నేపాల్ వరదల్లో హైదరాబాద్ యువతి గల్లంతు

SHARE THIS

నేపాల్ వరదల్లో హైదరాబాద్ యువతి గల్లంతు : నేపాల్ వరదల్లో హైదరాబాద్ లోని ఎల్బీనగర్ కు చెందిన యువతి గల్లంతయింది. ఎల్బీనగర్ పరిధిలోని వాస్తు కాలనీకి చెందిన సుహాసిని రెడ్డి అనే యువతి నేపాల్ లో సంభవించిన భారీ వరదల్లో చిక్కుకుని గల్లంతయ్యారు.

విషయం తెలుసుకున్న వాస్తు కాలనీలో ప్రజలు కన్నీటి పర్యంతమయ్యారు. వివరాల్లోకి వెళితే.. నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామానికి చెందిన కందిమల్ల మహేందర్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఎల్బీనగర్ వాస్తు కాలనీలో ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. సుహాసిని రెడ్డి ఉన్నత చదువులు చదివింది.

కాగా 2004లో నల్గొండ జిల్లా మునుగోడు మండలం గూడపూర్ గ్రామానికి చెందిన సంజీవరెడ్డితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. సుహాసిని రెడ్డి, సంజీవరెడ్డి ఇద్దరు భార్యాభర్తలు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ లుగా పనిచేస్తున్నారు. మొదటగా న్యూజిలాండ్ దేశానికి వెళ్లి, స్థిరపడ్డారు. ఉద్యోగరీత్యా ఆస్ట్రేలియాకు వెళ్లారు. ఈ క్రమంలో అమెరికా నుంచి వచ్చిన తన స్నేహితురాలితో కలిసి సుహాసిని రెడ్డి ఆస్ట్రేలియా నుంచి ఈ నెల 19న హైదరాబాద్ కు చేరుకున్నారు. ఆస్ట్రేలియా నుంచి మరో స్నేహితురాలితో మానస సరోవరం యాత్ర టికెట్స్ ను మూడు నెలల క్రితం బుక్ చేసుకుంధి

ఈ క్రమంలో సుహాసిని రెడ్డి హైదరాబాద్ నుంచి వెళ్లగా ఆమె స్నేహితురాలు ఆస్ట్రేలియా నుంచి నేపాల్ రాజధాని ఖాట్మండుకు వచ్చింది. ఆదివారం అక్కడ ఇద్దరు కలిశారు. అనంతరం టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా మొత్తంగా 29 మందితో కలిసి మానస సరోవరం యాత్రకి వెళ్తున్నట్లు సుహాసిని రెడ్డి తన కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. కాగా మంగళవారం రాత్రి 8 గంటల నుంచి సుహాసిని రెడ్డి ఫోన్ కలవకపోవడం కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. సుహాసిని రెడ్డి వెళ్లిన ప్రాంతాల్లో వరదలు వచ్చాయని తెలియడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఇప్పటి వరకు సుహాసిని రెడ్డి ఆచూకీ లభించలేదని ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా సమాచారం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారత ప్రభుత్వం వెంటనే మానస సరోవరం యాత్రికుల వివరాలు, సమాచారం చెప్పాలని యాత్రీకులను సురక్షితంగా తీసుకురావాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *