పెద్దపల్లి, ఆగస్టు 31(తెలంగాణ నేత్రం)
రైతులు వరి సాగుకే పరిమితం కాకుండా ఆయిల్‌పామ్, పండ్ల తోటలు, కూరగాయలు, పూల వంటి ఉద్యాన పంటలను సాగు చేసి అధిక ఆదాయం పొందాలని జిల్లా ఉద్యానశాఖ అధికారి గడ్డం శ్యామ్ ప్రసాద్ సూచించారు. ప్రభుత్వం వివిధ పథకాల కింద ఉద్యాన పంటలకు భారీగా సబ్సిడీలు అందిస్తోందన్నారు. పండ్ల తోటలకు రూ.36 వేల వరకు, కూరగాయల పందిళ్లకు ఎకరాకు రూ.లక్ష వరకు, డ్రిప్‌కు 70–90 శాతం వరకు రాయితీ ఉందని తెలిపారు. ఆయిల్‌పామ్ సాగుకు నాలుగేళ్లలో రూ.49 వేల వరకు సహాయం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. రైతులు తమ భూమి, నీటి వనరులు, మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా పంటలను ఎంచుకుని ప్రభుత్వ రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఉద్యాన పంటలతో అధిక ఆదాయం పొందాలి
◷ August 31, 2026 | telangananetramtv


Leave a Reply