నాకూ ఆత్మగౌరవం ఉంటుంది..
రాఖీ పండుగ పూట కవిత ఎమోషనల్ కామెంట్స్
ఆడబిడ్డ మనసు గాయపడింది’.. : రక్షా బంధన్ (రాఖీ పండుగ) వేళ తెలంగాణ రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. తన సోదరుడు, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తీరుపై టీఆర్ఎస్ పార్టీ అధినేత్రి, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు.
పండుగ రోజున కేటీఆర్ అందుబాటులో లేకపోవడంపై ఆమె తీవ్ర తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పండుగ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కవిత, సోదరుడి వ్యవహార శైలిపై మనస్తాపం చెందారు. “గత ఏడాది రాఖీ పండుగ సమయంలో ఆయన నగరంలో లేకుండా వెళ్లిపోయారు. కానీ ఈసారి ఏకంగా దేశంలోనే లేకుండా పారిపోయారు” అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పండుగ రోజున అన్నకు రాఖీ కట్టలేకపోవడంపై తన ఆవేదనను వెళ్లగక్కారు.
నాకూ ఆత్మగౌరవం ఉంటుంది..
కుటుంబంలోనూ, రాజకీయాల్లోనూ జరుగుతున్న పరిణామాలపై స్పందిస్తూ.. “ఒక ఆడబిడ్డగా నాక్కూడా ఆత్మగౌరవం ఉంటుంది. ఆయన ప్రవర్తించిన తీరుతో నేను కూడా చాలా హర్ట్ అయ్యాను” అని పేర్కొన్నారు. రాఖీ పండుగ అనేది పవిత్రమైన రక్తసంబంధానికి సంకేతమని, దానిని రాజకీయాలతో ముడిపెట్టకూడదని హితవు పలికారు. “రాఖీ అంటే రక్తసంబంధం.. రాజకీయం కాదు” అని ఆమె స్పష్టం చేశారు. కాగా, రాఖీ పండుగ పూట కవిత చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి.


Leave a Reply