సుల్తానాబాద్‌లో రూ.219.67 కోట్ల రహదారి పనులు

సుల్తానాబాద్‌, ఆగస్టు 19: సుల్తానాబాద్‌ మండలం గరేపల్లిలో రూ.219.67 కోట్ల విలువైన హెచ్‌ఏఎం, నాన్‌ప్లాన్‌ రహదారి అభివృద్ధి పనులకు ఆర్‌అండ్‌బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. రహదారుల అభివృద్ధితో పరిశ్రమలు, వ్యాపారాలు విస్తరించి యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అన్నారు. పనులను రెండేళ్లలో పూర్తి చేస్తామని తెలిపారు. పెద్దపల్లి బైపాస్‌ను ఏడాదిలోపు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని, సుల్తానాబాద్‌ బైపాస్‌ మంజూరుకు కృషి చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ప్రభుత్వ విప్‌ విజయరమణారావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *