6గురు మృతి
20 మందికి తీవ్ర గాయాలు
దొరకుంట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
బస్సు-కంటైనర్ – “ఢీ”, రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మహిళలు సహా ఆరుగురు మృతి
ఏలూరు వెళ్తున్న బస్సుకు ఘోర ప్రమాదం..దొరకుంట శివారులో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఆగి ఉన్న కంటైనర్ లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు.
ప్రమాద సమయంలో బస్సులో 42 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే కోదాడ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది…


Leave a Reply