

గోదావరిఖని,(తెలంగాణ నేత్రం)రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో అర్ధరాత్రి వేళ అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు ‘ఆపరేషన్ చబుత్రా’ నిర్వహించారు. గోదావరిఖని 1 టౌన్, ఎన్టీపీసీ, రామగుండం పరిధిలో విస్తృతంగా నైట్ పెట్రోలింగ్, తనిఖీలు చేపట్టారు. గుంపులుగా తిరుగుతున్న యువకులు, మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిని తనిఖీ చేసి 30 మంది యువకులను, వారి ద్విచక్ర వాహనాలను అదుపులోకి తీసుకున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించి ఈ-పెట్టీ కేసులు నమోదు చేసి కౌన్సెలింగ్ ఇచ్చారు. గంజాయి అనుమానిత ప్రాంతాలు, బెల్ట్ షాపులపై తనిఖీలు నిర్వహించి రెండు బెల్ట్ షాపులపై కేసులు నమోదు చేశారు. రాత్రి 10 గంటల తర్వాత అనవసరంగా గుంపులుగా తిరిగితే వాహనాలు సీజ్ చేస్తామని పోలీసులు హెచ్చరించారు.


Leave a Reply