ఎవరు గీత దాటినా మౌనమే
కొండా సురేఖపై గతంలోనే చర్య తీసుకుంటే ఈ పరిస్థితి వచ్చేదా?
ఇప్పుడు కూడా పట్టించుకుంటున్నది అంతంతమాత్రమే!
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గా మీనాక్షి నటరాజన్ బాధ్యతలు చేపట్టినప్పుడు పార్టీని గాడిలో పెడతారని… గాడి తప్పిన వారిని ఉపేక్షించరని అందరూ అనుకున్నారు.రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితురాలిగా, అవినీతి మచ్చ లేని కఠినమైన నాయకురాలిగా పేరుండటంతో రాష్ట్రంలో క్రమశిక్షణారాహిత్యానికి అడ్డుకట్ట వేస్తారని అంతా భావించారు. అయితే, తెలంగాణ కాంగ్రెస్ నాయకుల సొంత ఎజెండాలు, అంతర్గత ముఠా తత్వాల ముందు ఆమె వ్యూహాలు తేలిపోయినట్లు కనిపిస్తోంది. పదవి చేపట్టిన నాటి నుంచి కఠిన నిర్ణయాలు తీసుకోకుండా బుజ్జగింపు రాజకీయం అనుసరించడంతో నేతలు ఆమె ఆదేశాలను పట్టించుకోవడం లేదు.ఎవరు గీత దాటినా మౌనమేసమస్యలను ప్రాథమిక దశలోనే పరిష్కరించడంలో, క్రమశిక్షణ తప్పిన నేతలపై వెంటనే వేటు వేయడంలో ఆమె వైఖరి మరీ మెతకగా ఉందనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో బలపడింది. అంతర్గత విభేదాలు రచ్చకెక్కిన ప్రతిసారీ కమిటీల ఏర్పాటు లేదా చర్చల పేరుతో కాలాన్ని వెళ్లదీయడమే తప్ప, గట్టి చర్యలు లేకపోవడంతో అసమ్మతి నేతలు మరింతగా రెచ్చిపోతున్నారు. చివరికి సొంత రాష్ట్రం మధ్యప్రదేశ్‌లో రాజ్యసభ స్థానాన్ని కైవసం చేసుకునే విషయంలోనూ పార్టీ అంతర్గత సమీకరణాలను తట్టుకోలేక పదవిని కోల్పోవాల్సి రావడం ఆమె రాజకీయ ప్రతిష్టకు తీవ్ర విఘాతం కలిగించింది.కొండా సురేఖపై గతంలోనే చర్య తీసుకుంటే ఈ పరిస్థితి వచ్చేదా?తాజాగా మంత్రి కొండా సురేఖ , ఆమె కుటుంబ వ్యవహార శైలిపై రగులుతున్న వివాదంలోనూ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పాత్ర దాదాపు శూన్యంగా మారింది. సురేఖ చేసిన వరుస వివాదాస్పద వ్యాఖ్యలు, ఆమె అనుచరుడు సుమంత్‌పై వస్తున్న ఆర్థిక సెటిల్‌మెంట్ల ఆరోపణలు పార్టీకి, ప్రభుత్వానికి తీవ్ర నష్టం కలిగిస్తున్నప్పటికీ అధిష్టాన స్థాయి నుంచి గట్టి కౌంటర్ ఇవ్వడంలో ఆమె నిశ్శబ్దాన్ని పాటిస్తున్నారు. పీసీసీ వర్గాలు ఒకవైపు కఠిన నివేదికలు సిద్ధం చేస్తుంటే, ఇన్‌ఛార్జ్ మాత్రం ఎలాంటి స్పష్టమైన దిశానిర్దేశం చేయలేక చేతులెత్తేసినట్లు తెలుస్తోంది.ఇప్పుడు కూడా పట్టించుకుంటున్నది అంతంతమాత్రమే!మొత్తానికి, ఎంతటి వర్గపోరునైనా అదుపు చేయవచ్చనే అంచనాలతో వచ్చిన మీనాక్షి నటరాజన్, తెలంగాణ కాంగ్రెస్ నాయకుల నడుమ తన సూపర్ పవర్ సామర్థ్యాన్ని చాటుకోవడంలో విఫలమయ్యారనేది స్పష్టమవుతోంది. కఠిన నిర్ణయాలు తీసుకోకుండా సాగదీసే ధోరణి వల్లనే ప్రస్తుతం మంత్రి కొండా సురేఖ ఉదంతం అధిష్టానానికి, రేవంత్ సర్కారుకు పెద్ద తలనొప్పిగా మారింది.


Leave a Reply