
గోదావరిఖని: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడుస్తున్నా ఆరు గ్యారంటీలు, 13 డిక్లరేషన్లు, ఇతర హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయడంలో విఫలమైందని బీజేపీ రాష్ట్ర నాయకురాలు సోమారపు లావణ్య ఆరోపించారు. సోమవారం శివాజీనగర్‌లోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ఇకపై హామీలు అమలు చేసే వరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీజేపీ ప్రతిరోజూ ప్రశ్నిస్తుందని అన్నారు. రామగుండంలో అభివృద్ధి కంటే కూల్చివేతలతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని విమర్శించారు. సమావేశంలో బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసిపేట శివాజీతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.


Leave a Reply