రామగుండం, ఆగస్టు 29: నిరుద్యోగ యువతీ యువకులు, మహిళలకు స్వయం ఉపాధి కల్పించడంతో పాటు నైపుణ్యాలను అభివృద్ధి చేసేందుకు సింగరేణి సేవా సమితి, రామగుండం ఏరియా–1 ఆధ్వర్యంలో ఉచిత వృత్తి శిక్షణా కోర్సులను నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. టైలరింగ్, బ్యూటీషియన్, ఫ్యాషన్ డిజైనింగ్, మగ్గం వర్క్, స్పోకెన్ ఇంగ్లీష్, జూట్–బంజారా బ్యాగ్స్ తయారీ, ఫోటోషాప్, కంప్యూటర్ డి.టి.పి. కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. శిక్షణ పూర్తి చేసిన వారికి ధృవీకరణ సర్టిఫికెట్లు అందజేస్తామని తెలిపారు. సింగరేణి ఉద్యోగులు, మాజీ ఉద్యోగుల పిల్లలు, కుటుంబ సభ్యులతో పాటు సింగరేణి ప్రభావిత, పరిసర ప్రాంతాల నిరుద్యోగ యువతీ యువకులు, మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆసక్తి గల అభ్యర్థులు 2 పాస్పోర్ట్ సైజు ఫోటోలు, ఆధార్ కార్డు, స్టడీ సర్టిఫికెట్ జిరాక్స్ ప్రతులతో రామగుండం ఏరియా–1 జీఎం కార్యాలయంలోని పర్సనల్ విభాగం, సింగరేణి సేవా సమితి కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. అలాగే శిక్షణ అందించేందుకు అర్హత, అనుభవం కలిగిన ఫ్యాకల్టీలు తమ విద్యార్హతలు, అనుభవం, ధృవీకరణ పత్రాలతో సెప్టెంబర్ 10లోపు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు.
నిరుద్యోగ యువత, మహిళలకు ఉచిత వృత్తి శిక్షణ
◷ August 29, 2026 | telangananetramtv


Leave a Reply