విధుల నిర్లక్ష్యంపై అంగన్వాడీ టీచర్ సస్పెన్షన్

పెద్దపల్లి, ఆగస్టు 16: ఓదెల-II అంగన్వాడీ కేంద్రంలో విధుల నిర్వహణలో నిర్లక్ష్యం, కేంద్రం నిర్వహణలో లోపాలు, ప్రభుత్వ సేవల అమలులో నిర్లక్ష్యంపై అంగన్వాడీ టీచర్ జె. ప్రమీలను సస్పెండ్ చేసినట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. సూపర్వైజర్ నివేదిక ఆధారంగా ఈ చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. ముందస్తు సమాచారం లేకుండా కేంద్రాన్ని మూసివేయడం, పిల్లలు, గర్భిణీలు, బాలింతలకు అందించాల్సిన సేవల్లో నిర్లక్ష్యం వహించినట్లు ఆరోపణలు ఉన్నాయి. సస్పెన్షన్ కాలంలో అంగన్వాడీ సేవలకు అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ సిబ్బందికి బాధ్యతలు అప్పగించాలని కలెక్టర్ ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *