సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు రూ.25 వేల బోనస్‌ ఇవ్వాలి.

గోదావరిఖని,(తెలంగాణ నేత్రం)సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు కేవలం రూ.5,500 దసరా బోనస్‌ ప్రకటించడాన్ని తెలంగాణ కాంట్రాక్టు కార్మిక సంఘం (TCKS) తీవ్రంగా వ్యతిరేకించింది. కనీసం రూ.25 వేల బోనస్‌ చెల్లించాలని, లాభాల వాటాలో 15 శాతం కేటాయించాలని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మద్దెల శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. కనీస వేతనం రూ.26 వేలకు తగ్గకుండా చెల్లించాలని, బోనస్‌ చెల్లింపులో జీఎస్టీ సమస్యలను పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో కమాటం సందీప్‌, రచకట్ల భాస్కర్‌, రవికిరణ్‌, మహేందర్‌, ప్రణయ్‌, రమ్య, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

▲