అర్హులైన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు…తొట్ల తిరుపతి యాదవ్

రామగిరి, ఆగస్టు 17: రామగిరి మండలం ఆదివారంపేట గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారు ఎలుక సునీత–రాజేందర్ కుటుంబానికి నిర్మించిన ఇంటిని మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తొట్ల తిరుపతి యాదవ్ ప్రారంభించారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు జరిగిన ఈ కార్యక్రమంలో లబ్ధిదారు కుటుంబాన్ని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా తిరుపతి యాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అర్హులైన ప్రతి కుటుంబానికి విడతల వారీగా ఇందిరమ్మ ఇళ్లు అందిస్తామని తెలిపారు. పేదల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో రామగిరి మండల పార్టీ అధ్యక్షులు రోడ్డ బాపన్న, గ్రామ సర్పంచ్ ఇల్లందుల సంజీవ్, మాజీ సర్పంచ్ వేపచెట్టు రాజేశం, గ్రామ శాఖ అధ్యక్షులు బుచ్చయ్య, మాజీ ఉపసర్పంచ్ అట్టే తిరుపతి రెడ్డి, మాజీ ఎంపీటీసీ నర్సింగరావు, ఉపసర్పంచ్ మేకల శ్రీశైలం, వార్డు సభ్యులు వినోద్, అరెలి సాయిలు, మెడగొని మల్లేష్, జక్కుల గణేష్, మండే కుమార్, మడిపెల్లి శ్రీనివాస్, సీహెచ్ శ్రీనివాస్ రెడ్డి, అజయ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *