భారీగా పెరగనున్న మద్యం ధరలు
రాష్ట్రంలో త్వరలోనే మద్యం ధరలు ‘ప్రియం’కానున్నాయి. తయారీ వ్యయం గణనీయంగా పెరిగిన నేపథ్యంలో తమకు చెల్లించే బేసిక్ ప్రైస్ ను సవరించాలని డిస్టిలరీలు ప్రభుత్వాన్ని ఇప్పటికే కోరిన విషయం తెలిసిందే.
దీనిపై ప్రభుత్వం ప్రైస్ ఫిక్సేషన్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ మద్యంపై 8శాతం వరకు ధరలను పెంచవచ్చని సిఫార్సు చేస్తూ నివేదిక ఇచ్చినట్టు సమాచారం. డిస్టిలరీల డిమాండ్ ను నెరవేర్చటమే కాకుండా రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకునేందుకుగాను ఎక్సయిజ్ శాఖ ఈ కసరత్తు చేసింది. మద్యం ధరల పెంపుపై కమిటీ ఇచ్చిన నివేదికను ఇప్పటికే ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపించినట్టుగా తెలిసింది. సీఎం ఆమోద ముద్ర లభించగానే ధరలను సవరించనున్నట్టు సమాచారం.


Leave a Reply