ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన నేత వైఎస్ఆర్.ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్

గోదావరిఖని(తెలంగాణ నేత్రం)దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని రామగుండం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో NSUI నాయకుడు మెంటం ఉదయ్ రాజ్ ఆధ్వర్యంలో నివాళి కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ వైఎస్ఆర్ పాలనలో పేదలు, రైతులు, విద్యార్థుల సంక్షేమానికి పెద్దపీట వేశారని అన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు కార్పొరేట్ వైద్యం, ఫీజు రీయింబర్స్‌మెంట్ ద్వారా ఉన్నత విద్యకు అవకాశం కల్పించారని, జలయజ్ఞం ద్వారా సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇచ్చారని కొనియాడారు. వైఎస్ఆర్ పాలనను ప్రతిపక్షాలు సైతం మెచ్చుకున్నాయని, ఆయన సంక్షేమ పథకాలు నేటికీ ప్రజల మనసుల్లో నిలిచిపోయాయని పేర్కొన్నారు.రామగుండం పట్టణంలో వైఎస్ఆర్ విగ్రహం ఏర్పాటుకు ఖాళీ స్థలం కేటాయించాలని మేయర్ మహంకాళి స్వామిని ఎమ్మెల్యే కోరారు.కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య, కార్పొరేషన్ అధ్యక్షుడు బొంతల రాజేష్, కార్పొరేటర్లు, NSUI, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Leave a Reply