ఇద్దరు సీఐలపై బదిలీ వేటు?
నర్సంపేట నియోజకవర్గంలో పని చేస్తున్న ఇద్దరు సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌లపై వేటు పడినట్లు తెలుస్తోంది. నర్సంపేట రూరల్ సాయి రమణ, నెక్కొండ సీఐ శ్రీనివాస్‌లను వీ.ఆర్‌కి అటాచ్ చేస్తూ వరంగల్ సీపీ ఉత్తర్వులు వెలువడినట్లు సమాచారం.
జే. శంకర్ రావును నర్సంపేట రూరల్ సీఐగా, కే.ఫణిందర్‌ను నెక్కొండ సర్కిల్ సీఐగా బాధ్యతలు అప్పజెప్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. పెద్ది విగ్రహం కూల్చి వేసిన ఘటన నర్సంపేట డివిజన్‌లో ఉద్రిక్తతలను కలిగిస్తున్న తరుణంలో సీఐల మార్పు చర్చనీయాంశంగా మారింది.


Leave a Reply