జాతీయ మెగా లోక్ అదాలత్‌లో 5,261 కేసుల పరిష్కారం

SHARE THIS

గోదావరిఖని,(తెలంగాణ నేత్రం)
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన జాతీయ మెగా లోక్ అదాలత్‌లో మొత్తం 5,261 కేసులు పరిష్కరించినట్లు పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. పెద్దపల్లి, మంచిర్యాల జోన్ల పరిధిలో 613 ఐపీసీ కేసులు, 36 ప్రత్యేక చట్టాల కేసులు, 2,872 ఈ-చలాన్ కేసులు, 1,740 డ్రంక్‌ అండ్‌ డ్రైవ్ కేసులు పరిష్కరించినట్లు పేర్కొన్నారు.

అలాగే 125 సైబర్ నేర కేసుల్లో బాధితులకు రూ.33,65,739 తిరిగి అందజేశారు. కమిషనరేట్ పరిధిలోని 123 కేసుల్లో రూ.27,58,843, సీసీపీఎస్ పోలీస్ స్టేషన్ రామగుండంలో నమోదైన రెండు కేసుల్లో రూ.6,06,896 బాధితులకు తిరిగి అందించారు. లోక్ అదాలత్ ద్వారా స్వల్ప నేరాలు, ట్రాఫిక్ తదితర కేసులు వేగంగా పరిష్కారమై ప్రజలకు సమయం, ధనం ఆదా అయ్యాయని సీపీ తెలిపారు. కేసుల పరిష్కారానికి కృషి చేసిన పోలీస్ అధికారులు, సిబ్బందిని అభినందిస్తూ త్వరలో పురస్కారాలు అందజేస్తామని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *