మందమర్రి, అక్టోబర్ 19: (తెలంగాణ నేత్రం)మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని శివారు ప్రాంతాల్లో డబ్బులు పందెంగా పెట్టి పేకాట ఆడుతున్నారనే విశ్వసనీయ సమాచారంతో నార్కోటిక్ టీమ్/టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఏసీపీ శ్రీనివాస్‌రావు నేతృత్వంలో టాస్క్‌ఫోర్స్ ఎస్‌ఐ దీకొండ రమేష్, ఆర్‌ఎస్‌ఐ ప్రవీణ్, సిబ్బంది ఈ దాడుల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పేకాట ఆడుతున్న ఆరుగురిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ.86,230 నగదు, ఆరు సెల్‌ఫోన్లు, ఒక బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిని వడ్డే కుమార్ (శాంతిఖని), దురిశెట్టి శ్రీనివాస్ (సోమగూడెం), కర్ణ వెంకటేష్ (మందమర్రి), సల్లు సతీష్ (యాపల్), సల్ల సాధానందం (మెదారం), కొట్టే కిషోర్ (సోమగూడెం)గా గుర్తించారు.
అదుపులోకి తీసుకున్న ఆరుగురిని, స్వాధీనం చేసుకున్న నగదు, సెల్‌ఫోన్లు, బైక్‌తో సహా తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం మందమర్రి పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు.


Leave a Reply