1000 రోజులుగా ఫామ్‌హౌస్‌కే పరిమితమైన కేసీఆర్‌..ప్రజల మధ్యకు రావాలి: రాజ్‌ఠాకూర్‌

SHARE THIS

హైదరాబాద్‌: (తెలంగాణ నేత్రం)
మాజీ సీఎం, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ 1000 రోజులుగా ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారని రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్‌ఠాకూర్‌ విమర్శించారు. సోమవారం గాంధీభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన బీఆర్‌ఎస్‌ తీరుపై మండిపడ్డారు.

రైతులు, ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్న సమయంలో కేసీఆర్‌ ఎప్పుడైనా వారి మధ్యకు వచ్చారా అని ప్రశ్నించారు. ప్రతిపక్ష హోదా అంటే జీతం, పదవి, ప్రభుత్వ సదుపాయాలు పొందడం మాత్రమే కాదని, ప్రజల సమస్యలపై పోరాడాల్సిన బాధ్యత కూడా ఉంటుందని అన్నారు.

కేసీఆర్‌కు ప్రభుత్వం కల్పిస్తున్న జీతాలు, సిబ్బంది, వాహనాలు తదితర సదుపాయాలను ప్రజలు గమనిస్తున్నారని రాజ్‌ఠాకూర్‌ పేర్కొన్నారు. ఇప్పటివరకు జీతాల రూపంలో సుమారు ₹1.24 కోట్లు తీసుకున్నారని, ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌, హైదరాబాద్‌లోని నందినగర్‌ నివాసం తదితర ప్రాంతాల్లో 57 మందికి పైగా సిబ్బంది పనిచేస్తున్నారని తెలిపారు. నాలుగు బుల్లెట్‌ప్రూఫ్‌ కార్లు, ఫాలోయింగ్‌ వాహనాలు, అంబులెన్స్‌, పికప్‌ వాహనాల వంటి సదుపాయాల కోసం గత 32 నెలల్లో సుమారు ₹21 కోట్ల ప్రజాధనం ఖర్చవుతున్నట్లు ఆరోపించారు. ఈ లెక్కలపై అధికారిక ఆధారాలను సంబంధిత శాఖల నుంచి ధృవీకరించాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *