మంచిర్యాల : (తెలంగాణ నేత్రం)
కోడి పందేల స్థావరంపై టాస్క్‌ఫోర్స్, కన్నెపల్లి పోలీసులు సంయుక్తంగా దాడి చేసి ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. కన్నెపల్లి మండలం చింతపూడి లింగాల గ్రామ శివారులో కోడి పందేలు నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో టాస్క్‌ఫోర్స్ ఏసీపీ శ్రీనివాస్‌రావు నేతృత్వంలో పోలీసులు దాడి చేశారు.
ఈ సందర్భంగా రెండు కోళ్లు, రూ.2,100 నగదును స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన ఆరుగురిని స్వాధీనం చేసుకున్న సామగ్రితో సహా తదుపరి చట్టపరమైన చర్యల కోసం కన్నెపల్లి పోలీసులకు అప్పగించారు. కోడి పందేలు, జూదం, బెట్టింగ్ వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.


Leave a Reply