.219.67 కోట్ల రహదారి పనులు

సుల్తానాబాద్‌లో రూ.219.67 కోట్ల రహదారి పనులు

సుల్తానాబాద్‌, ఆగస్టు 19: సుల్తానాబాద్‌ మండలం గరేపల్లిలో రూ.219.67 కోట్ల విలువైన హెచ్‌ఏఎం, నాన్‌ప్లాన్‌ రహదారి అభివృద్ధి పనులకు ఆర్‌అండ్‌బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. రహదారుల అభివృద్ధితో పరిశ్రమలు, వ్యాపారాలు విస్తరించి యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అన్నారు. పనులను రెండేళ్లలో పూర్తి చేస్తామని తెలిపారు. పెద్దపల్లి బైపాస్‌ను ఏడాదిలోపు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని, సుల్తానాబాద్‌ బైపాస్‌ మంజూరుకు కృషి చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ప్రభుత్వ విప్‌ విజయరమణారావు తదితరులు పాల్గొన్నారు.

నాగార్జున స్కూల్ ప్రిన్సిపల్ హత్య కేసులో వెలుగులోకి సంచలన నిజాలు

నాగార్జున స్కూల్ ప్రిన్సిపల్ హత్య కేసులో వెలుగులోకి సంచలన నిజాలు

27 సార్లు పొడిచి ప్రిన్సిపల్ రూపారెడ్డిని హత్య చేసిన టెన్త్ క్లాస్ విద్యార్థులు

నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లిలో నాగార్జున స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డిని హత్య చేసింది ఆమె చదువు చెప్పిన విద్యార్థులేనని నిర్ధారించిన పోలీసులు

గంజాయికి అలవాటు పడి, విచ్చలవిడిగా జల్సాలకు అలవాటుపడి, డబ్బుల కోసం హత్య చేసినట్లు నిర్ధారణ

ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసులో ఇద్దరు 10th క్లాస్ విద్యార్థులు అరెస్ట్

ఈ నెల 11న సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్య

ఆమె స్కూల్ ముగించుకొని ఇంటికి వచ్చే సమయానికి అంతకంటే ముందే గోడ దూకి రూపారెడ్డి ఇంట్లోకి చొరబడ్డ నిందితులు

ఆమె ఇంటి తాళం తీసి లోపలికి వెళ్లిన సమయంలో వంటగదిలో దాక్కున్న నిందితులు

ఆమె ఫ్రెష్ అయి బెడ్‌రూమ్‌లోకి వెళ్లగానే వెనకాల నుంచి వచ్చి కత్తితో 27 సార్లు పొడిచి దాడి

ఆ తర్వాత ఆమె హ్యాండ్ బ్యాగ్‌లో ఉన్న రూ.2 లక్షల రూపాయల డబ్బును ఎత్తుకెళ్లిన విద్యార్థులు

ఆ డబ్బుతో హైదరాబాద్‌లో జల్సాలు, ఎవరికీ డౌట్ రాకుండా సీసీ కెమెరాల్లో పడకుండా జాగ్రత్తలు

ఎట్టకేలకు కనిపెట్టి అరెస్ట్ చేసిన పోలీసులు

కేంద్రానికి రైతుల డెడ్‌లైన్‌.. 29లోగా డిమాండ్లు నెరవేర్చకుంటే దేశవ్యాప్త ఆందోళనలు

కేంద్రానికి రైతుల డెడ్‌లైన్‌.. 29లోగా డిమాండ్లు నెరవేర్చకుంటే దేశవ్యాప్త ఆందోళనలు

న్యూఢిల్లీ: భారత్‌- అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ, తమ డిమాండ్లపై కేంద్రం తిరిగి చర్చలు ప్రారంభించాలని కోరుతూ, అలాగే ఢిల్లీ మార్చ్‌కు అనుమతివ్వాలని డిమాండ్‌ చేస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేపట్టిన నిరసనలు మంగళవారం నాటికి మూడో రోజుకు చేరాయి.

ఆగస్టు 29లోగా తమ డిమాండ్లను పరిష్కరించకుంటే దేశవ్యాప్త నిరసనలు చేపట్టి, మహా పంచాయత్‌తో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని రైతు సంఘాల నేతలు హెచ్చరించారు. మంగళవారం రైతులు ఖనౌరీ దాతా సింగ్‌వాలా సరిహద్దు వద్ద టెంట్లు వేసుకుని నిరసనలు కొనసాగించారు. కాలినడకన ఢిల్లీకి వెళ్లేందుకు తమకు అనుమతినివ్వాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే మంగళవారం సంయుక్త కిసాన్‌ మోర్చా కార్యకర్తల కీలక సమావేశం జరగనుంది. దీనిలో రైతు నిరసనల తదుపరి వ్యూహాన్ని ఖరారు చేయనున్నట్లు సమాచారం.

దేశాన్ని ట్రంప్‌కు అమ్ముకోకూడదు

అమెరికా వ్యవసాయ దిగుమతుల గురించిన భయాలు మొదలుకొని, విద్యుత్తు సరఫరా లైన్లు, నష్టపరిహారం వరకూ దేశవ్యాప్తంగా రైతులు ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తున్నారు. కాంగ్రెస్‌ నేత, గుజరాత్‌కు చెందిన వైద్యుడు, రైతు అయిన డాక్టర్‌ దినేష్‌ భాయ్‌ పర్మార్‌ దేశవ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న ఇక్కట్లను ‘ది వైర్‌’ వెబ్‌సైట్‌కు తెలిపారు. ప్రతిపాదిత భారత్‌-అమెరికా వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా వేలాదిమంది రైతులు దేశవ్యాప్తంగా రెండు నెలలుగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారని, మనం దీనిపై మౌనంగా ఉండలేమని, ఈ విధంగా భారతదేశాన్ని ట్రంప్‌కు అమ్ముకోకూడదన్నారు.

అమెరికాతో వాణిజ్య ఒప్పందం కారణంగా చౌకైన అమెరికన్‌ ఉత్పత్తులు భారత మార్కెట్‌లోకి ప్రవేశించి, దేశీయ వ్యవసాయాన్ని దెబ్బతీస్తాయని భయపడుతూ పంజాబ్‌, హర్యానాతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది రైతులు నిరసన ప్రదర్శనలు చేస్తున్నారన్నారు. ఈ ఒప్పందం కేవలం తమపైనే కాకుండా తమపై ఆధారపడిన శ్రామికులు, దుకాణదారులు, చివరకు వినియోగదారులతో సహా మొత్తం వ్యవసాయ రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుందని రైతులు అంటున్నారు. మరోవైపు గుజరాత్‌లోని మోర్బీలో వ్యవసాయ భూముల్లో రాష్ట ప్రభుత్వం హై వోల్టేజీ విద్యుత్‌ సరఫరా లైన్లు, విద్యుత్‌ స్తంభాలను ఏర్పాటు చేయడానికి వ్యతిరేకంగా రైతుల నిరసనలు రెండు నెలలుగా కొనసాగుతున్నాయి.

వీటివల్ల తమ వ్యవసాయ భూములను కోల్పోతున్నామని, అలాగే తక్కువ పరిహారం అందుతున్నదని రైతులు ఆరోపిస్తున్నారు. మరోవైపు మధ్యప్రదేశ్‌ రైతులు తమ పెసర పంటకు కనీస మద్దతు ధర కల్పించాలని కోరుతూ భోపాల్‌లో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎరువుల కొరతపై కూడా వారు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వ్యవసాయ, ఆర్థిక విధానాలపై సంయుక్త కిసాన్‌ మోర్చా, కేంద్ర టేడ్‌ యూనియన్లు కూడా దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చాయి. తమిళనాడు, త్రిపుర, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్రలలో పలు కార్మిక సంఘాలు ఈ నిరసనలకు నాయకత్వం వహించాయి. రైతుల ఆదాయాన్ని, భూమిని ప్రభావితం చేసే నిర్ణయాలు తీసుకునే ముందు ప్రభుత్వం తమ మొర వినాలని రైతులు కోరుతున్నారు.

నేటి నుంచే దరఖాస్తులు

నేటి నుంచే దరఖాస్తులు

తెలంగాణ లో 7,437 పోలీసు ఉద్యోగాల నియామక ప్రక్రియ ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. ఉదయం 8 నుంచి https://www.tgprb.in/ లో అప్లై చేసుకోవచ్చు.

సెప్టెంబర్ 9 వరకు అవకాశం ఉంటుంది. ఈ పోస్టులకు వయో పరిమితి పెంచడంతో దరఖాస్తుల సంఖ్య భారీగా పెరగనుంది.

ఆధార్ ఫేస్ అథెంటికేషన్ తప్పనిసరి కావడంతో అభ్యర్థులు Aadhaar యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. అవసరమైన సర్టిఫికెట్లను రెడీగా ఉంచుకోవాలి.

తెలంగాణ పై అల్పపీడన ద్రోణి ప్రభావం హైదరాబాద్ వాతావరణ కేంద్రం వర్షం హెచ్చరికలు జారీ చేసింది…!

తెలంగాణ పై అల్పపీడన ద్రోణి ప్రభావం హైదరాబాద్ వాతావరణ కేంద్రం వర్షం హెచ్చరికలు జారీ చేసింది…!

రాష్ట్రంలో వర్షాలు కురిసేందుకు అనుకూల వాతావరణం ఏర్పడిందని చెప్పారు.

రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. భారత వాతావరణ శాఖ హైదరాబాద్‌ కేంద్రం విడుదల చేసిన తాజా బులెటిన్‌లో ఈ వివరాలను వెల్లడించారు.

వాయవ్య బంగాళాఖాతం నుంచి పశ్చిమబెంగాల్‌ – ఉత్తర ఒడిశా తీరాలపై ఏర్పడిన అల్పపీడన ప్రాంతం వరకు రుతుపవన ద్రోణి కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇది తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు విస్తరించి ఉండటం వల్ల తూర్పు, మధ్య భారతంతో పాటు తెలంగాణలోనూ వర్షాలు కురిసేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనాలు, ద్రోణుల ప్రభావం వల్ల ఈ కాలంలో రుతుపవనాలు మరింత చురుగ్గా మారుతుంటాయని చెప్పారు.

అయితే, వర్షాలతో పాటు ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉన్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. విద్యుత్‌ స్తంభాలు, చెట్లు, హోర్డింగులు, నిర్మాణ ప్రాంతాల వద్ద ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఉరుములు, మెరుపుల సమయంలో బహిరంగ ప్రదేశాలలో ఉండకపోవడం శ్రేయస్కరమని తెలిపారు.

ఇందిరమ్మ ఇళ్లకు రూ.230కే సిమెంట్ బస్తా:మంత్రి పొంగులేటి

ఇందిరమ్మ ఇళ్లకు రూ.230కే సిమెంట్ బస్తా:మంత్రి పొంగులేటి

ప్రజాప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో సిమెంట్ పరిశ్రమలు భాగస్వాములు కావాలని రాష్ట్ర హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విజ్ఞప్తి చేశారు.

మంగళవారం సచివాలయంలోని తన కార్యాలయంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అవసరమైన సిమెంట్ ధరల తగ్గింపుపై ఆయా పరిశ్రమల యాజమాన్యాలతో సమావేశమయ్యారు. మంత్రి విజ్ఞప్తి మేరకు ఒక్కో బస్తాను రూ.230లకు ఇవ్వడానికి యాజమాన్యాలు అంగీకరించాయి. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం కేవలం గృహ నిర్మాణ కార్యక్రమం మాత్రమే కాదని..

పేద కుటుంబాలకు గౌరవప్రదమైన జీవితం, సామాజిక భద్రత, ఆత్మగౌరవాన్ని కల్పించే మహాయజ్ఞమని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొదటి విడతలో 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసినట్లు తెలిపారు. వీటిలో ఇప్పటికే గణనీయ సంఖ్యలో 85 శాతం ఇళ్ల శ్లాబులు పూర్తయ్యాయని.. మిగిలిన 15 శాతం ఇళ్లు వివిధ నిర్మాణ దశల్లో వేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు.

రెండో విడతలో నియోజకవర్గానికి రెండు వేల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా రెండున్నర లక్షల ఇళ్లు మంజూరు చేశామన్నారు. అలాగే క్యూర్ పరిధిలో లక్ష ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొని ప్రయోగాత్మకంగా 16 నియోజకవర్గాల్లో ఇందిరమ్మ టవర్స్‌కు శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. నిర్మాణ పురోగతికి అనుగుణంగా విడతల వారీగా ప్రతి సోమవారం పారదర్శకంగా నిధులను విడుదల చేస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి యాజమాన్యాలకు కృతజ్ఞతలు తెలిపారు.

వైసీపీని ఆ భయం వెంటాడుతుందా?

వైసీపీని ఆ భయం వెంటాడుతుందా?

అదే తమ గెలుపునకు అడ్డంకా?

నియోజకవర్గాల పునర్విభజన జరిగితే.

ఎవరి సీట్లు గల్లంతవుతాయో?

వైసీపీ లో ఎక్కడో బెరుకు మాత్రం కనిపిస్తుంది. ఈసారి ఎన్నికల్లో గెలవకపోతే పార్టీ మనుగడ కష్ట సాధ్య మవు తుందేమోనన్న భావన ఎక్కువ మంది నేతల్లో కనిపిస్తుంది

గెలుస్తామన్న ధీమా ఉన్నప్పటకి కూటమి కలసి ఉంటే ఓడించడం కష్టమేనన్న అభిప్రాయం బలంగా వినిపిస్తుంది. మెజారిటీ ఓటర్లు ఇప్పటికీ కూటమి వైపు ఉన్నారన్న విశ్లేషణలు వారిలో ఒకింత భయాన్ని తెచ్చి పెడుతున్నాయి. ఒకవైపు ఇప్పటికే ఓట్ల తొలగింపు భారీగా జరిగింది. మరొకటి ప్రధానంగా డీ లిమిటేషన్ కూడా తమకు కష్టాలు తెచ్చి పెడుతుందన్న భావన వ్యక్తమవుతుంది. నియోజకవర్గాల పెంచాలని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రయత్నాలు చేస్తుంది.

నియోజకవర్గాల పునర్విభజన జరిగితే.ఇంకా సమయం ఉన్నందున డీ లిమిటేషన్ ప్రక్రియ పూర్తి చేయాలన్న లక్ష్యంతో బీజేపీ కేంద్ర నాయకత్వం ఉంది. అదే జరిగితే ఆంధ్రప్రదేశ్ లో కూటమి మరింత బలోపేతం అవుతుంది. ఎక్కువ స్థానాలు వస్తాయి కాబట్టి నియోజకవర్గాలు చిన్నవిగా మారిపోతాయి. దీంతో అనేక నియోజకవర్గాలు తమకు అనుకూలంగా ఉన్న వాటిని రిజర్వ్ డ్ చేస్తారు. అప్పుడు ఓటు బ్యాంకు చీలిపోతుంది. వైసీపీ బలహీనమై తాము గెలుపులో వెనకబడి పోతామన్న భయం వారిని వెంటాడుతుంది. అందుకే ఈ దఫా డీలిమిటేషన్ జరగకూడదని వైసీపీ నేతలు బలంగా కోరుకుంటున్నారు. కానీ డీ లిమిటేషన్ ప్రక్రియ మాత్రం వైసీపీ చేతుల్లో లేదన్నది కూడా వాస్తవం. డీ లిమిటేషన్ ప్రక్రియ దేశ వ్యాప్తంగా జరపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం కావడంతో వైసీపీ అడ్డుకునే అవకాశమూ లేదు. ఎవరి సీట్లు గల్లంతవుతాయో?నియోజకవర్గాల పునర్విభజనలో ఎవరి సీట్లు గల్లంతవుతాయన్న టెన్షన్ మాత్రం వైసీపీ నేతల్లో నెలకొంది. 2009 లో జరిగిన డీ లిమిటేషన్ ప్రక్రియలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తమకు అనుకూలంగా మలచుకుని మరోసారి అధికారంలోకి వచ్చిందన్న విషయాన్ని వైసీపీ నేతలు గుర్తు చేసుకుని ఆందోళన చెందుతున్నారు. అందుకే వైసీపీ నేతలు ఈసారి గెలుపుపై టెన్షన్ లో ఉన్నారు. గత ఎన్నికల్లోనే జనం తమకు నలభై శాతం ఓట్లు వేసినప్పటికీ పదకొండు సీట్లకే పరిమితమయ్యామని, అదే నియోజకవర్గాల పునర్విభజన జరిగి, తమకు అనుకూలమైన ఓట్లు తొలగిస్తే సీట్ల సంఖ్య తగ్గిపోవడంతో పాటు తమకు నలభై శాతం ఓటింగ్ కూడా వస్తుందా? రాదా? అన్న భయం కలుగుతోంది. మొత్తం మీద వైసీపీ అధినేత జగన్ పర్యటనలకు జనం అధికంగా వస్తున్నప్పటికీ కానీ ఏ మూలో మాత్రం తమకు ప్రజల మద్దతు ఉన్నా, గెలుపు దక్కదేమోనన్న ఆందోళన అధికంగా వైసీపీలో ఉంది

విద్యార్థుల కోసం పోరాడిన ఎస్పీకే సాగర్‌ను అదుపులోకి తీసుకోవడం ఖండనీయం

విద్యార్థుల కోసం పోరాడిన ఎస్పీకే సాగర్‌ను అదుపులోకి తీసుకోవడం ఖండనీయం

జయశంకర్ భూపాలపల్లి, ఆగస్టు 18: పాలిటెక్నిక్‌ విద్యార్థుల సమస్యలపై శాంతియుతంగా నిరసన చేస్తున్న విద్యార్థులకు సంఘీభావం తెలిపి, వారి తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వరంగల్ పార్లమెంట్‌ కంటెస్టెడ్‌ ఎంపీ అభ్యర్థి, నేషనల్‌ కన్జ్యూమర్‌ రైట్స్‌ కమిషన్‌ తెలంగాణ రాష్ట్ర చైర్మన్‌ ఎస్పీకే సాగర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోవడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.

విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం, వారి తరఫున ప్రశ్నిస్తున్న వారిని పోలీసులతో అదుపులోకి తీసుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని సాగర్‌ అన్నారు. అరెస్టులు, నిర్బంధాలతో ప్రజా గొంతులను అణచలేరని పేర్కొన్నారు.

పాలిటెక్నిక్‌ విద్యార్థులు తమ సమస్యలను జిల్లా కలెక్టర్‌కు వివరించి వినతిపత్రం అందించేందుకు వచ్చిన సమయంలో వారిని కలుసుకుని సమస్యలు వినేందుకు కలెక్టర్‌ బయటకు రాకపోవడం బాధాకరమన్నారు. “జిల్లా కలెక్టర్‌ విద్యార్థులు, ప్రజల సమస్యలు వినడానికి ఉన్నారా? లేక రాజకీయ నాయకుల కోసం మాత్రమే ఉన్నారా?” అని ప్రశ్నించారు.

విద్యార్థులపై పోలీసులు బలప్రయోగం చేయడం, వారిని బలవంతంగా తరలించడం, విద్యార్థుల తరఫున ప్రశ్నించిన వారిని అదుపులోకి తీసుకోవడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని అన్నారు.

విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం ఆటలాడవద్దని, పోలీసు బలంతో ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తే మరింత బలంగా ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రశ్నిస్తామని ఎస్పీకే సాగర్‌ స్పష్టం చేశారు. ప్రభుత్వం వెంటనే విద్యార్థులతో చర్చలు జరిపి వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.

22ఏ జాబితా వెనుక కుట్ర..సమగ్ర విచారణ చేస్తాం:మంత్రి కోమటిరెడ్డి

22ఏ జాబితా వెనుక కుట్ర..సమగ్ర విచారణ చేస్తాం:మంత్రి కోమటిరెడ్డి

22ఏ జాబితా వెనుక కుట్ర దాగి ఉందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంగళవారం ఓ మీడియా ఛానల్‌తో మాట్లాడుతూ అన్నారు. 22ఏ భూములపై సమగ్ర విచారణ చేస్తామని, బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.

ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలనే ఉద్దేశంతో కొందరు కావాలనే ఈ వివాదాన్ని తెరపైకి తెచ్చారని ఆరోపించారు. 22ఏ నిషేధిత భూముల జాబితాలో చోటుచేసుకున్న లోసుగులపై ప్రభుత్వం పూర్తిస్థాయిలో విచారణ జరిపిస్తుందని మంత్రి తెలిపారు. యాదగిరిగుట్టలో రూ.42,000 ఎకరాలు నిషేధిత జాబితాలో పెట్టారని నాలుగు నెలల క్రితమే సీఎంకు చెప్పానని తెలిపారు. కొందరు అధికారులు ఉద్దేశపూర్వకంగానే చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు.

దరఖాస్తులు, డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని, పొరపాటు జరిగిందా.. కావాలనే చేశారా.. పొలంలోనే విచారిస్తామన్నారు. 30% కమిషన్ల వ్యవహారం కూడా దర్యాప్తులో బయటపడుతుందన్నారు. సీఎం అమెరికా పర్యటన తర్వాత దీనిపై శ్వేతపత్రం విడుదల చేస్తామని తెలిపారు. నిషేధిత జాబితాలో భూములు ఎలా చేరాయి? వాటి వివరాల్లో మార్పులు, చేర్పులు ఎలా జరిగాయి? అనే అంశాలను పరిశీలిస్తామన్నారు. ఈ వ్యవహారం వెనుక ఎవరున్నా, ఎంతటి వారైనా చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీసేలా తప్పుడు ప్రచారాలకు పాల్పడితే సహించేది లేదన్నారు. 22ఏ జాబితా వ్యవహారంపై వాస్తవాలను ప్రజలకు వెల్లడిస్తామని చెప్పారు. విచారణలో అక్రమాలు బయటపడితే బాధ్యులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు.

మోదీ టీమ్‌లో తెలంగాణ నుంచి ఎర్త్ ఎవరికి.?బెర్త్ ఎవరికి.?

మోదీ టీమ్‌లో తెలంగాణ నుంచి ఎర్త్ ఎవరికి.?బెర్త్ ఎవరికి.?

ఆ ముగ్గురిలో ఎవరికి ఛాన్స్ దక్కబోతుంది..

త్వరలో సెంట్రల్ క్యాబినెట్ షఫ్లింగ్. మోదీ టీమ్‌లో తెలంగాణ నుంచి ఎర్త్ ఎవరికి.? బెర్త్ ఎవరికి.? ఎలక్షన్ టీమ్‌లో ఉండేదెవరు.? ఇన్నాళ్లు హాట్ టాపిక్‌గా నడిచిన ఈ చర్చకు కాస్త బ్రేక్ పడింది.

ఇప్పట్లో కేంద్రమంత్రి వర్గ విస్తరణ ఉండబోదోన్న సంకేతాలు వచ్చాయి. ఇంతలోనే జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించింది బీజేపీ అధిష్టానం. బీజేపీ నేషనల్ టీమ్‌లో తెలంగాణ నుంచి ఒక్కరికి కూడా అవకాశం కల్పించలేదు. మొన్నటి వరకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బండి సంజయ్, జాతీయ ఉపాధ్యక్షురాలిగా డీకే అరుణ, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా లక్ష్మణ్ కొనసాగారు. కొత్త టీమ్‌లో ఈ ముగ్గురికీ చోటు దక్కకపోవడం రకరకాల చర్చకు దారి తీస్తోంది. తెలంగాణలో పార్టీని మరింత విస్తరించడమే లక్ష్యమని..వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడమే టార్గెట్ అంటున్న బీజేపీ..జాతీయ స్థాయి పదవుల్లో రాష్ట్రానికి ప్రాతినిధ్యం కల్పించకపోవడం రాజకీయ వర్గాల్లో డిస్కషన్ పాయింట్ అవుతోంది.

బీజేపీ ఏ ఎంపిక చేసిన..ఏ నేతకు ఏ పదవి ఇచ్చినా ఓ లెక్క ఉంటుంది. ఇప్పుడు జాతీయ కార్యవర్గం విషయంలో కొత్త ఈక్వేషన్స్ ఉన్నాయంటున్నారు. ముఖ్యంగా యూపీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని జాతీయ కార్యవర్గంలో నేతలకు చోటు కల్పించారన్న టాక్ వినిపిస్తోంది. అయితే తెలంగాణ నుంచి ఒక్కరంటే ఒక్కరికి ఛాన్స్ ఇవ్వకపోవడానికి రీజన్స్ చాలా ఉన్నాయంటున్నారు. కీలక పదవులు కట్టబెట్టినా రాష్ట్రంలో పార్టీ బలోపేతం కోసం నేతలు రోడ్‌మ్యాప్‌ రెడీ చేయకపోవడంపై బీజేపీ జాతీయ పార్టీ నేతలు అసంతృప్తిగా ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

అందుకే తెలంగాణ నేతలకు చోటు కల్పించలేదంటున్నారు. మరో చర్చ కూడా జరుగుతోంది. తెలంగాణకు కేంద్రమంత్రివర్గంలో ప్రాధాన్యత కల్పిస్తారని అంటున్నారు. లేటెస్ట్ నియామకాలు చూస్తే తెలంగాణకు అదనంగా మరో బెర్తు దక్కే అవకాశం ఉందని చెబుతున్నారు. అందుకు ఎగ్జాంపుల్స్ కూడా చెబుతున్నారు.

డీకే అరుణ పేరు క్యాబినెట్ రేసులో బలంగా వినిపించింది. ఆమెను ఇప్పుడు జాతీయ ఉపాధ్యక్ష పదవి నుంచి తప్పించి.. ఆ పోస్ట్‌ను పురంధేశ్వరికి అప్పగించారు. అంటే క్యాబినెట్ ఎక్స్‌ప్యాన్షన్‌ జరిగితే ఏపీ నుంచి కొత్తగా ఎవరికి అవకాశం దక్కదన్న ఇండికేషన్ జాతీయ నాయకత్వం ఇచ్చిందంటున్నారు. కేంద్రమంత్రి వర్గ విస్తరణలో తెలంగాణకు ప్రయారిటీ ఇచ్చేందుకే..జాతీయ కార్యవర్గంలో చోటు కల్పించలేదని చెబుతున్నారు. ఉమెన్ కోటాలో డీకే అరుణకు మంత్రివర్గంలో చోటు దక్కడం ఖాయమని అంటున్నారు.

ఇక బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న బండిసంజయ్‌కు తిరిగి పోస్ట్ కంటిన్యూ చేయలేదు. ఆయనకు మళ్లీ రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగించే ఆలోచనలో పార్టీ ఉన్నట్లు కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే బండి సంజయ్ స్థానంలో ఈటల రాజేందర్ లేకపోతే ధర్మపురి అర్వింద్‌ను మోదీ టీమ్‌లోకి తీసుకుంటారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

బీజేపీ జాతీయ కార్యవర్గంలో రాష్ట్ర నేతలకు చోటు దక్కకపోవడంపై అయితే రకరకాల చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో పార్టీ బలంగా ఉంది. పైగా సీనియర్ లీడర్లు ఉన్నారు. అయినా తెలంగాణ నుంచి ఒక్క నేతను జాతీయ కార్యవర్గంలో తీసుకోలేదంటే..బీజేపీ అధిష్టానం పెద్దల మాస్టర్ ప్లాన్ వేరే ఉందన్న చర్చ జరుగుతోంది. నెక్స్ట్ ఎలక్షన్స్ సెంట్రిక్‌గా తెలంగాణపై సీరియస్ ఫోకస్ చేసిన బీజేపీ హైకమాండ్.. మంత్రివర్గ విస్తరణ తర్వాత అసలు సిసలు మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంట్‌ చేయబోతుందని రాష్ట్ర నేతలు ధీమాతో ఉన్నారు.

అంతేకాదు పార్టీ పదవులు దక్కలేదంటే.. క్యాబినెట్ ఆశలు పెరిగినట్లేనని.. లాబీయింగ్ స్పీడప్ చేసే పనిలో బిజీ అయిపోతున్నారట కమలనాథులు. తెలంగాణ బీజేపీ నేతల్లో అమాత్యయోగం దక్కేదెవరికి.? ఇద్దరు సిట్టింగ్లలో ఎవరి పోస్ట్ ఊస్ట్ అయి..రాష్ట్ర బీజేపీ పగ్గాలు చేపట్టబోతున్నారో వేచి చూడాలి మరి.

తెలంగాణ రాజకీయాలను ఒక్క ప్రకటనతో షేక్ చేసిన కల్వకుంట్ల కవిత

తెలంగాణ రాజకీయాలను ఒక్క ప్రకటనతో షేక్ చేసిన కల్వకుంట్ల కవిత

భూలక్ష్మి పథకం పేరుతో..

గతంలో ఉచిత వైద్య ప్రకటన

రాష్ట్రంలో భూమి పంపిణీ అవసరం..

రాజకీయ సంచలనం..

తెలంగాణలో 2028 లో జరిగే అసెంబ్లీ ఎన్నికల నటికి తెలంగాణ రక్షణ సేన పార్టీని బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఆ పార్టీ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కూతురు, మాజీ ఎంపీ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యూహాలు రూపొందిస్తున్నారు.

పార్టీ గురించి నిత్యం ప్రజల్లో చర్చ జరగాలని ఉద్దేశంతో సంచలన ప్రకటనలు చేస్తున్నారు. ఇటీవలే ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలంగాణలో టిఆర్ఎస్ పాలనలో జరిగిన అవకతవకలను, కుటుంబంలోని లోపాలను బయటపెట్టారు. తాజాగా రాజకీయాల్లో కొత్త చర్చను రేకెత్తిస్తూ తెలంగాణ రక్షణ సేన పార్టీ అధినేతగా కల్వకుంట్ల కవిత ఒక సాహసోపేత ప్రకటన చేశారు. అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని భూమిలేని నిరుపేదలకు ‘భూలక్ష్మి’ పథకం ద్వారా ఒక్కొక్కరికి ఒక ఎకరం భూమి కేటాయిస్తామని ప్రకటించారు. ఇది కేవలం ఎన్నికల వాగ్దానంగా కాకుండా, సామాజిక న్యాయం, ఆర్థిక స్వావలంబన దిశగా కీలక ప్రకటనగా విశ్లేషకులు భావిస్తున్నారు.

భూలక్ష్మి పథకం పేరుతో..
కవిత చెప్పిన ప్రకారం ఈ పథకం మూల ఉద్దేశం రాష్ట్రంలోని ప్రతి భూమిలేని పేద కుటుంబానికి సమానంగా భూమి అందుబాటులో ఉండాలి. భూమి అనేది కేవలం ఆస్తి కాదు.. జీవనాధారం, గౌరవం, తరతరాల స్వావలంబన. అనేక మంది వ్యవసాయ కూలీలు, భూమిలేని కుటుంబాలు ఇప్పటికీ ఇతరుల భూముల్లో పని చేస్తూ జీవనం సాగిస్తున్న నేపథ్యంలో ఈ ప్రకటన ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది.
గతంలో ఉచిత వైద్య ప్రకటన..
తెలంగాణ రక్షణ సేన పార్టీని ప్రకటించిన రోజు తమ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి పేజీ నుంచి పీజీ వరకు ఉచితంగా విద్య అందిస్తామని తెలిపారు. ఇంజనీరింగ్ అయినా మెడికల్ అయినా ఉచితంగా ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. ఇప్పుడు భూమి పంపిణీని ముందుకు తీసుకువచ్చారు. విద్య, భూమి ప్రాథమిక అవసరాలుగా కవిత భావిస్తున్నారు.

రాష్ట్రంలో భూమి పంపిణీ అవసరం..
తెలంగాణలో భూమి పంపిణీ అంశం కొత్తది కాదు. గత ప్రభుత్వాలు వివిధ పథకాల ద్వారా భూమి కేటాయింపులు చేసినప్పటికీ, అనేక మంది ఇంకా భూమిలేని స్థితిలోనే ఉన్నారు. కవిత ఈ వాస్తవాన్ని గుర్తు చేస్తూ “రాష్ట్రంలో భూమి పంపిణీ జరగాల్సి ఉంది” అని నొక్కి చెప్పారు. ఆమె దృష్టిలో భూమి లేని వారికి భూమి ఇవ్వడం అనేది సామాజిక సమానత్వం వైపు తీసుకెళ్లే అడుగు. ఈ మేరకు భూలక్ష్మి పథకం పోస్టర్‌ను కూడా విడుదల చేసిన నేపథ్యంలో, ఈ ప్రకటన కేవలం మాటలకే పరిమితం కాకుండా కార్యాచరణకు సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు ఇచ్చారు.

రాజకీయ సంచలనం..
కవిత ప్రకటన తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చను తీసుకువస్తుంది. భూమి అంశం ఎప్పుడూ సున్నితమైనది. అమలు చేయాలంటే భూమి లభ్యత, గుర్తింపు, పంపిణీ విధానం, నిధులు వంటి అనేక సవాళ్లు ఉంటాయి. అయినా కవిత ఈ అంశాన్ని స్పష్టంగా ముందుకు తీసుకురావడం ఆమె పార్టీ దృష్టిని ప్రజల వైపు మరింతగా మళ్లించింది. విద్యతో పాటు భూమిని కూడా ప్రాథమిక హక్కుగా చూడాలనే ఆలోచన కవితకు ఉన్నట్లు తెలుస్తోంది ప్రకటనలో కనిపిస్తోంది. భూమి లభిస్తే కుటుంబాలు స్వయం ఉపాధి వైపు అడుగులు వేస్తాయని భావిస్తున్నారు. ఇది దీర్ఘకాలంలో పేదరిక నిర్మూలనకు దోహదపడుతుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

కల్వకుంట్ల కవిత చేసిన ‘భూలక్ష్మి’ ప్రకటన తెలంగాణ రాజకీయాల్లో ఒక కొత్త సంచలనం. భూమిలేని ప్రతి పేద కుటుంబానికి ఒక ఎకరం భూమి అనే లక్ష్యం ఎంత సాహసోపేతమైనదో, అంతే సవాల్ తో కూడినది. అయినా ఈ దృష్టి సామాజిక న్యాయం, సమానత్వం వైపు మరోసారి దృష్టిని మళ్లిస్తోంది. అధికారంలోకి ఈ వాగ్దానం ఎలా అమలు చేస్తారో చూడాలి. కాజా ప్రకటన మాత్రం తెలంగాణ రక్షణ సేన పార్టీని, కవితను ప్రజల చర్చల్లో మరింతగా నిలబెట్టింది

కొండా.. కోల్పోయింది కొండంత అండ..!

కొండా.. కోల్పోయింది కొండంత అండ..!

పరకాల టికెట్‌పై సీఎం స్పష్టత..

కొండా ఆశలు ఆవిరి..

రాజకీయ పరిణామాల్లో మార్పు తప్పదా?

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశమయ్యాయి. అధికార కాంగ్రెస్‌లో అంతర్గత ముసలం రోజు రోజుకూ ముదురుతోంది. ఒకవైపు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి సొంత ప్రభుత్వంపైనే విమర్శలు చేస్తున్నారు.

మొన్నటి వరకు మంత్రి పదవి కోసం ప్రయత్నించాడు. విఫలం కావడంతో తిరుగుబాట పట్టారు. తాజాగా సీఎం రేవంత్‌రెడ్డి ఉమ్మడి వరంగల్‌ జిల్లా పర్యటనలో భాగంగా పరకాల జరిగిన బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలు మరోమారు చర్చనీయాంశమయ్యాయి. రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించాయి. ప్రస్తుత ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డినే వచ్చే ఎన్నికల్లో మళ్లీ పోటీ చేయించాలని, ఆయనను ఆశీర్వదించాలని ఓటర్లను కోరారు. ఇవి తన మంత్రివర్గ సహచరురాలు కొండా సురేఖకు షాక్‌ ఇచ్చాయి. పరకాల సీటు తన కూతురుకు ఇప్పించాలని మంత్రి కంటున్న కలలు కల్లలయ్యాయి.

పరకాల టికెట్‌పై సీఎం స్పష్టత..
ఇప్పటికే ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో కొండా సురేఖకు, ఇతర ఎమ్మెల్యేలకు మధ్య సఖ్యత కొరవడింది. కొండాపై ఇటీవలే ఉమ్మడి జిల్లా నేతలు సీఎంకు, పీసీసీ చీఫ్‌కు ఫిర్యాదు చేశారు. కొండా మురళి అరాచకాలనూ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో పరకాల సభలో రేవంత్‌రెడ్డి స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌ రెడ్డి కృషిని ప్రశంసించారు. ప్రాంత అభివృద్ధికి ఆయన చేసిన పనులను గుర్తు చేస్తూ, వచ్చే ఎన్నికల్లో కూడా ఆయననే గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. ఇది సాధారణ ప్రోత్సాహం కాకుండా, స్పష్టమైన రాజకీయ సంకేతం. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా, సీఎం స్థాయిలో ఇలా పేరు తీసుకుని మాట్లాడటం అరుదు. దీంతో పరకాల సీటుపై రేవూరి ప్రకాశ్‌రెడ్డికి అధికార పార్టీలో బలమైన మద్దతు ఉన్నట్లు స్పష్టమైంది.

కొండా ఆశలు ఆవిరి..
మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళి గత కొన్ని నెలలుగా తమ కుమార్తె సుష్మితను పరకాల నుంచి బరిలోకి దించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. కుటుంబం పరకాలను తమ రాజకీయ కంచుకోటగా భావిస్తూ, సుష్మితను తదుపరి తరం నాయకురాలిగా నిలబెట్టాలని చూస్తున్నారు. గతంలో కూడా సురేఖ పరకాల నుంచి పోటీ చేసిన నేపథ్యం ఉంది. కానీ సీఎం నేరుగా ప్రస్తుత ఎమ్మెల్యే పేరు చెప్పి మద్దతు తెలపడంతో కొండా కుటుంబం ఆశలు ఆవిరయ్యాయి. మరో ఆసక్తికర అంశం ఏమిటంటే, సీఎం ఉమ్మడి వరంగల్‌ పర్యటనలో కొండా సురేఖ-మురళి దంపతులు హాజరు కాలేదు. మేడారం నుంచి పరకాల వరకు జరిగిన కార్యక్రమాల్లో వారు కనిపించకపోవడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది.

రాజకీయ పరిణామాల్లో మార్పు తప్పదా?
ఈ పరిణామం కాంగ్రెస్‌ పార్టీలో అంతర్గత సమతుల్యతను సూచిస్తోంది. సీఎం స్థానిక ఎమ్మెల్యేలకు ప్రాధాన్యం ఇస్తూ, కుటుంబ రాజకీయాలకు దూరంగా ఉండాలనే సందేశం ఇచ్చినట్లు కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పరకాలలో రేవూరి ప్రకాశ్‌రెడ్డి బలమైన స్థానిక నాయకుడిగా ఉన్నారు. ఆయనను కొనసాగించడం ద్వారా పార్టీలో స్థిరత్వం కాపాడుకోవాలని సీఎం భావించి ఉండవచ్చు. అయితే ఎన్నికలకు ఇంకా సమయం ఉంది. టిక్కెట్‌ పంపిణీ అధికారికంగా జరగాల్సి ఉంది. కొండా కుటుంబం ఇప్పుడు ఎలా స్పందిస్తుందో, సుష్మిత ఏమి చేస్తారో చూడాలి. పార్టీలోని ఇతర నాయకులు కూడా ఈ సంకేతాన్ని గమనిస్తూ ఉంటారు.

మొత్తంగా చూస్తే పరకాల సభ ద్వారా కొండా కుటుంబం పెద్ద అండ కోల్పోయినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే సురేఖ పనితీరుపై సీఎం అసంతృప్తిగా ఉన్నారు. ఆమెకే వచ్చే ఎన్నికల్లో టికెట్‌ ఇస్తారా లేదా అన్న అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు ఆమెతోపాటు ఆమె కుటుంబానికి షాక్‌ ఇచ్చారు. సీఎం స్పష్టమైన నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది.

ధర్మపురి అరవింద్‌కి బల్మూరి వెంకట్ స్ట్రాంగ్ కౌంటర్

ధర్మపురి అరవింద్‌కి బల్మూరి వెంకట్ స్ట్రాంగ్ కౌంటర్

ధర్మపురి అరవింద్‌కి ప్రభుత్వ విప్ బల్మూరి వెంకట్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. నిజామాబాద్ ఎంపీకి సోయి లేదని ప్రభుబల్మూరి వెంకట్ అన్నారు.

రెండు సార్లు ఎంపీగా గెలవగానే అందర్నీ చిన్నచూపు చూస్తున్నారని బల్మూరి వెంకట్ అరవింద్ పై మండిపడ్డారు.

కాంగ్రెస్ పెట్టిన బిక్షే… అరవింద్ వేసుకున్న బట్టలు కూడా కాంగ్రెస్ పెట్టిన బిక్షేనని బల్మూరి వెంకట్ అన్నారు. అరవింద్‌కి.. ఈ స్థాయి వచ్చిందే కాంగ్రెస్ వల్లనేనని ఆయన మర్చిపోతున్నారని బల్మూరి వెంకట్ తెలిపారు. అరవింద్ పిచ్చోడిలాగా మాట్లాడుతున్నారని, ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు.

కాంగ్రెస్ మెడకు “22 ఎ”…

కాంగ్రెస్ మెడకు “22 ఎ”…

బయటపడేందుకు ప్రయత్నం

22 ఎ అంటే ఏంటంటే?

తెలంగాణలో సెక్షన్ 22-ఏ వివాదం కాంగ్రెస్ సర్కార్ మెడకు చుట్టుకుంది. అయితే దీని నుంచి బయటపడేందుకు ప్రయత్నాలు ప్రారంభిచింది. 22ఎ నిషేధిత భూముల జాబితా ప్రైవేట్, అసైన్డ్ భూమి చేరడం వల్ల వేలాది మంది సామాన్య ప్రజలు, రైతులు ఆందోళన చెందుతున్నారు.

ఇది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాజకీయంగా ఇరుకున పెట్టింది. ప్రతిపక్షాలు దీనిపై తీవ్ర విమర్శలు చేస్తుండటంతో, ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. ప్రైవేట్ పట్టా భూములు కూడా 22-ఏ జాబితాలోకి చేరడంతో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి.రాష్ట్రవ్యాప్తంగా సామాన్య యజమానులు తీవ్ర గందరగోళానికి, ఆందోళనకు గురవుతున్నారు. మేడ్చల్, మల్కాజ్‌గిరి వంటి అర్బన్ ప్రాంతాల్లో వందల సంఖ్యలో ఫిర్యాదులు అందాయి.అనేక భవనాలు, భూములు క్రయవిక్రయాలు నిలిచిపోయాయి. ఫలితంగా 22 ఎ భయం తెలంగాణను పట్టి పీడిస్తుంది.

ప్రతిపక్షాల పోరు బాట…

బీఆర్ఎస్ నేతలు ఈ సెక్షన్‌ను ప్రభుత్వం అడ్డగోలుగా మారుస్తోందని ఆరోపించారు. తప్పుగా చేర్చిన జాబితాను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.దీనిపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని పట్టుబట్టారు.ప్రభుత్వ స్పందనఅర్హులైన భూ యజమానులకు ఎలాంటి నష్టం జరగదని మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భరోసా ఇచ్చారు.సమస్య పరిష్కారానికి అధికారులు సబ్-రిజిస్ట్రార్ వారీగా వివరాలు సేకరించి, దిద్దుబాటు చర్యలు చేపడుతున్నారు. అయినా బీఆర్ఎస్ నేతలు మాత్రం ప్రయివేటు వ్యక్తులకు చెందిన భూముల నుంచి సొమ్ములు వసూలు చేయడానికే 22 ఎను తీసుకు వచ్చారని అన్నారు. నిషేధిత భూములు, ఆస్తులు క్రయవిక్రయాలు నిలిచిపోవడంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడింది. ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములు, వాగులు, చెరువుల శిఖం భూములు, మరియు
వివాదాస్పద ఆస్తుల అమ్మకాలను ఆపడానికి రిజిస్ట్రేషన్ చట్టం కింద సెక్షన్ 22-ఏను తెచ్చారు.ఈ జాబితాలో ఉన్న భూములకు సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఎలాంటి రిజిస్ట్రేషన్లు లేదా బదిలీలు జరగవు.

22 ఎ అంటే ఏంటంటే?

అధికారులు ఎలాంటి సరైన క్షేత్రస్థాయి పరిశీలన, వెరిఫికేషన్ చేయకుండానే ప్రైవేట్ పట్టా భూములు, అపార్ట్‌మెంట్లను కూడా పొరపాటున 22-ఏ జాబితాలో చేర్చారు.హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో వేలాది ఎకరాల ప్రైవేట్ ఆస్తులు నిలిచిపోవడంతో యజమానులు ఆందోళన చెందుతున్నారు.అత్యవసర వైద్యం, పిల్లల పెళ్లిళ్లు, విద్యా వసరాల కోసం ఆస్తులు అమ్ముకుందామన్నా కుదరక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం స్పందన మరియు పరిష్కారంప్రజలు ఆందోళన చెందవద్దని, ఇది కేవలం అడ్మినిస్ట్రేటివ్ పొరపాటు వల్ల జరిగిందని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.ఈ సమస్యల పరిష్కారానికి ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు.తప్పుగా చేర్చిన ఆస్తులను మూడు నుంచి ఐదు రోజుల్లో పరిష్కరిస్తామని, రెవెన్యూ లేదా రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం తెలిపింది.

కేసీఆర్ దశ, దిశ బాగోలేదు,కేసీఆర్ పాలనపై సెటైర్లు:సీఎం రేవంత్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్

కేసీఆర్ దశ, దిశ బాగోలేదు,కేసీఆర్ పాలనపై సెటైర్లు:సీఎం రేవంత్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్

బహుజనుల హక్కుల కోసం పోరాడిన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. ఇవాళ నగరంలో ట్యాంక్‌బండ్‌పై నూతనంగా ఏర్పాటు చేసిన సర్వాయి పాపన్న గౌడ్ కాంస్య విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి..

పలువురు మంత్రులు, బీసీ సంఘాల నాయకులతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ట్యాంక్‌బండ్‌కు వచ్చే ప్రతి పర్యాటకుడికి కనిపించేలా ఈ విగ్రహ ఏర్పాటు స్థలాన్ని తానే స్వయంగా ఎంపిక చేశానని తెలిపారు. విగ్రహ ప్రాశస్త్యం కోసం అక్కడే ఉన్న టూరిజం కార్యాలయాన్ని కూడా ఖాళీ చేయించామని, అమరవీరుల స్తూపానికి ఉన్నంత ప్రాధాన్యత పాపన్న గౌడ్ విగ్రహానికి ఉంటుందని చెప్పారు.

సామాజిక న్యాయం – బహుజన ఆత్మగౌరవం..

సర్వాయి పాపన్న వీరగాథను లండన్‌లోని బ్రిటీష్ లైబ్రరీలో సైతం భద్రపరిచారని సీఎం గుర్తుచేశారు. బహుజనుల నుంచి పుట్టుకొచ్చిన ఈ వీరుడి విగ్రహాన్ని నెలకొల్పాలని గీత కార్మికులు ఎంతో తాపత్రయపడ్డారని, తమ ప్రజాపాలనలో సామాజిక న్యాయం, సమాన అవకాశాలకు పెద్దపీట వేస్తున్నామని స్పష్టం చేశారు.

కుల వృత్తులకు ఆసరా..

రాష్ట్రంలో నేత, గీత కార్మికులకు పెన్షన్లు ఇవ్వాలని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చామని సీఎం తెలిపారు. ప్రభుత్వ భూములు ఎక్కడ ఉన్నా ఈత, తాటి చెట్లను పెంచాలని పిలుపునిచ్చారు. కుల వృత్తులను గౌరవిస్తూనే పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని, పిల్లల చదువు కోసం ఎన్ని వందల కోట్లయినా ఖర్చు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని భరోసా ఇచ్చారు

బావ, బావమరిది అబద్ధపు ప్రచారం..

తెలంగాణ చరిత్రలోనే బీసీల జనాభా లెక్కలు తేల్చి సామాజిక న్యాయం అందించిన తొలి ప్రభుత్వం తమదేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గత బీఆర్ఎస్ పాలకులు చేసిన వేల కోట్ల అప్పులు ఈనాడు రాష్ట్రానికి పెద్ద ముప్పుగా మారాయని, ఆ అప్పులకు నిరంతరం వడ్డీలు చెల్లిస్తూనే తమ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తోందని ఆయన తెలిపారు. ఇదే సమయంలో ప్రతిపక్షంలో ఉన్న బావబావమరుదులు కేటీఆర్, హరీష్ రావు ప్రభుత్వంపై అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని, రాష్ట్రంలో కరవు రావాలని కోరుకుంటూ తమిళనాడు నుంచి అఘోరాలను రప్పించి చేతబడులు చేయించారని సంచలన ఆరోపణలు చేశారు. సాధారణంగా ఊళ్లలో చేతబడులు చేసేవారిని చెట్లకు కట్టేసి కొడతారని దుయ్యబట్టిన ఆయన, ప్రజలు కష్టపడి తెచ్చుకున్న ఈ ‘ప్రజాపాలన’ను కాపాడుకోవాలని, మళ్లీ పాత దొరల పాలన రావడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం ఇవ్వొద్దని పిలుపునిచ్చారు.

కేసీఆర్ పాలనపై సెటైర్లు:

గత బిఆర్ఎస్ పాలనపై సీఎం రేవంత్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘నాడు గొర్రెలు, బర్రెలు, చేపలు పంపిణీ చేసి.. రాజ్యం వాళ్లు ఏలుతూ, మనల్ని కుల వృత్తులకే పరిమితం చేయాలని చూశారు’ అని ఎద్దేవా చేశారు. కేసీఆర్ సీఎం అయితే ఆయన కొడుకు కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్, అల్లుడు హరీశ్ రావు మంత్రి అయ్యారని.. అదే రేవంత్ సీఎం అయితే బీసీ నేత మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ చీఫ్, సీతక్క, వాకిటి శ్రీహరి మంత్రులయ్యారని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ, చాకలి ఐలమ్మ మనుమరాలికి కీలక పదవులు ఇచ్చి ఉద్యమకారులను గౌరవించామని తెలిపారు. రాబోయే డీలిమిటేషన్ తర్వాత 117 సీట్లతో మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

ఇవాళ రాత్రి ఢిల్లీకి వెళ్లనున్న రేవంత్ రెడ్డి

ఇవాళ రాత్రి ఢిల్లీకి వెళ్లనున్న రేవంత్ రెడ్డి

రేపు రాత్రి ఢిల్లీ నుండి కుటుంబ సమేతంగా విదేశీ పర్యటనకు బయలుదేరనున్న రేవంత్ రెడ్డి

20వ తేదీన లండన్‌లో జరిగే ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే కూతురు వివాహానికి కుటుంబ సమేతంగా హాజరుకానున్న రేవంత్ రెడ్డి

24వ తేదీ వరకు కుటుంబ సభ్యులతో లండన్‌లోనే రేవంత్ రెడ్డి

24వ తేదీన కుటుంబ సభ్యులతో కలిసి లండన్ నుండి అమెరికాకు పయనం

30వ తేదీ వరకు అమెరికాలో కుటుంబ సభ్యులతో కలిసి రేవంత్ రెడ్డి బస

పాలిటెక్నిక్ కాలేజీల విలీనాన్ని వ్యతిరేకిస్తూ వడ్డేపల్లిలో ధర్నా

పాలిటెక్నిక్ కాలేజీల విలీనాన్ని వ్యతిరేకిస్తూ వడ్డేపల్లిలో ధర్నా

వడ్డేపల్లి: రాష్ట్రంలోని ఐటీఐలు, ఏటీసీలు, పాలిటెక్నిక్ కాలేజీలను యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ (YISU) పరిధిలోకి తీసుకురావాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వడ్డేపల్లి పాలిటెక్నిక్ కాలేజీలో ప్రిన్సిపాల్ సునీల్ కుమార్ ఆధ్వర్యంలో లెక్చరర్లు ధర్నా నిర్వహించారు. పాలిటెక్నిక్ కాలేజీలను యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో విలీనం చేయకుండా, ప్రస్తుతం కొనసాగుతున్న సాంకేతిక విద్యా శాఖ పరిధిలోనే కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ సునీల్ కుమార్ మాట్లాడుతూ పాలిటెక్నిక్ విద్య అనేది సాంకేతిక నైపుణ్యాలు, ప్రాక్టికల్ శిక్షణకు ఎంతో ప్రాధాన్యత కలిగిన విద్యా వ్యవస్థ అని తెలిపారు. పాలిటెక్నిక్ కాలేజీలను ఇతర వ్యవస్థలో విలీనం చేయడం వల్ల విద్యా వ్యవస్థలో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని, విద్యార్థులు మరియు అధ్యాపకుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కోరారు.పాలిటెక్నిక్ కాలేజీల ప్రత్యేకతను కాపాడుతూ వాటిని సాంకేతిక విద్యా శాఖ పరిధిలోనే కొనసాగించాలని లెక్చరర్లు ప్రభుత్వాన్ని కోరారు. పాలిటెక్నిక్ విద్యార్థులకు మెరుగైన విద్య, ప్రయోగాత్మక శిక్షణ, ఉపాధి అవకాశాలకు అవసరమైన నైపుణ్యాలు అందించేందుకు ప్రస్తుత వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని విజ్ఞప్తి చేశారు.పాలిటెక్నిక్ కాలేజీలను విలీనం చేసే నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకుని, విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ లెక్చరర్లు తమ నిరసన వ్యక్తం చేశారు.ధర్నాలో ప్రిన్సిపాల్ సునీల్ కుమార్‌తో పాటు వడ్డేపల్లి పాలిటెక్నిక్ కాలేజీకి చెందిన పలువురు లెక్చరర్లు, అధ్యాపకులు పాల్గొన్నారు.

ఘనంగా సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు

ఘనంగా సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు

రామగిరి మండలం సింగిరెడ్డిపల్లె గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేశారు. సర్వాయి పాపన్న గౌడ్ చేసిన సేవలు, సమాజ అభ్యున్నతికి ఆయన అందించిన కృషి గురించి విద్యార్థులకు వివరించారు. ఆయన ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకోవాలని గౌడ సంఘం సభ్యులు సూచించారు.

ఇందిరమ్మ కుట్టు మిషన్‌కు దరఖాస్తుల ఆహ్వానం

ఇందిరమ్మ కుట్టు మిషన్‌కు దరఖాస్తుల ఆహ్వానం

పెద్దపల్లి, ఆగస్టు 18: బీసీ నిరుద్యోగ మహిళలకు 100 శాతం సబ్సిడీతో రూ.12 వేల విలువైన ఆటోమేటిక్ కుట్టు మిషన్ అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ‘ఇంటింటికి ఇందిరమ్మ కుట్టు మిషన్’ పథకాన్ని అమలు చేస్తోందని జిల్లా బీసీ అభివృద్ధి అధికారి జె.రంగారెడ్డి తెలిపారు. 18–55 ఏళ్ల బీసీ మహిళలు, రేషన్ కార్డు కలిగి ఉండి గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలలోపు వార్షిక కుటుంబ ఆదాయం ఉన్న వారు అర్హులని పేర్కొన్నారు. అర్హులు సెప్టెంబర్ 15లోపు ఆన్‌లైన్‌లో https://tgobmms.cgg.gov.in/ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఒక్క కుటుంబానికి ఒక యూనిట్ మాత్రమే మంజూరు చేస్తామని తెలిపారు.

సుందిళ్ల  శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో హుండీ లెక్కింపు

సుందిళ్ల శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో హుండీ లెక్కింపు

=రూ.9.43 లక్షల హుండీ ఆదాయం

=భక్తుల ఆదరణతో పెరుగుతున్న ఆదాయం

మంథని, ఆగస్ట్ 18(తెలంగాణ నేత్రం టీవీ) .రామగిరి మండలం, సుందిళ్ల గ్రామం లోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో మంగళవారం స్వామివారి సన్నిధిలో హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు.ఈ హుండీ లెక్కింపులో మొత్తం రూ. 9,43,621/- ఆదాయం లభించింది. దేవస్థానానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తుల రాక పెరగడంతో హుండీ ఆదాయం కూడా పెరుగుతోందని దేవస్థాన అధికారులు, పాలకవర్గం తెలిపారు..ఈ లెక్కింపు కార్యక్రమంలో పెద్దపల్లి డివిజన్ దేవాదాయ శాఖ పరిశీలకులు ఆర్. ప్రవీణ్,ఈఓ రాజ్ కుమార్, దేవస్థాన చైర్మన్ కోర కొప్పుల సత్యనారాయణ గౌడ్, ధర్మకర్తల మండలి సభ్యులు రేకుంట్ల రవి, శ్రీనివాసరావు, సమ్మయ్య, జనగామ హేమలత, అర్చకులు రుద్రభట్ల జయంతి శర్మ తదితరులు పాల్గొన్నారు. అలాగే శ్రీ రాజరాజేశ్వర సేవాసమితి సభ్యులు కూడా లెక్కింపు కార్యక్రమంలో పాల్గొన్నారు.

పెద్దపల్లి జిల్లాలో మంత్రుల పర్యటన.

పెద్దపల్లి జిల్లాలో మంత్రుల పర్యటన.

ఆర్‌అండ్‌బీ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు.. పలు ప్రాంతాల్లో బహిరంగ సభలు. పెద్దపల్లి, ఆగస్టు 18: ఆర్‌అండ్‌బీ, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు బుధవారం పెద్దపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని, రామగుండం ప్రాంతాల్లో ఆర్‌అండ్‌బీ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయడంతో పాటు పలు బహిరంగ సభల్లో పాల్గొంటారు. పర్యటనలో భాగంగా ఉదయం 11:30 గంటలకు పెద్దపల్లి IDOCకు మంత్రులు చేరుకుంటారు. అనంతరం 11:45 నుంచి 12 గంటల వరకు గర్రెపల్లి వద్ద ఆర్‌అండ్‌బీ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం 12:10 నుంచి 1:45 గంటల వరకు సుల్తానాబాద్‌లో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు నిర్వహించి, అనంతరం జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2 నుంచి 2:30 గంటల వరకు శివపల్లిలో ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు నివాసంలో భోజనం చేస్తారు. మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు మంథని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఆర్‌అండ్‌బీ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి, అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు. సాయంత్రం 4:30 నుంచి 5:45 గంటల వరకు రామగుండంలో ఆర్‌అండ్‌బీ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు నిర్వహిస్తారు.

సుందిళ్ల లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న మనాలి ఠాకూర్

సుందిళ్ల లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న మనాలి ఠాకూర్

సుందిళ్ల శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ సతీమణి మనాలి ఠాకూర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, రామగుండం నియోజకవర్గం సుభిక్షంగా అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఆలయ అర్చకులు ఆమెకు స్వాగతం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు.

సభ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్

సభ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్

గోదావరిఖని: రామగుండంలో రేపు నిర్వహించనున్న భారీ సభకు సంబంధించిన ఏర్పాట్లను రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ పరిశీలించారు. సభా ప్రాంగణాన్ని సందర్శించిన ఆయన వేదిక నిర్మాణం, ప్రజలకు అవసరమైన సౌకర్యాలు, పార్కింగ్, భద్రత తదితర ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులతో, పార్టీ నాయకులతో మాట్లాడిన ఎమ్మెల్యే సభకు హాజరయ్యే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని సూచించారు. పెద్ద సంఖ్యలో ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరుకానున్నందున తాగునీరు, పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ, భద్రత తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. సభ విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సూచించారు.

మీనాక్షి నటరాజన్ నిర్వహించిన పీఏసీ మీటింగ్‌కు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి డుమ్మా

మీనాక్షి నటరాజన్ నిర్వహించిన పీఏసీ మీటింగ్‌కు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి డుమ్మా

యాదాద్రి భువనగిరి, నల్గొండ, సూర్యాపేట జిల్లాల ముఖ్య నేతలతో పీఏసీ మీటింగ్ నిర్వహించిన మీనాక్షి నటరాజన్ ఈ సమావేశానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాజరు కాకపోవడం గమనార్హం అయితే పార్టీలోకి కొత్తగా వచ్చిన వారికే నామినేటెడ్ పదవులు ఇస్తున్నారని, ఎమ్మెల్యేలు కూడా వారికే ప్రాధాన్యత ఇస్తున్నారని, పార్టీ గెలుపు కోసం కష్టపడిన కార్యకర్తలకు ప్రాధాన్యత ఇచ్చేలా చూడాలని మీనాక్షి నటరాజన్‌కు ఫిర్యాదు చేసిన పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు.

సంగారెడ్డిలో కాంగ్రెస్ నిరసన ర్యాలీ

సంగారెడ్డిలో కాంగ్రెస్ నిరసన ర్యాలీ

మల్లికార్జున ఖర్గే గారిని అవమానించేలా బీజేపీ నేతలు వ్యవహరించారని ఆరోపిస్తూ సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ, ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో TPCC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు పాల్గొని బీజేపీ వైఖరిని తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఐబీ నుంచి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం మహాత్మా జ్యోతిరావు ఫూలే, బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి:..మనాలి ఠాకూర్

ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి:..మనాలి ఠాకూర్

రామగుండం: ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు ఆయన సతీమణి శ్రీమతి మనాలి ఠాకూర్ మంగళవారం క్యాంపు కార్యాలయంలో ప్రజలను కలుసుకుని వారి సమస్యలను విన్నారు. సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి, సంబంధిత అధికారులతో సమన్వయం చేసి పరిష్కారానికి కృషి చేస్తామని ఆమె హామీ ఇచ్చారు. ప్రజా సంక్షేమమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు.

రామగుండం సింగరేణి ఆస్పత్రిలో విజయవంతంగా మోకాలు మార్పిడి శస్త్రచికిత్స

రామగుండం సింగరేణి ఆస్పత్రిలో విజయవంతంగా మోకాలు మార్పిడి శస్త్రచికిత్స

పెద్దపల్లి, ఆగస్టు 17: రామగుండంలోని సింగరేణి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో 70 ఏళ్ల మహిళకు మోకాలు మార్పిడి శస్త్రచికిత్సను వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. గత రెండేళ్లుగా తీవ్రమైన మోకాలి నొప్పి, నడకలో ఇబ్బందితో బాధపడుతున్న ఆమెకు పరీక్షల్లో తీవ్ర ఆర్థరైటిస్, మోకాలి వైకల్యం ఉన్నట్లు గుర్తించారు. ఆర్థోపెడిక్స్ విభాగాధిపతి ప్రొఫెసర్ డాక్టర్ ప్రదీప్ చంద్ర ఆధ్వర్యంలో ఆగస్టు 12న శస్త్రచికిత్స నిర్వహించారు. ప్రస్తుతం రోగి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండి, సంతృప్తికరంగా కోలుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. ಸರ್ಕారీ వైద్య సంస్థలో అధునాతన మోకాలు మార్పిడి శస్త్రచికిత్స విజయవంతం కావడం అభినందనీయమని పేర్కొన్నారు.

అర్హులైన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు…తొట్ల తిరుపతి యాదవ్

అర్హులైన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు…తొట్ల తిరుపతి యాదవ్

రామగిరి, ఆగస్టు 17: రామగిరి మండలం ఆదివారంపేట గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారు ఎలుక సునీత–రాజేందర్ కుటుంబానికి నిర్మించిన ఇంటిని మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తొట్ల తిరుపతి యాదవ్ ప్రారంభించారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు జరిగిన ఈ కార్యక్రమంలో లబ్ధిదారు కుటుంబాన్ని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా తిరుపతి యాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అర్హులైన ప్రతి కుటుంబానికి విడతల వారీగా ఇందిరమ్మ ఇళ్లు అందిస్తామని తెలిపారు. పేదల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో రామగిరి మండల పార్టీ అధ్యక్షులు రోడ్డ బాపన్న, గ్రామ సర్పంచ్ ఇల్లందుల సంజీవ్, మాజీ సర్పంచ్ వేపచెట్టు రాజేశం, గ్రామ శాఖ అధ్యక్షులు బుచ్చయ్య, మాజీ ఉపసర్పంచ్ అట్టే తిరుపతి రెడ్డి, మాజీ ఎంపీటీసీ నర్సింగరావు, ఉపసర్పంచ్ మేకల శ్రీశైలం, వార్డు సభ్యులు వినోద్, అరెలి సాయిలు, మెడగొని మల్లేష్, జక్కుల గణేష్, మండే కుమార్, మడిపెల్లి శ్రీనివాస్, సీహెచ్ శ్రీనివాస్ రెడ్డి, అజయ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి

జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి

-పాత్రికేయుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి
-మంత్రి పొంగులేటిని కలిసిన టీడబ్ల్యూజేఎఫ్ నేతలు

హైదరాబాద్, ఆగస్టు 17: జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కేటాయింపుపై రాష్ట్ర ప్రభుత్వం తన విధానాన్ని స్పష్టంగా ప్రకటించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) డిమాండ్ చేసింది. సుప్రీంకోర్టు తీర్పును సాకుగా చూపుతూ అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపులో జాప్యం చేయడం సరికాదని ఫెడరేషన్ నాయకులు పేర్కొన్నారు.
సోమవారం టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య, ప్రధాన కార్యదర్శి తన్నీరు శ్రీనివాస్ తదితరులు సచివాలయంలో రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలిసి జర్నలిస్టుల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని మంత్రికి సమర్పించారు.
కేబుల్, ఐపీ న్యూస్ ఛానళ్లకు అక్రెడిటేషన్ ఇవ్వాలి

రాష్ట్రంలోని అన్ని కేబుల్ టీవీ న్యూస్ ఛానళ్లకు వెంటనే అక్రెడిటేషన్ కార్డులు మంజూరు చేయాలని టీడబ్ల్యూజేఎఫ్ నేతలు కోరారు. అదేవిధంగా ఇంటర్నెట్ ప్రోటోకాల్ (ఐపీ) ఆధారిత న్యూస్ ఛానళ్లకు కూడా అక్రెడిటేషన్ సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
కేబుల్ ఛానళ్లకు జిల్లాస్థాయిలో నాలుగు, రాష్ట్రస్థాయిలో 12 అక్రెడిటేషన్ కార్డులు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరారు.

జర్నలిస్టులందరికీ హెల్త్ కార్డులు

అక్రెడిటేషన్ కార్డులు మంజూరవుతున్నప్పటికీ జర్నలిస్టులకు హెల్త్ కార్డుల విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఫెడరేషన్ నాయకులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వ ఉద్యోగులకు అందిస్తున్న తరహాలో అర్హులైన జర్నలిస్టులందరికీ హెల్త్ కార్డులు మంజూరు చేయాలని, ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఉచిత వైద్య చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు

సుప్రీంకోర్టు తీర్పుతో సంబంధం లేకుండా ప్రభుత్వం చట్టపరమైన మార్గాలను పరిశీలించి అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని టీడబ్ల్యూజేఎఫ్ నేతలు కోరారు. విధి నిర్వహణలో లేదా ఇతర కారణాలతో మరణించిన జర్నలిస్టుల కుటుంబాలను కూడా ఈ పథకంలో పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన జర్నలిస్టులను గుర్తించి వారికి ప్రత్యేకంగా సహాయం, సంక్షేమ చర్యలు అందించాలని కోరారు.
ప్రకటనల పెండింగ్‌ బిల్లులు చెల్లించాలి

చిన్న, మధ్యతరహా పత్రికలకు గత రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ప్రభుత్వ ప్రకటనల బిల్లులను వెంటనే చెల్లించాలని నాయకులు డిమాండ్ చేశారు. చిన్న, మధ్యతరహా పత్రికలను ప్రభుత్వ ప్రకటనల ఎంపానెల్‌మెంట్‌లో చేర్చి వాటి మనుగడకు సహకరించాలని కోరారు.
రిటైర్డ్ జర్నలిస్టులకు పెన్షన్

సీనియర్, రిటైర్డ్ జర్నలిస్టుల కోసం ప్రత్యేక పెన్షన్ పథకాన్ని ప్రవేశపెట్టి అమలు చేయాలని ఫెడరేషన్ కోరింది. జర్నలిస్టుల పిల్లలు ఎంతవరకు చదువుకున్నా ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో ఉచిత విద్య అందించేలా ప్రభుత్వం ప్రత్యేక జీవో జారీ చేయాలని విజ్ఞప్తి చేసింది.
అలాగే జర్నలిస్టులందరికీ ఉచిత జీవిత బీమా సౌకర్యం కల్పించాలని, జర్నలిస్ట్ మరణించిన సందర్భంలో వారి కుటుంబానికి రూ.10 లక్షల బీమా పరిహారం అందించే విధంగా పథకాన్ని అమలు చేయాలని కోరారు.
జర్నలిస్టుల సమస్యలను సానుకూలంగా పరిశీలించి, వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చినట్లు ఫెడరేషన్ నాయకులు తెలిపారు.
మంత్రి పొంగులేటిని కలిసిన వారిలో టీడబ్ల్యూజేఎఫ్ జాతీయ కౌన్సిల్ సభ్యుడు కుంచం శ్రీనివాస్, హైదరాబాద్ జిల్లా కన్వీనర్ వి.రవికుమార్, కో-కన్వీనర్లు ఆర్. శ్రీనివాస్ గౌడ్, ఎస్.రవికుమార్ తదితరులు ఉన్నారు.

గోదావరిఖని నుంచి 4 రాష్ట్రాలకు ఆధ్యాత్మిక యాత్ర

గోదావరిఖని నుంచి 4 రాష్ట్రాలకు ఆధ్యాత్మిక యాత్ర

గోదావరిఖని: శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని TGSRTC గోదావరిఖని డిపో ఆధ్వర్యంలో 9 రోజుల ప్రత్యేక ఆధ్యాత్మిక యాత్రను నిర్వహించనున్నారు. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 8 వరకు జరిగే ఈ యాత్రలో మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర రాష్ట్రాల్లోని 7 జ్యోతిర్లింగాలు, 2 శక్తిపీఠాలను భక్తులు దర్శించుకోనున్నారు. ఒక్కొక్కరికి రూ.11,500 ఛార్జీగా నిర్ణయించారు. సీట్ల రిజర్వేషన్ కోసం 7013504982, 7382847596 నంబర్లను సంప్రదించాలని డిపో మేనేజర్ కవిత తెలిపారు.

ఆగస్టు 17 నుంచి మండల స్థాయిలో ప్రజావాణి

ఆగస్టు 17 నుంచి మండల స్థాయిలో ప్రజావాణి

పెద్దపల్లి, ఆగస్టు 16: ప్రజల సౌకర్యార్థం ఆగస్టు 17 నుంచి ప్రతి సోమవారం మండల స్థాయిలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. మండల ప్రజలు తమ సమస్యలు, వినతులు, ఇతర దరఖాస్తులను మండల స్థాయిలోనే సంబంధిత అధికారులకు అందజేయాలని సూచించారు. జిల్లా కేంద్రానికి రావాల్సిన అవసరం లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. స్వీకరించిన దరఖాస్తులను పరిశీలించి నిబంధనల మేరకు సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

విధుల నిర్లక్ష్యంపై అంగన్వాడీ టీచర్ సస్పెన్షన్

విధుల నిర్లక్ష్యంపై అంగన్వాడీ టీచర్ సస్పెన్షన్

పెద్దపల్లి, ఆగస్టు 16: ఓదెల-II అంగన్వాడీ కేంద్రంలో విధుల నిర్వహణలో నిర్లక్ష్యం, కేంద్రం నిర్వహణలో లోపాలు, ప్రభుత్వ సేవల అమలులో నిర్లక్ష్యంపై అంగన్వాడీ టీచర్ జె. ప్రమీలను సస్పెండ్ చేసినట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. సూపర్వైజర్ నివేదిక ఆధారంగా ఈ చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. ముందస్తు సమాచారం లేకుండా కేంద్రాన్ని మూసివేయడం, పిల్లలు, గర్భిణీలు, బాలింతలకు అందించాల్సిన సేవల్లో నిర్లక్ష్యం వహించినట్లు ఆరోపణలు ఉన్నాయి. సస్పెన్షన్ కాలంలో అంగన్వాడీ సేవలకు అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ సిబ్బందికి బాధ్యతలు అప్పగించాలని కలెక్టర్ ఆదేశించారు.

తెలంగాణలో నిలిచిపోయిన రైతుబీమా పథకం

తెలంగాణలో నిలిచిపోయిన రైతుబీమా పథకం

ముగిసిన ప్రీమియం చెల్లింపు గడువు, ప్రీమియం చెల్లించని ప్రభుత్వంఅకాల మరణం చెందిన రైతు కుటుంబాలను ఆదుకునేందుకు రూ.5 లక్షల సహాయం చేసేందుకు,2018లో రైతు బీమా పథకం ప్రారంభించిన ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వంఎల్‌ఐసీతో కలిసి ఈ పథకం అమలు చేస్తూ వచ్చిన ప్రభుత్వంప్రతి ఏడాది ఆగస్టు 14వ తేదీన రూ.1,400 కోట్ల ప్రీమియం చెల్లించాల్సి ఉండగా, 2026–27 సంవత్సరానికి ప్రీమియం చెల్లించని కాంగ్రెస్ ప్రభుత్వం42.16 లక్షల మంది రైతులు లబ్ధిదారులుగా ఉన్న ఈ పథకం ఆగిపోవడంతో ఆందోళనలో రైతన్నలు..

ఓడేడు శివారులో జూద స్థావరంపై పోలీసుల దాడి

ఓడేడు శివారులో జూద స్థావరంపై పోలీసుల దాడి

ఓడేడు: వెంకటేశ్వరపల్లి శివారులో జూదం ఆడుతున్న స్థావరంపై ముత్తారం పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో రూ.3,030 నగదు, 52 ప్లేయింగ్ కార్డులు, 4 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. జూదానికి పాల్పడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ముత్తారం ఎస్‌ఐ రవికుమార్ తెలిపారు.

ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు చేసుకుంటేనే ఎరువులు: కేంద్రం

ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు చేసుకుంటేనే ఎరువులు: కేంద్రం

Aug 16, 2026,

ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు చేసుకుంటేనే ఎరువులు: కేంద్రం
రైతులకు ఎరువుల సరఫరాలో కేంద్రం కీలక మార్పు తీసుకొచ్చింది. ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు చేసుకున్న రైతులు మాత్రమే ఎరువుల కోసం బుకింగ్ చేసుకునేలా నిబంధనలు అమలు చేయనుంది. ఇందుకోసం ఫ్రేమ్‌వర్క్ ఫర్ ఫెర్టిలైజర్ సేల్ (FFS) యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. తెలంగాణలో ఇప్పటికే ఈ విధానం అమల్లో ఉండగా, రాబోయే రోజుల్లో ప్రభుత్వ పథకాల లబ్ధి పొందాలంటే ఈ రిజిస్ట్రేషన్ తప్పనిసరి అవుతుందని వ్యవసాయ అధికారులు స్పష్టం చేస్తున్నారు.

SBIలో డిగ్రీ అర్హతతో 10,662 ఉద్యోగాలు

SBIలో డిగ్రీ అర్హతతో 10,662 ఉద్యోగాలు

Aug 16, 2026,

SBIలో డిగ్రీ అర్హతతో 10,662 ఉద్యోగాలు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)లో 10,662 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో 9,124 జూనియర్ అసోసియేట్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఆగస్టు 31. మరో 1,538 ఉద్యోగాలకు ఆగస్టు 27లోపు దరఖాస్తు చేసుకోవాలి. డిగ్రీ ఉత్తీర్ణులై, 28 ఏళ్లలోపు వయసున్నవారు ఈ ఉద్యోగాలకు అర్హులు. పూర్తి వివరాలకు SBI వెబ్‌సైట్ https://sbi.bank.in/ ను సందర్శించవచ్చు.

పారుపల్లిలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

పారుపల్లిలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

పారుపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ చొప్పరి సంపత్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. పీఎం శ్రీ పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రిన్సిపాల్ ర్యాలీగా తరలివచ్చి వేడుకల్లో పాల్గొన్నారు.

కార్యక్రమంలో గ్రామ పాలకవర్గ సభ్యులు, పంచాయతీ కార్యదర్శి, యువత, యూత్ నాయకులు, సీనియర్ నాయకులు, గ్రామ సిబ్బంది, పెద్దలు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

సింగిరెడ్డిపల్లెలో బెల్ట్‌ షాపులకు సమయాల కేటాయింపు.. సర్పంచ్ భర్త తీరుపై చర్చ

సింగిరెడ్డిపల్లెలో బెల్ట్‌ షాపులకు సమయాల కేటాయింపు.. సర్పంచ్ భర్త తీరుపై చర్చ

రామగిరి మండలం సింగిరెడ్డిపల్లె గ్రామంలో బెల్ట్‌ షాపులకు సమయాలు కేటాయిస్తూ సర్పంచ్ భర్త వ్యవహరించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

బెల్ట్‌ షాపులకు సమయాలు కేటాయించే అధికారం సర్పంచ్ భర్తకు ఉందా? అనే ప్రశ్నలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులు స్పందించి స్పష్టత ఇవ్వాలని స్థానికులు కోరుతున్నారు.

సుందిల్లలో ఘనంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

సుందిల్లలో ఘనంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

సుందిల్ల గ్రామ బీఆర్‌ఎస్‌ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామ బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు బోగిరి భాస్కర్‌ జాతీయ జెండాను ఆవిష్కరించి, స్వాతంత్య్ర సమరయోధులకు నివాళులర్పించారు.

అనంతరం భారత ఎన్నికల సంఘం చేపట్టిన SIR కార్యక్రమంలో ఓటర్ల ఇన్యూమరేషన్‌ ప్రక్రియను పూర్తి చేసిన BLOలు గర్రెపెల్లి పద్మ, ఈదునూరి చంద్రకళ, గడ్డం వసంతలను గ్రామ శాఖ ఆధ్వర్యంలో సన్మానించి అభినందించారు. ఫైనల్‌ డ్రాఫ్ట్‌ వరకు ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయాలని కోరారు.

కార్యక్రమంలో గ్రామ పాలకవర్గ సభ్యులు, బీఆర్‌ఎస్‌ నాయకులు, యువజన, ఎస్సీ విభాగాల ప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

పలిమెల లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..

పలిమెల లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..

పలిమెల మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముందు ఆవరణలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దందేరా రాజేందర్ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున హాజరై అందరి సమక్షంలో జాతీయ జెండాను దందేరా రాజేందర్ ఎగురా వేశారు గౌరవ వందనం సమర్పించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ఎందరో స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల ఫలితమే నేటి స్వాతంత్ర్యమని పేర్కొన్నారు. వారి త్యాగ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ప్రజల అభ్యున్నతికి కృషి చేయాలని కాంగ్రెస్ నేతలకు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో పిన్నింటి మధుసూదన్ రావు, కుమ్మరి అంజయ్య, దాసరి సంతోష్, జవ్వాజి పుష్పలత

కాంగ్రెస్ సీనియర్ నాయకులు
గుండెబోయిన చిన్నన్నా , గుండెబోయిన వెంకట్ స్వామి , దందేర సురేష్, జవ్వాజి తిరుపతి, కుమ్మరి మల్లయ్య,లింగయ్య, బైత్ సమ్మయ్య, ధన్ రాజ్

యూత్ కాంగ్రెస్ నాయకులు
దాసరి రాజేష్ దందర రాకేష్,ఉమేష్ యాదవ్, సుధాకర్, బడిష సరయ్య, గుండ్లపెల్లి సాయి,చైదారి రాకేష్, తొర్రెమ్ శ్రీనివాస్, రామచంద్రo,చెడలా ఇస్తారి తదితరులు నాయకులు కార్య కర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

స్వాతంత్య్ర వేడుకల్లో దుద్దిళ్ల శ్రీను బాబు

స్వాతంత్య్ర వేడుకల్లో దుద్దిళ్ల శ్రీను బాబు

హైదరాబాద్: BHELలోని శ్రీ కార్యసిద్ధి పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఆలయ ట్రస్టీ రాజవరం శచీంద్ర, మేనేజర్ వాసు తదితరులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.

6వ డివిజన్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

6వ డివిజన్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

జనగామ: జనగామ గ్రామంలోని 6వ డివిజన్‌లో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన కార్పొరేటర్ తోకల (ఆవుల) శ్యామణి రమేష్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో డా. గంజి చక్రపాణి, గోలివాడ రాజబాబు తదితర నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. దేశ ఐక్యత, అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.

ప్రతి గ్రామం, వార్డులో తాగునీటి సమస్యలను గుర్తించి పరిష్కరించాలి

ప్రతి గ్రామం, వార్డులో తాగునీటి సమస్యలను గుర్తించి పరిష్కరించాలి

జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశంపెద్దపల్లి, ఆగస్టు 14: జిల్లాలో ప్రజలకు తాగునీటి సమస్యలు తలెత్తకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. శుక్రవారం సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో తాగునీటి సరఫరా, సమస్యలపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, క్షేత్రస్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ ప్రతి గ్రామం, ప్రతి వార్డులో తాగునీటికి సంబంధించిన సమస్యలను గుర్తించాలని సూచించారు. గ్రామాలు, వార్డుల వారీగా తాగునీటి సరఫరా పరిస్థితి, ఎదురవుతున్న సమస్యలు, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలపై సమగ్ర నివేదిక సిద్ధం చేసి అందించాలని ఆదేశించారు.

సెప్టెంబర్ మొదటివారంలో పనులు మొదలు కావాల్సిందే…

సెప్టెంబర్ మొదటివారంలో పనులు మొదలు కావాల్సిందే…

*ఆగస్టు చివరి నాటికి టెండర్ ప్రక్రియ పూర్తి చేయాల్సిందే**నాణ్యతలో రాజీ పడొద్దు… ఏర్పాట్లలో శాఖల మధ్య సమన్వయం తప్పనిసరి**గోదావరి పుష్కరాలు – 2027′ కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో అధికారులకు మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాలు**గోదావరి పుష్కరాలు-2027’ నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందని, ఎట్టి పరిస్థితుల్లోనూ సెప్టెంబర్ మొదటి వారంలో పనులను ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదేశించారు*ఆ మేరకు టెండర్ ప్రక్రియను ఆగస్టు చివరి నాటికి పూర్తి చేయాలని స్పష్టం చేశారు. డా.బీ.ఆర్. అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో ఆయన అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన ‘గోదావరి పుష్కరాలు – 2027’ కేబినేట్ సబ్ కమిటీ సమావేశంలో మంత్రులు కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా…కమిటీ సభ్యులు శాఖలవారీగా సన్నద్ధత, ఏర్పాట్ల పురోగతిని ప్రత్యేకంగా సమీక్షించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం కేబినేట్ సబ్ కమిటీ ఛైర్మన్ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ… గోదావరి పుష్కరాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.వేయి కోట్లు కేటాయించిందన్నారు. భక్తుల రద్దీ అధికంగా ఉండే టైర్-1 ప్రాంతాలకు ప్రత్యేకంగా స్పెషల్ ఆఫీసర్లను నియమించాలని ఆదేశించారు. అలాగే ముఖ్యమైన ప్రాంతాల్లో… ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ సెంటర్లను ఏర్పాటు చేయాలని సూచించారు. నిర్దేశిత గడువులోగా పనులు పూర్తయ్యేలా సంబంధిత శాఖ ఉన్నతాధికారులు తీసుకోవాలని స్పష్టం చేశారు. అలా అని… నాణ్యతలో రాజీ పడొద్దని, పనుల పురోగతిని పర్యవేక్షించేందుకు సంబంధిత అధికారులు నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటించాలని స్పష్టం చేశారు. వర్క్ ప్రోగ్రెస్ ను రోజువారీగా తెలుసుకునేలా ప్రత్యేక డ్యాష్‌బోర్డును అందుబాటులోకి తేవాలని దేవాదాయ శాఖ అధికారులకు సూచించారు. అన్ని శాఖలు సమష్ఠిగా పని చేస్తేనే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పుష్కరాలు విజయవంతం అవుతాయన్నారు. శాఖల మధ్య సమన్వయం లోపం తలెత్తకుండా సంబంధిత ఉన్నతాధికారులు ప్రత్యేకంగా చొరవ తీసుకోవాలన్నారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు రవాణా పరంగా ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రతి రోడ్డును అనుసంధానించాలన్నారు. ఎక్కడైనా రోడ్ల కనెక్టివిటీ మిస్ అయితే వెంటనే గుర్తించి, లోకల్ ఫండ్స్ నుంచి పనులు చేపట్టాలన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర జిల్లా ఉన్నతాధికారులు, పండితులను పుష్కర ఏర్పాట్లలో తప్పనిసరిగా భాగస్వామ్యం చేయాలన్నారు. భక్తులకు సేవలు అందించేందుకు ముందుకొచ్చే స్వచ్ఛంద, ప్రైవేట్ సంస్థలను ముందుగానే గుర్తించాలని మంత్రి శ్రీధర్ బాబు సూచించారు. కేబినేట్ సబ్ కమిటీ సభ్యుల సలహాలు, సూచనలను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకుని… అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు. పుష్కర ఏర్పాట్లలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

జేబులో పేలిన SAMSUNG మొబైల్

జేబులో పేలిన SAMSUNG మొబైల్

యూపీలోని గ్రేటర్ నోయిడాలో మజీద్ అనే యువకుడికి ఊహించని పరిమాణం ఎదురైంది. జర్నీలో ఉండగా సామ్సంగ్ మొబైల్ జేబులోనే పేలింది. దీంతో జరీలో అతడికి తీవ్రగాయాలు కాగా ఆసుపత్రిలో చేరాడు. ప్రస్తుతం కోలుకుంటున్నాడు. నెల రోజుల క్రితమే ఫోన్ కొన్నట్లు బాధితుడు తెలిపాడు. ఫోన్ వేడెక్కి ఒక్కసారిగా బ్లాస్ట్ అయిందన్నాడు. కాగా బ్రాండెడ్ మొబైల్స్ కూడా బ్లాస్ట్ అవుతుండటంతో సేఫ్టీపై ఆందోళన వ్యక్తమవుతోంది..

పుట్ట మధుకు ఘన స్వాగతం పలికిన బీఆర్‌ఎస్ నాయకులు

పుట్ట మధుకు ఘన స్వాగతం పలికిన బీఆర్‌ఎస్ నాయకులు

మంథని: అమెరికా పర్యటన ముగించుకొని మంథనికి చేరుకున్న పుట్ట మధు దంపతులకు బీఆర్‌ఎస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. చందనాపూర్, సింగిరెడ్డిపల్లి, సుందిళ్ల, ముస్త్యాల, పేదంపేట గ్రామాలకు చెందిన నాయకులు పుట్ట మధును కలిసి అభినందనలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో యండి. ఇబ్రహీం, బోగిరి భాస్కర్, సత్తన్న, రాజు, కామ శ్రీను, కోనేటి సతీష్, నరేష్ తదితర బీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణపై నాయకులు చర్చించారు.

ఈ-కేవైసీ పూర్తి చేయలేదా.. మీ మొబైల్ ద్వారా క్షణాల్లోనే చేయొచ్చు

ఈ-కేవైసీ పూర్తి చేయలేదా.. మీ మొబైల్ ద్వారా క్షణాల్లోనే చేయొచ్చు

Aug 13, 2026,

ఈ-కేవైసీ పూర్తి చేయలేదా.. మీ మొబైల్ ద్వారా క్షణాల్లోనే చేయొచ్చు
దేశవ్యాప్తంగా రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఈకేవైసీ పూర్తి చేయాలని ప్రభుత్వం సూచించింది. ఈ ప్రక్రియను మొబైల్ ఫోనులో ఆధార్ ఫేస్ ఆర్డీ, మేరా ఈకేవైసీ యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకుని సులభంగా పూర్తి చేసుకోవచ్చు. మేరా ఈకేవైసీ యాప్‌లో రాష్ట్రం ఎంపిక చేసుకుని ప్రోసీడ్‌పై క్లిక్ చేయండి. ఆధార్ నంబర్ నమోదు చేసి, ఓటీపీ ద్వారా ధృవీకరణ పొందాలి. అనంతరం క్యాప్చా నమోదు చేస్తే, సభ్యుల వివరాలు కనిపిస్తాయి. అనంతరం ఫేస్ ఈకేవైసీ బటన్‌పై క్లిక్ చేయాలి. కెమెరాలో ముఖాన్ని చూపించడం ద్వారా ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేసినట్లు స్క్రీన్‌పై మెస్సేజ్ కనిపిస్తుంది.

స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు

స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు

Aug 13, 2026,

స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు
హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో గురువారం బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.270 పెరిగి రూ.1,55,130కి చేరగా, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.250 పెరిగి రూ.1,42,200కు చేరుకుంది. అయితే, వెండి ధర మాత్రం స్థిరంగా ఉంది. కేజీ వెండి ధర రూ.2,55,000గా కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని నగరాలను బట్టి ఈ ధరల్లో స్వల్ప తేడాలు ఉండవచ్చు.

నేడు క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల టవర్ల నిర్మాణానికి భూమిపూజ

నేడు క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల టవర్ల నిర్మాణానికి భూమిపూజ

Aug 13, 2026,

నేడు క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల టవర్ల నిర్మాణానికి భూమిపూజ
తెలంగాణ : క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల టవర్ల నిర్మాణానికి సీఎం రేవంత్​రెడ్డి గురువారం భూమి పూజ చేయనున్నారు. కేపీహెచ్‌బీ కాలనీలో నిర్వహించే కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు. క్యూర్​ పరిధిలో 16 నియోజకవర్గాల్లో రూ.807.40 కోట్లతో ఇందిరమ్మ టవర్ల నిర్మాణం చేపట్టనున్నారు. ఈ ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులకు ఈ నెల 15 వరకు గడువు ఉంది.

తెలంగాణలో 36,353 పోలింగ్‌ కేంద్రాలు ఖరారు.. ECI ఆమోదం

తెలంగాణలో 36,353 పోలింగ్‌ కేంద్రాలు ఖరారు.. ECI ఆమోదం

Aug 13, 2026,

తెలంగాణలో 36,353 పోలింగ్‌ కేంద్రాలు ఖరారు.. ECI ఆమోదం
తెలంగాణలో పోలింగ్‌ కేంద్రాల హేతుబద్ధీకరణ ప్రక్రియకు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 36,353 పోలింగ్‌ కేంద్రాలను అధికారికంగా ఖరారు చేశారు. ఓటర్ల సంఖ్యను సమతుల్యం చేయడం, పోలింగ్‌ కేంద్రాల వద్ద రద్దీని తగ్గించడం, ప్రజలకు సమీపంలోనే ఓటు వేసే అవకాశం కల్పించడం లక్ష్యంగా ఈ పునర్వ్యవస్థీకరణ చేపట్టారు. ఈ ప్రక్రియలో కొత్తగా 368 పోలింగ్‌ కేంద్రాలు పెరిగాయి. హైదరాబాద్‌ జిల్లాలో అత్యధికంగా 4,094 కేంద్రాలు, ములుగు జిల్లాలో అత్యల్పంగా 308 కేంద్రాలు ఏర్పాటు చేశారు. కొత్త కేంద్రాలకు అనుగుణంగా BLOల సర్దుబాటు, ఓటర్ల జాబితా నవీకరణను అధికారులు వేగవంతం చేస్తున్నారు.

రేషన్ కోసం ఏటీఎం.. ఎలా పనిచేస్తుందంటే?

రేషన్ కోసం ఏటీఎం.. ఎలా పనిచేస్తుందంటే?

Aug 13, 2026,

రేషన్ కోసం ఏటీఎం.. ఎలా పనిచేస్తుందంటే?
ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం దేశంలోనే తొలి ధాన్యం ఏటీఎంను వైశాలీ నగర్‌లో బుధవారం ప్రారంభించింది. ఎమ్మెల్యే రికేష్ సేన్ ఈ ఆటోమేటెడ్ ఏటీఎంను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హులైన లబ్ధిదారులు రేషన్ కార్డ్ లేదా ఆధార్ నంబర్, బయోమెట్రిక్ ద్వారా ధాన్యం పొందవచ్చని చెప్పారు. ఇది 24/7 అందుబాటులో ఉండి, రేషన్ పంపిణీలో పారదర్శకతను పెంచుతుందని, డీలర్లు, మధ్యవర్తుల దోపిడీని తగ్గిస్తుందని వెల్లడించారు

లేహ్‌లో భారీ భూకంపం

లేహ్‌లో భారీ భూకంపం

Aug 13, 2026,

లేహ్‌లో భారీ భూకంపం
జమ్మూకశ్మీర్‌లోని లేహ్(లద్దాక్)లో గురువారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 5.5 మ్యాగ్నిట్యూడ్‌గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఆఫ్ సిస్మాలజీ వెల్లడించింది. ఈ భూకంపం వల్ల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ భూకంపం వల్ల ప్రాణ, ఆస్తి నష్టం సంభవించినట్లు ఇప్పటివరకు ఎలాంటి సమాచారం అందలేదు.

బాలికను కాపాడిన యువకులకు ఏసీపీ సన్మానం

బాలికను కాపాడిన యువకులకు ఏసీపీ సన్మానం

మంథని: బొక్కలవాగులో నీటిలో మునిగిపోతున్న బాలిక అలేఖ్యను ధైర్యసాహసాలతో రక్షించిన బోయినిపేటకు చెందిన అంకం శేఖర్‌, ఆకుల అరవింద్‌లను గోదావరిఖని ఏసీపీ ఎం.రమేష్‌ అభినందించి సన్మానించారు.

బాలికను రక్షించిన అనంతరం ఆమె తండ్రి పర్శవేన రాజును కూడా వాగులో నుంచి బయటకు తీసేందుకు యువకులు ప్రయత్నించారు. అయితే అప్పటికే రాజు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆపద సమయంలో సమయస్ఫూర్తితో స్పందించి బాలిక ప్రాణాలు కాపాడిన యువకుల ధైర్యసాహసాలు అభినందనీయమని ఏసీపీ పేర్కొన్నారు. మంథని సీఐ బుద్ధె స్వామి, ఎస్‌ఐ సాగర్‌ తదితరులు పాల్గొన్నారు.

కేసీఆర్ బావమరిది మృతి

కేసీఆర్ బావమరిది మృతి

గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జోగినపల్లి శ్రీనివాస్ రావు హైదరాబాద్ లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.

ఆయన కుమారుడు అమెరికాలో ఉన్నారు. ఆయన వచ్చాక అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు తెలిసింది.

కేటీఆర్ కు స్వయాన మేన మామ.. శ్రీనివాస్ రావు మరణం నేపథ్యంలో కేటీఆర్ ఈ రోజు హైదరాబాద్ లో ముందుగా ఏర్పాటు చేసుకున్న కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు.

మరోవైపు మాజీ మంత్రి హరీష్ రావు కూడా తన కార్యక్రమాలను వాయిదా వేసుకుని యశోద ఆసుపత్రి వెళ్తున్నారు.

లంచం తీసుకుంటూ గిరిధావర్‌ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టివేత

లంచం తీసుకుంటూ గిరిధావర్‌ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టివేత

జగిత్యాల ఏసీబీ డీఎస్పీ గట్ల మహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో గురువారం బీర్పూర్ మండల తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడి నిర్వహించారు. ఓ బాధితురాలి నుంచి రూ.30 వేల లంచం తీసుకుంటున్న గిరిధావర్ రాహుల్‌ను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఘటనపై ఏసీబీ అధికారులు తదుపరి చర్యలు చేపట్టారు.

అమెరికా పర్యటన ముగించుకుని మంథనికి పుట్ట మధూకర్

అమెరికా పర్యటన ముగించుకుని మంథనికి పుట్ట మధూకర్

అమెరికా పర్యటన ముగించుకుని మంథని నియోజకవర్గానికి చేరుకున్న మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌కు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. కమాన్‌పూర్ X రోడ్ నుంచి మంథని వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. రాజగృహలో పుట్ట మధూకర్-శైలజ దంపతులను శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. అభిమానుల సందడితో మంథనిలో పండుగ వాతావరణం నెలకొంది.

కోడి పందేల స్థావరంపై టాస్క్‌ఫోర్స్ దాడి

కోడి పందేల స్థావరంపై టాస్క్‌ఫోర్స్ దాడి

16 మంది అరెస్ట్.. రూ.24,040 నగదు, 18 ద్విచక్ర వాహనాలు స్వాధీనంమంచిర్యాల: వేమనపల్లి మండలం కల్లెంపల్లి గ్రామ శివారులో కోడి పందేల పేరుతో బెట్టింగ్ నిర్వహిస్తున్న స్థావరంపై రామగుండం టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్ ఏసీపీ శ్రీనివాస్ నేతృత్వంలో ఎస్సై రమేష్, నీల్వాయి ఎస్సై నాగరాజు సిబ్బందితో కలిసి బుధవారం అర్ధరాత్రి దాడి నిర్వహించారు.ఈ సందర్భంగా కోడి పందేలు నిర్వహిస్తున్న 16 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 4 కోళ్లు, 45 కత్తులు, 18 ద్విచక్ర వాహనాలు, 12 మొబైల్ ఫోన్లు, రూ.24,040 నగదు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారితో పాటు స్వాధీనం చేసుకున్న వస్తువులు, వాహనాలను తదుపరి చట్టపరమైన చర్యల కోసం నీల్వాయి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా హెచ్చరించారు. కోడి పందేలు, జూదం, బెట్టింగ్ వంటి కార్యకలాపాలకు ఎవరూ పాల్పడవద్దని సూచించారు. ఇలాంటి కార్యకలాపాలకు స్థావరాలు ఏర్పాటు చేయడం, నిర్వహించడం లేదా సహకరించడం వంటివి చేస్తే చట్టప్రకారం చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

సురక్షక తిరంగా’ సైబర్ అవేర్నెస్

సురక్షక తిరంగా’ సైబర్ అవేర్నెస్

గోదావరిఖని, ఆగస్టు 13(తెలంగాణ నేత్రం)రామగుండం ఏరియా-1లోని జీడీకే 2&2ఏ ఇంక్లైన్, జీడీకే 2 సెక్షన్‌లో గురువారం ‘సురక్షక తిరంగా’ సైబర్ అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించారు. జీఎం ఆర్జీ-1 డి. లలిత్ కుమార్ ఆదేశాల మేరకు, సైబర్ క్రైమ్ ఎస్‌ఐ మారుతి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సైబర్ మోసాలపై ఉద్యోగులకు అవగాహన కల్పించారు.సైబర్ మోసానికి గురైన వెంటనే 1930కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని, బ్యాంకు వివరాలు, ఓ టీ పి,పాన్ , ఆధార్ వంటి వ్యక్తిగత సమాచారాన్ని ఇతరులతో పంచుకోవద్దని సూచించారు. అనుమానాస్పద లింకులు, ఏ పి కె ఫైల్స్, తెలియని యాప్‌లను ఓపెన్ చేయవద్దని, పోలీసుల పేరుతో వచ్చే బెదిరింపు కాల్స్‌కు భయపడవద్దని తెలిపారు. పెట్టుబడి మోసాలపైనా అవగాహన కల్పించారు.కార్యక్రమంలో గని మేనేజర్ ఇజ్జగిరి శివయ్య, వెల్ఫేర్ ఆఫీసర్ డి. గణేష్, సెక్షన్ ఇంచార్జ్ సల్మాన్ ఖాన్, వెంటిలేషన్ ఆఫీసర్ జి. కుమారస్వామి, అధికారులు, సూపర్వైజర్లు, మహిళా ఉద్యోగులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

అకడమిక్ ప్యానల్ తనిఖీలకే పరిమితం కాకూడదు: కలెక్టర్ కోయ శ్రీహర్ష

అకడమిక్ ప్యానల్ తనిఖీలకే పరిమితం కాకూడదు: కలెక్టర్ కోయ శ్రీహర్ష

హైదరాబాద్, ఆగస్టు 13(తెలంగాణ నేత్రం)అకడమిక్ ప్యానల్ పాఠశాల సందర్శనలు కేవలం తనిఖీలకే పరిమితం కాకుండా ఉపాధ్యాయులకు అకడమిక్ సహకారం అందించేలా ఉండాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించిన రాష్ట్రస్థాయి విద్యాశాఖ అధికారుల శిక్షణలో పెద్దపల్లి జిల్లాలో అమలు చేస్తున్న అకడమిక్ ప్యానల్ విధానంపై ప్రజెంటేషన్ ఇచ్చారు. తరగతి గది పరిశీలన, విద్యార్థుల స్పాట్ అసెస్‌మెంట్, నిర్మాణాత్మక ఫీడ్‌బ్యాక్, డేటా ఆధారిత ప్రణాళిక, నిరంతర ఫాలోఅప్ ద్వారా విద్యార్థుల అభ్యసన ఫలితాలను మెరుగుపరచాలని సూచించారు.

మహనీయుల విగ్రహాలు చైతన్య కేంద్రాలు

మహనీయుల విగ్రహాలు చైతన్య కేంద్రాలు

ముస్త్యాల, ఆగస్టు 12: రామగిరి మండలం ముస్త్యాల గ్రామంలో డా. బీఆర్‌ అంబేద్కర్, కొమురం భీమ్, పూలే దంపతులు, బిర్సా ముండా, భగత్‌సింగ్, చాకలి ఐలమ్మ తదితర మహనీయుల విగ్రహాల ఏర్పాటుకు బుధవారం స్థల పరిశీలన చేపట్టారు. మాజీ సర్పంచ్ రామగిరి లావణ్య–నాగరాజు దంపతుల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. మహనీయుల విగ్రహాలు సమాజ ఆత్మగౌరవానికి, చైతన్యానికి ప్రతీకలుగా నిలుస్తాయని నాయకులు పేర్కొన్నారు. విగ్రహాల ఏర్పాటుకు ప్రభుత్వం, అధికారులు సహకరించాలని కోరారు.

ఖనిలో పోలీసుల విధులకు ఆటంకం ఇద్దరిపై కేసు

గోదావరిఖని B-గెస్ట్ హౌస్ వద్ద సర్వీస్ రోడ్డుపై ద్విచక్ర వాహనాన్ని అడ్డంగా నిలిపిన ఇద్దరు వ్యక్తులు పోలీసులతో దురుసుగా ప్రవర్తించిన ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఉన్న చొప్పరి అజయ్, బొమ్మగాని ఆంజనేయులు ట్రాఫిక్ సీఐ గన్‌మెన్ రవి చొక్కా పట్టుకుని దురుసుగా ప్రవర్తించినట్లు పోలీసులు తెలిపారు. సీఐ బ్రీత్ అనలైజర్‌తో పరీక్షించేందుకు ప్రయత్నించగా ఆయనతోనూ దురుసుగా ప్రవర్తించినట్లు పేర్కొన్నారు. గన్‌మెన్ రవి ఫిర్యాదు మేరకు గోదావరిఖని 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

జర్నలిస్టుల సమస్యలపై కేంద్రం స్పందన

జర్నలిస్టుల సమస్యలపై కేంద్రం స్పందన

హైదరాబాద్, ఆగస్టు 12: జంతర్ మంతర్‌లో టీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన జర్నలిస్టుల ధర్నాపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. టీడబ్ల్యూజేఎఫ్ సమర్పించిన వినతిపై కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు లేఖ రాసింది. జర్నలిస్టుల సంక్షేమం, ఉద్యోగ భద్రత, చట్టపరమైన రక్షణ, సామాజిక భద్రత, కార్మిక హక్కుల అంశాలను పరిశీలించి త్వరగా చర్యలు తీసుకోవాలని కోరింది. రైల్వే రాయితీ అంశంపై కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కు లేఖ రాశారు. కేంద్రం సానుకూలంగా స్పందించి జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య కోరారు.

కాంగ్రెస్ బలోపేతానికి సమష్టి కృషి

కాంగ్రెస్ బలోపేతానికి సమష్టి కృషి

గోదావరిఖని: కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ పిలుపునిచ్చారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ నాయకులతో సమావేశమై పార్టీ బలోపేతం, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై చర్చించారు. కార్యకర్తలకు అండగా ఉంటామని ఎమ్మెల్యే తెలిపారు. సమావేశంలో జిల్లా నాయకులు, కార్పొరేటర్లు, ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.

పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలి

పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలి

రామగుండం: పెండింగ్ కేసులను సత్వరమే పరిష్కరించి, నాణ్యమైన దర్యాప్తుతో నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా పోలీసు అధికారులను ఆదేశించారు. కమిషనరేట్ కార్యాలయంలో నిర్వహించిన నేర సమీక్ష సమావేశంలో సీసీటీఎన్‌ఎస్‌ 2.0 ద్వారా కేసుల దర్యాప్తు పురోగతి, నిందితుల అరెస్టులు, నేర నియంత్రణ చర్యలను సమీక్షించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గంజాయి, అక్రమ ఇసుక రవాణా, పేకాట, పీడీఎస్‌ బియ్యం అక్రమ తరలింపుపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

కేటీఆర్‌ అసత్యాలతో ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నారు: శ్రీధర్‌బాబు

కేటీఆర్‌ అసత్యాలతో ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నారు: శ్రీధర్‌బాబు

హైదరాబాద్‌ గాంధీభవన్‌లో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మీడియాతో మాట్లాడుతూ.. భూ కేటాయింపులు నిబంధనల ప్రకారమే జరిగాయని స్పష్టం చేశారు. HILT పాలసీతో హైదరాబాద్‌కు మేలు జరుగుతుందని, పారిశ్రామికవేత్తలను భయపెట్టడం సరికాదన్నారు. తెలంగాణ నీటి వాటాల విషయంలో రాజీపడబోమని, GRMB సమావేశంలో రాష్ట్ర ప్రయోజనాల కోసం బలంగా వాదిస్తామని తెలిపారు.

హనుమాన్ రెడ్డిని పరామర్శించిన ఎమ్మెల్యే దంపతులు

హనుమాన్ రెడ్డిని పరామర్శించిన ఎమ్మెల్యే దంపతులు

అంతర్గాం: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు హనుమాన్ రెడ్డి అనారోగ్యంతో ఉన్న విషయం తెలుసుకున్న రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ దంపతులు బుధవారం గోలివాడలోని ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు.ఈ సందర్భంగా హనుమాన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ దంపతులు అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు.

డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం.కలెక్టర్

డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం.కలెక్టర్

పెద్దపల్లి, ఆగస్టు 12: డ్రగ్స్‌కు దూరంగా ఉంటూ క్రీడలు, వ్యాయామాలను జీవితంలో భాగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష యువతకు పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 27న నిర్వహించనున్న 4వ కరీంనగర్ హాఫ్ మారథాన్ పోస్టర్‌ను పెద్దపల్లి ఐడీఓసీలో ఆయన ఆవిష్కరించారు. డ్రగ్స్ వ్యతిరేక అవగాహనతో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించేందుకు మారథాన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యువత, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో డీఎంఓ ప్రవీణ్ రెడ్డి, కేఆర్‌సీఏ అధ్యక్షులు పసుల మహేష్, మహిపాల్ రెడ్డి, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

తమిళనాడు అసెంబ్లీలో NEET, FCRAకు వ్యతిరేకంగా తీర్మానాలు

తమిళనాడు అసెంబ్లీలో NEET, FCRAకు వ్యతిరేకంగా తీర్మానాలు

తమిళనాడు అసెంబ్లీలో NEET, FCRAకు వ్యతిరేకంగా తీర్మానాలు

చెన్నై: NEET విధానాన్ని రద్దు చేయాలని, 12వ తరగతి మార్కుల ఆధారంగా వైద్య ప్రవేశాలు కల్పించాలని కోరుతూ తమిళనాడు అసెంబ్లీ తీర్మానం చేయనుంది. గ్రామీణ, పేద విద్యార్థులకు NEET ప్రతికూలంగా ఉందని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. అలాగే FCRA సవరణ బిల్లు-2026ను వ్యతిరేకిస్తూ మరో తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. 

ఈ నెల 14న తెలంగాణ కేబినెట్ సమావేశం.

ఈ నెల 14న తెలంగాణ కేబినెట్ సమావేశం.

ఈ నెల 14న తెలంగాణ కేబినెట్ సమావేశం..

ఈ నెల 14న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఉదయం 10.30 గంటలకు రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించనున్నారు. ఈ మంత్రివర్గ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, పాలనాపరమైన కీలక నిర్ణయాలపై కేబినెట్ భేటీలో చర్చించనున్నట్లు తెలుస్తోంది.

గోరింటాకు మహోత్సవంలో మనాలి ఠాకూర్ సందడి

గోరింటాకు మహోత్సవంలో మనాలి ఠాకూర్ సందడి

గోదావరిఖని: రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ, మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో గోరింటాకు మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాకూర్ మహిళలతో కలిసి గోరింటాకు వేడుకల్లో పాల్గొని సందడి చేశారు. మహిళలతో ఆత్మీయంగా ముచ్చటిస్తూ వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.అనంతరం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ముందస్తు జన్మదిన వేడుకలను మహిళా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నిర్వహించి కేక్ కట్ చేశారు. పాటలు, నృత్యాలతో మహిళలు ఉత్సాహంగా వేడుకలు జరుపుకున్నారు.

మత్స్యకారులకు తెలంగాణ ప్రభుత్వం భరోసా

మత్స్యకారులకు తెలంగాణ ప్రభుత్వం భరోసా

హైదరాబాద్: రాష్ట్రంలోని 4,21,767 మంది నమోదిత మత్స్యకారులకు 2026–27 ఆర్థిక సంవత్సరానికి గ్రూప్ ప్రమాద బీమా పథకం అమలు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని మంత్రి వాకిటి శ్రీహరి వెల్లడించారు.ప్రమాదవశాత్తు మరణం లేదా శాశ్వత సంపూర్ణ వైకల్యానికి రూ.5 లక్షలు, పాక్షిక వైకల్యానికి రూ.2.50 లక్షలు, ప్రమాద సమయంలో ఆసుపత్రి చికిత్సకు గరిష్ఠంగా రూ.25 వేల వరకు బీమా రక్షణ లభించనుంది. 18 నుంచి 70 ఏళ్ల మధ్య నమోదిత మత్స్యకారులు ఈ పథకానికి అర్హులు. మత్స్యకారుల సామాజిక భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తెలిపారు.

దుర్గా నగర్‌లో ఘనంగా గోరింటాకు మహోత్సవం

దుర్గా నగర్‌లో ఘనంగా గోరింటాకు మహోత్సవం

గోదావరిఖని: దుర్గా నగర్ కాలనీలో మహిళల ఆధ్వర్యంలో ఆషాఢ మాస గోరింటాకు మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్ ఠాకూర్ సతీమణి మనాలి రాజ్ ఠాకూర్ జ్యోతి ప్రజ్వలన చేసి, మహిళలకు స్వయంగా గోరింటాకు పెట్టారు. సంప్రదాయాలను కాపాడుతూ మహిళలు ఐకమత్యంతో వేడుకలు నిర్వహించడం అభినందనీయమని ఆమె అన్నారు. కార్యక్రమంలో మహిళలు, స్థానిక నాయకులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు.

కురుమ కులస్తుల బోనాల వేడుకల్లో మనాలి ఠాకూర్

కురుమ కులస్తుల బోనాల వేడుకల్లో మనాలి ఠాకూర్

రామగుండం: కురుమ కులస్తుల ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల వేడుకల్లో రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ సతీమణి మనాలి ఠాకూర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు.కురుమ సోదర సోదరీమణులతో కలిసి సంప్రదాయబద్ధంగా నిర్వహించిన బోనాల వేడుకల్లో పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో జరుపుకోవడం సంతోషంగా ఉందని మనాలి ఠాకూర్ పేర్కొన్నారు.

ఘనంగా సాగర్, రమేష్ గౌడ్ జన్మదిన వేడుకలు

ఘనంగా సాగర్, రమేష్ గౌడ్ జన్మదిన వేడుకలు

కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో ఇప్పలపల్లి మాజీ ఉపసర్పంచ్, కాంగ్రెస్ పార్టీ నాయకుడు వడ్లూరి సాగర్, గంగారం గ్రామానికి చెందిన వీరగోని రమేష్ గౌడ్ జన్మదిన వేడుకలు అభిమానులు, మిత్రుల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేయడంతో పాటు టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్నారు.కార్యక్రమంలో మాజీ సర్పంచ్ జెక్కే రవీందర్ గౌడ్, వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ దాగేటి రామచంద్రం, బిల్డర్ల సంఘం నాయకుడు కాసర్ల శ్రీనివాస్, జర్నలిస్టులు, అభిమానులు, మిత్రులు తదితరులు పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

కుమారస్వామి కుటుంబానికి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అండ

కుమారస్వామి కుటుంబానికి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అండ

రామగుండం: కాంగ్రెస్ సీనియర్ నాయకులు గుమ్మడి కుమారస్వామి అనారోగ్యంతో హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ స్పందించారు. కుమారస్వామికి మెరుగైన వైద్యం అందేలా సంబంధిత వైద్యులతో స్వయంగా మాట్లాడి అవసరమైన సహాయం అందేలా చర్యలు తీసుకున్నారు. మనాలి ఠాకూర్ కూడా కుమారస్వామితో మాట్లాడి ధైర్యం చెప్పారు. త్వరగా కోలుకోవాలని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కుటుంబ సభ్యులు ఆకాంక్షించారు. కుమారస్వామి కుటుంబానికి తమ కుటుంబం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు.

రామగుండం ఎమ్మెల్యే తనయుడి ఘనత..

రామగుండం ఎమ్మెల్యే తనయుడి ఘనత..

తైక్వాండోలో నితీష్ ఠాకూర్‌కు గిన్నిస్ వరల్డ్ రికార్డు

రామగుండం ఎమ్మెల్యే తనయుడి ఘనత.. హైదరాబాద్ తైక్వాండో బృందంతో ప్రపంచ రికార్డులో భాగస్వామ్యం

హైదరాబాద్, ఆగస్టు 9: తైక్వాండో క్రీడా రంగంలో రామగుండం ఎమ్మెల్యే తనయుడు నితీష్ ఠాకూర్ అరుదైన ఘనత సాధించారు. హైదరాబాద్ గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఆదివారం నిర్వహించిన ప్రతిష్టాత్మక Guinness World Record కార్యక్రమంలో పాల్గొని ప్రపంచ రికార్డు సాధించిన తైక్వాండో బృందంలో నితీష్ భాగస్వామిగా నిలిచారు.

J.R. International Taekwondo Academy – India ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా పలువురు తైక్వాండో క్రీడాకారులు పాల్గొన్నారు. హైదరాబాద్‌కు చెందిన INDIA TAEKWONDO TIGERS బృందం ప్రత్యేకంగా పాల్గొని రికార్డు సృష్టించడంలో భాగమైంది.

చిన్న వయసులోనే ప్రపంచ స్థాయి క్రీడా వేదికపై నితీష్ ఠాకూర్ తన ప్రతిభను చాటుకోవడం పట్ల రామగుండం ప్రాంత క్రీడాభిమానులు, తైక్వాండో శిక్షకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. నితీష్ సాధించిన ఈ ఘనత యువతకు స్ఫూర్తిగా నిలుస్తుందని వారు అభినందించారు.

పెద్ది కుటుంబానికి కేసీఆర్ రూ.2.25 కోట్ల ఆర్థికసాయం

పెద్ది కుటుంబానికి కేసీఆర్ రూ.2.25 కోట్ల ఆర్థికసాయం

నల్లబెల్లి: దివంగత నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని మాజీ సీఎం కేసీఆర్ పరామర్శించారు. పెద్ది నివాసంలో ఆయన చిత్రపటానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఇద్దరు పిల్లల భవిష్యత్తు కోసం రూ.2 కోట్ల చెక్‌తో పాటు, ఆయన తల్లి బాగోగుల కోసం రూ.25 లక్షల చెక్‌ను కేసీఆర్ అందించారు. కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.

పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ దాడి

పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ దాడి

10 మంది అరెస్ట్.. రూ.83,010 నగదు స్వాధీనం మంచిర్యాల జోన్ నెన్నెల పోలీస్‌స్టేషన్ పరిధిలోని మన్నెగూడెం గ్రామ శివారులో పేకాట స్థావరంపై రామగుండం టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.83,010 నగదు, 52 పేకముక్కలు, 8 సెల్‌ఫోన్లు, హీరో గ్లామర్ ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.టాస్క్‌ఫోర్స్ ఏసీపీ శ్రీనివాస్ నేతృత్వంలో ఎస్‌ఐలు రమేష్, లచ్చన్న ఆధ్వర్యంలో ఈ దాడి జరిగింది. పేకాట నిర్వహించిన ఆర్గనైజర్ రాళ్లపేట శ్రీకాంత్‌తో పాటు శ్రీను, రాజ్‌కుమార్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వారి కోసం గాలింపు కొనసాగుతోంది. అదుపులోకి తీసుకున్న వారిని తదుపరి చర్యల కోసం నెన్నెల పోలీస్‌స్టేషన్‌కు అప్పగించారు.

ప్రమాదం తప్పించారు.. పోలీసుల మానవత్వం

ప్రమాదం తప్పించారు.. పోలీసుల మానవత్వం

మంచిర్యాల పరిధిలోని ఏసీసీ క్వారీ మార్గంలోని రాళ్లవాగు వంతెన వద్ద భారీ వర్షాలకు రహదారి దెబ్బతిని కుంగిపోయింది. సమాచారం అందుకున్న ట్రాఫిక్ సీఐ హన్నన్ సిబ్బందితో కలిసి ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ప్రమాదాలు జరగకుండా తాత్కాలిక మరమ్మతులు చేపట్టడంతో పాటు క్వారీ వైపు వెళ్లే మార్గాన్ని మూసివేయించారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించాలని, వర్షాకాలంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.

నిరుపేద కుటుంబానికి అండగా చిన్ననాటి స్నేహితులు

నిరుపేద కుటుంబానికి అండగా చిన్ననాటి స్నేహితులు

కాల్వ శ్రీరాంపూర్ ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా కష్టాల్లో ఉన్న కుటుంబానికి భరోసాగా నిలుస్తున్న కాల్వ శ్రీరాంపూర్ జడ్పిహెచ్ఎస్ పూర్వ విద్యార్థులు మండలంలోని శ్రీరాంపూర్ గ్రామానికి చెందిన పిల్లలమర్రి సదానందం ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు తోటి స్నేహితులంతా కుటుంబ సభ్యులకు సంతాపం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులకు ఆర్థిక భరోసాగా నిలిచారు 1998 -99 సంవత్సరంలో పదవ తరగతి పూర్తి చేసుకున్న పూర్వ విద్యార్థులు తలో కొంత పోగు చేసి 13 వేల రూపాయలను బ్యాంకులో సదానందం సునీత దంపతుల కూతురు మృదుల పేరు మీద ఫిక్స్ డిపాజిట్ చేసి బాండ్ పేపర్ ను శనివారం వారి స్వగృహంలో అందించారు అసలే నిరుపేద కుటుంబం కూలిపోయిన ఇల్లు గుంట భూమిలేని పేదవారిని ఆదుకునేందుకు స్నేహితులంతా ఒకటై మేమున్నాము అంటూ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు ఇలాగే వారి స్నేహం కలకాలం ఉండాలని ఆపదలో ఉన్న కుటుంబాలకు మనోధైర్యం అందిస్తూ ఉండాలని వివిధ గ్రామాల ప్రజలు అన్నారు పరామర్శించిన వారిలో ఎండి రహీం, బంగారి నవీన్, ముస్కు అశోక్, కటకం శ్రీనివాస్, రాగుల వనమా చారి, మారుపాక ప్రవీణ్, మ్యాదరి సంపత్ తదితరులు ఉన్నారు

రామగుండం అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ప్రతిపాదనలు

రామగుండం అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ప్రతిపాదనలు

హైదరాబాద్, ఆగస్టు (తెలంగాణ నేత్రం)
ఉమ్మడి కరీంనగర్ జిల్లా అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో శనివారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో కొనసాగుతున్న, చేపట్టాల్సిన వివిధ అభివృద్ధి పనులపై ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ పాల్గొన్నారు.సమావేశంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌తో పాటు ప్రభుత్వ విప్‌లు ఆది శ్రీనివాస్, చింతకుంట విజయరమణ రావు పాల్గొన్నారు.జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల పురోగతి, కొత్తగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, రహదారులు, తాగునీరు, డ్రైనేజీ తదితర మౌలిక వసతులపై సమగ్రంగా చర్చించారు. రామగుండం నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న పనులు, ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు, భవిష్యత్‌లో చేపట్టాల్సిన ప్రాధాన్యతా పనులను ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సమావేశంలో వివరించారు. నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం నుంచి అవసరమైన సహకారం అందించాలని కోరారు.ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులను వేగవంతం చేసి ఉమ్మడి కరీంనగర్ జిల్లాను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రులు పేర్కొన్నారు.సమావేశంలో రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామితో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

సింగరేణి మారుపేర్ల బాధితుల నిరసన దీక్ష 2 వ రోజు

సింగరేణి మారుపేర్ల బాధితుల నిరసన దీక్ష 2 వ రోజు

సింగరేణి మారుపేర్లు మరియు విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆర్జీ–1 జీఎం కార్యాలయం ఎదుట జరుగుతున్న నిరసన దీక్ష రెండో రోజుకు చేరుకుంది. బాధితులందరూ ఏకమై శాంతియుతంగా కూర్చొని తమ గోడును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు సింగరేణి యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లేందుకు నిరసన తెలుపుతున్నారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు పోరాటం కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు.రెండో రోజు దీక్షలో అంజయ్య, అనిల్, అంబటి రాజశేఖర్, ఉస్మాన్, షేక్ బాబర్, ఓం ప్రకాష్, తిరుమల శ్రీనివాస్, రంజిత్, హాకుల రవి, సమ్మయ్య, కొలిపాక అన్వేష్, ముద్దుకూరి రవికుమార్, దొడ్ల కుమార్, రామిళ్ల సందీప్, లక్క శ్రావణ్ గౌడ్, దన్నడ రాజు, డిష్ బాబు, దీపిక, కొమురమ్మ తదితరులు తమ తల్లిదండ్రులతో కలిసి పాల్గొన్నారు. బాధిత కుటుంబాలంతా ఐక్యంగా నిలబడి రెండో రోజు నిరసన దీక్షను విజయవంతంగా కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.

_మేము జనసేనతో కూడా పొత్తు పెట్టుకోము..

_మేము జనసేనతో కూడా పొత్తు పెట్టుకోము..

తెలంగాణలో వచ్చే ఏ ఎన్నికల్లోనూ జనసేనతో కానీ వేరే పార్టీలతో కానీ పొత్తు ఉండదు

– టీబీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు

తెలంగాణలో భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ

తెలంగాణలో భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ

Aug 08, 2026,

తెలంగాణలో భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ
తెలంగాణ : బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, రుతుపవన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం అర్ధరాత్రి నుంచి హైదరాబాద్, భువనగిరి, కామారెడ్డి, సూర్యాపేట జిల్లాల్లో వానలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో కుమురం భీమ్, మెదక్, ములుగు, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్ధిపేట, వికారాబాద్, మహబూబ్‌నగర్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఈ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

ప్రైవేటు స్కూళ్లు లెక్కలివ్వవు.. విద్యాశాఖ షోకాజ్ నోటీసులు

ప్రైవేటు స్కూళ్లు లెక్కలివ్వవు.. విద్యాశాఖ షోకాజ్ నోటీసులు

Aug 08, 2026,ప్రైవేటు స్కూళ్లు లెక్కలివ్వవు.. విద్యాశాఖ షోకాజ్ నోటీసులు
తెలంగాణ : రాష్ట్రంలోని 13,245 ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్ల యాజమాన్యాలు ప్రభుత్వానికి ఆడిట్ రిపోర్టులు సమర్పించకుండా తప్పించుకుంటున్నాయి. ఫీజుల దందాను దాచిపెట్టేందుకే ఈ రిపోర్టులు ఇవ్వడానికి వెనుకంజ వేస్తున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. కేవలం 16 స్కూళ్లు మాత్రమే లెక్కలు సమర్పించడంతో, విద్యాశాఖ సీరియస్ అయింది. లెక్కలు ఇవ్వని 13,229 స్కూళ్లకు తక్షణమే షోకాజ్ నోటీసులు ఇవ్వాలని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఆదేశాలు జారీ చేశారు. ఫీజుల వివరాలను వెబ్‌సైట్‌లో తప్పనిసరిగా అప్‌లోడ్ చేయాలని కూడా సూచించారు.