కాంగ్రెస్ ముందు రెండే ఆప్షన్లు..

ఏది బెస్ట్ అంటే?

కాంగ్రెస్ హైకమాండ్ ముందు రెండు ఆప్షన్లున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ లో క్రమశిక్షణ పట్టుతప్పుతోంది. నేతలే ప్రభుత్వాన్ని విమర్శలు చేయడంతో పార్టీ వచ్చే ఎన్నికల్లో తీవ్రంగా నష్టపోయే అవకాశముంది.ప్రస్తుతం కఠిన చర్యలు తీసుకోకుంటే పార్టీ మరింత గాడి తప్పే అవకాశముంది. చర్యలు తీసుకోకుంటే రానున్న కాలంలో మరింతగా నేతలు బయటపడతారు. అందుకే కాంగ్రెస్ నాయకత్వం తీవ్రంగా ఆలోచిస్తుంది. ఇప్పుడు రెండు ఆప్షన్లు ఉన్నట్లు కాంగ్రెస్ నాయకత్వం తెలిపింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత ఆయన తో చర్చించిన తర్వాత ఈ చర్యలకు దిగే అవకాశముంది. చర్యలు తీసుకోకుంటే చేతకాని తనంగా భావిస్తారు. భవిష్యత్ లో పార్టీ నేతలు మరింత కట్టు తప్పే అవకాశాలున్నాయి. *ఆప్షన్ 1 :* మంత్రి వర్గం ప్రక్షాళన…కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి ప్రస్తుతం బెస్ట్ ఆప్షన్ మంత్రి వర్గం ప్రక్షాళన అని భావిస్తుంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయి రెండున్నరేళ్లు దాటి పోతుండటంతో ఖచ్చితంగా మంత్రివర్గ ప్రక్షాళ చేస్తూ కట్టుబాటు తప్పిన నేతలను పదవుల నుంచి తప్పిస్తే కొంత సాఫీగా సాగిపోతుంది. తప్పించిన మంత్రి స్థానంలో అదే సామాజికవర్గానికి చెందిన మరొకరికి అవకాశం కల్పిస్తే కులం కార్డు కూడా వాడే అవకాశం లేదు. మంత్రుల పనితీరు, మరొకరికి అవకాశం కల్పించాలన్న ఉద్దేశ్యంతో మంత్రి వర్గం ప్రక్షాళన చేయవచ్చు. ఆ జిల్లాలో కానీ, మరొకచోట కాని ప్రత్యామ్నాయ నేతకు మంత్రి పదవి ఇవ్వొచ్చు. కొండా సురేఖను మంత్రి వర్గం నుంచి తొలగించడం కంటే.. మరికొందరితో పాటు ఆమెను కూడా తప్పించి మరొక బీసీ సామాజికవర్గానికి ఇస్తే ఏ గొడవ ఉండదని భావిస్తుంది. *ఆప్షన్ 2* :ఇద్దరినీ తప్పించడం ఒక ఆప్షన్…కాంగ్రెస్ నాయకత్వం ముందున్న మరొక ఆప్షన్ ఇద్దరు నేతలను పార్టీ నుంచి తప్పించడం. మంత్రి పదవి నుంచి తప్పించి మరొకరికి అవకాశం ఇవ్వొచ్చు. అలాగే మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన సీనియర్ నేత చిన్నారెడ్డిపై కూడా వేటు వేయవచ్చు. అప్పుడు కూడా సామాజిక కార్డు వాడుకునే అవకాశం ఉండదని ఆలోచన ఉంది. అయితే కొండా సురేఖ ప్రస్తుతం మంత్రి వర్గంలో ఉన్నారు. చిన్నారెడ్డి ప్రణాళిక సంఘం వైస్ ఛైర్మన్ గా ఉన్నారు. ఇద్దరినీ పదవి నుంచి తప్పిస్తే ఇటు బీసీ, అటు రెడ్డి సామాజికవర్గం నేతలపై చర్యలు తీసుకున్నట్లుంటుందన్న భావన కూడా ఉంది. చిన్నారెడ్డి పై చ్యలు తీసుకున్నా పెద్దగా రియాక్ట్ కాకపోవచ్చు. కానీ కొండా సురేఖను తప్పిస్తే మరింతగా ఆ కుటుంబం ఎదురుదాడి చేసే అవకాశాలున్నాయి. వాటిని ఎదుర్కొనడంపైన కూడా ఆలోచించి ముందడుగు వేయాల్సి ఉంటుందన్న అభిప్రాయం సీనియర్ నేతలలో ఉంది. మొత్తం మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లండన్ పర్యటన నుంచి వచ్చిన తర్వాత మాత్రమే దీనిపై క్లారిటీ రానుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *