పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ దాడి

10 మంది అరెస్ట్.. రూ.83,010 నగదు స్వాధీనం మంచిర్యాల జోన్ నెన్నెల పోలీస్‌స్టేషన్ పరిధిలోని మన్నెగూడెం గ్రామ శివారులో పేకాట స్థావరంపై రామగుండం టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.83,010 నగదు, 52 పేకముక్కలు, 8 సెల్‌ఫోన్లు, హీరో గ్లామర్ ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.టాస్క్‌ఫోర్స్ ఏసీపీ శ్రీనివాస్ నేతృత్వంలో ఎస్‌ఐలు రమేష్, లచ్చన్న ఆధ్వర్యంలో ఈ దాడి జరిగింది. పేకాట నిర్వహించిన ఆర్గనైజర్ రాళ్లపేట శ్రీకాంత్‌తో పాటు శ్రీను, రాజ్‌కుమార్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వారి కోసం గాలింపు కొనసాగుతోంది. అదుపులోకి తీసుకున్న వారిని తదుపరి చర్యల కోసం నెన్నెల పోలీస్‌స్టేషన్‌కు అప్పగించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *