రాజీవ్ రహదారిపై విశ్వహిందూ పరిషత్ ధర్నా

గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో విగ్రహాలను నిలిపి ఉంచుతాం: విహెచ్‌పీ.

గోదావరిఖని, అక్టోబర్ 21: (తెలంగాణ నేత్రం)దుర్గామాత విగ్రహాల నిమజ్జనానికి గోదావరి నదిలో ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేస్తూ విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో బుధవారం రాజీవ్ రహదారిపై ధర్నా నిర్వహించారు. మురుగునీరు చేరిన చెరువుల్లో విగ్రహాల నిమజ్జనం చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పోలీసులతో వాగ్వాదం చోటుచేసుకుంది.

ఈ సందర్భంగా విశ్వహిందూ పరిషత్ నాయకులు మాట్లాడుతూ, దుర్గామాత విగ్రహాలను గోదావరి నదిలోనే నిమజ్జనం చేసేలా అధికారులు ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు. మండప నిర్వాహకులు శోభాయాత్రలు ముగించుకుని గోదావరిఖని ప్రధాన చౌరస్తాకు అమ్మవారి విగ్రహాలను తీసుకురావాలని సూచించారు. గోదావరి నదిలో నిమజ్జన ఏర్పాట్లు చేసేంతవరకు విగ్రహాలను అక్కడే ఉంచుతామని, గోదావరి నది మినహా ఇతర ప్రాంతాల్లో నిమజ్జనం చేయబోమని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

▲