రామగుండం,(తెలంగాణ నేత్రం)మంజూరైన ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణానికి తక్షణమే స్థలం కేటాయించి పనులు ప్రారంభించాలని బీజేపీ రాష్ట్ర నాయకురాలు సోమారపు లావణ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఆసుపత్రి మంజూరై ఏళ్లు గడుస్తున్నా స్థల కేటాయింపు జరగకపోవడం వల్ల కార్మికులు, వారి కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నారని ఆమె అన్నారు. వారం రోజుల్లోగా ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే బీజేపీ ఆధ్వర్యంలో ప్రత్యక్ష కార్యాచరణ చేపడతామని హెచ్చరించారు. అనంతరం రామగుండం తహసీల్దార్‌కు కూడా వినతిపత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాశీపేట శివాజీ, జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి మామిడి రాజేష్, మాజీ జిల్లా ఉపాధ్యక్షురాలు మాతంగి రేణుక, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు వడ్డేపల్లి భారతి, మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి సుల్వ పద్మ, మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు సుజా శ్రీ, ఎన్టీపీసీ మండల అధ్యక్షుడు మిట్టపల్లి సతీష్, తిలక్ నగర్ మండల అధ్యక్షుడు ఐత పవన్, సీనియర్ నాయకులు కొండపర్తి సంజీవ్, కొమ్మ శ్రీనివాస్ యాదవ్, అరిగేల శ్రావణ్ యాదవ్, పశం రాజు యాదవ్, బరిగల సంతోష్, మేడి రాజు, మంథని మహేష్, కచ్చకాయల శ్రావణ్ తదితర కార్యకర్తలు, స్థానిక ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈఎస్ఐ ఆసుపత్రికి స్థలం కేటాయించాలి.సోమారపు లావణ్య
◷ September 5, 2026 | telangananetramtv


Leave a Reply