గోదావరిఖని అశోక్‌నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో NTPC రామగుండం CSR సౌజన్యంతో విద్యార్థులకు 500 సైకిళ్లను పంపిణీ చేశారు. కార్యక్రమానికి రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు సైకిళ్లు అందజేశారు. విద్యార్థులు సైకిళ్లను సద్వినియోగం చేసుకుని విద్యలో రాణించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. కార్యక్రమంలో మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య, కార్పొరేటర్లు, ఉపాధ్యాయులు, అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.
గోదావరిఖనిలో 500 సైకిళ్ల పంపిణీ
◷ August 20, 2026 | telangananetramtv


Leave a Reply