మంథని , ఆగస్టు 20: పెద్దపల్లి డీసీపీ బుక్యా రామ్‌రెడ్డి సతీసమేతంగా బుధవారం సుందిళ్ల శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అర్చన నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.గ్రామ సర్పంచ్ ముస్కుల నరేందర్ రెడ్డి, దేవస్థాన చైర్మన్ కొరకొప్పుల సత్యనారాయణ గౌడ్ సమక్షంలో ఆలయ అర్చకులు రుద్ర భట్ల జయంత్ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం డీసీపీ దంపతులకు తీర్థప్రసాదాలు అందజేశారు. స్వామివారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని వారు ఆకాంక్షించారు.
సుందిళ్ల లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్న పెద్దపల్లి డీసీపీ
◷ August 20, 2026 | telangananetramtv


Leave a Reply