రామగిరి,(తెలంగాణ నేత్రం)దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 17వ వర్ధంతిని పురస్కరించుకుని రామగిరి మండలం బేగంపేట ఎక్స్‌రోడ్‌లోని మంథని బ్లాక్ కాంగ్రెస్ కార్యాలయంలో బుధవారం ఘనంగా నివాళులర్పించారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రొడ్డ బాపన్న పటేల్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తొట్ల తిరుపతి యాదవ్ వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆరోగ్యశ్రీ, 108 వంటి సంక్షేమ పథకాలతో వైఎస్సార్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. సిరిసిల్ల ప్రాంతంలో వైఎస్సార్ చేపట్టిన పాదయాత్రలో తాను, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పాల్గొనడం తన అదృష్టమన్నారు. వైఎస్సార్ ఆశయాలను కొనసాగిస్తూ మంత్రి శ్రీధర్‌బాబు నాయకత్వాన్ని మరింత బలోపేతం చేయాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
వైఎస్సార్‌కు ఘన నివాళి
◷ September 2, 2026 | telangananetramtv


Leave a Reply