గోదావరిఖని B-గెస్ట్ హౌస్ వద్ద సర్వీస్ రోడ్డుపై ద్విచక్ర వాహనాన్ని అడ్డంగా నిలిపిన ఇద్దరు వ్యక్తులు పోలీసులతో దురుసుగా ప్రవర్తించిన ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఉన్న చొప్పరి అజయ్, బొమ్మగాని ఆంజనేయులు ట్రాఫిక్ సీఐ గన్‌మెన్ రవి చొక్కా పట్టుకుని దురుసుగా ప్రవర్తించినట్లు పోలీసులు తెలిపారు. సీఐ బ్రీత్ అనలైజర్‌తో పరీక్షించేందుకు ప్రయత్నించగా ఆయనతోనూ దురుసుగా ప్రవర్తించినట్లు పేర్కొన్నారు. గన్‌మెన్ రవి ఫిర్యాదు మేరకు గోదావరిఖని 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఖనిలో పోలీసుల విధులకు ఆటంకం ఇద్దరిపై కేసు
◷ August 13, 2026 | telangananetramtv

Leave a Reply