
గోదావరిఖని: దుర్గా నగర్ కాలనీలో మహిళల ఆధ్వర్యంలో ఆషాఢ మాస గోరింటాకు మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్ ఠాకూర్ సతీమణి మనాలి రాజ్ ఠాకూర్ జ్యోతి ప్రజ్వలన చేసి, మహిళలకు స్వయంగా గోరింటాకు పెట్టారు. సంప్రదాయాలను కాపాడుతూ మహిళలు ఐకమత్యంతో వేడుకలు నిర్వహించడం అభినందనీయమని ఆమె అన్నారు. కార్యక్రమంలో మహిళలు, స్థానిక నాయకులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు.


Leave a Reply