పెద్దపల్లి, ఆగస్టు 12: డ్రగ్స్‌కు దూరంగా ఉంటూ క్రీడలు, వ్యాయామాలను జీవితంలో భాగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష యువతకు పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 27న నిర్వహించనున్న 4వ కరీంనగర్ హాఫ్ మారథాన్ పోస్టర్‌ను పెద్దపల్లి ఐడీఓసీలో ఆయన ఆవిష్కరించారు. డ్రగ్స్ వ్యతిరేక అవగాహనతో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించేందుకు మారథాన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యువత, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో డీఎంఓ ప్రవీణ్ రెడ్డి, కేఆర్‌సీఏ అధ్యక్షులు పసుల మహేష్, మహిపాల్ రెడ్డి, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం.కలెక్టర్
◷ August 12, 2026 | telangananetramtv


Leave a Reply