తైక్వాండోలో నితీష్ ఠాకూర్‌కు గిన్నిస్ వరల్డ్ రికార్డు
రామగుండం ఎమ్మెల్యే తనయుడి ఘనత.. హైదరాబాద్ తైక్వాండో బృందంతో ప్రపంచ రికార్డులో భాగస్వామ్యం
హైదరాబాద్, ఆగస్టు 9: తైక్వాండో క్రీడా రంగంలో రామగుండం ఎమ్మెల్యే తనయుడు నితీష్ ఠాకూర్ అరుదైన ఘనత సాధించారు. హైదరాబాద్ గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఆదివారం నిర్వహించిన ప్రతిష్టాత్మక Guinness World Record కార్యక్రమంలో పాల్గొని ప్రపంచ రికార్డు సాధించిన తైక్వాండో బృందంలో నితీష్ భాగస్వామిగా నిలిచారు.
J.R. International Taekwondo Academy – India ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా పలువురు తైక్వాండో క్రీడాకారులు పాల్గొన్నారు. హైదరాబాద్‌కు చెందిన INDIA TAEKWONDO TIGERS బృందం ప్రత్యేకంగా పాల్గొని రికార్డు సృష్టించడంలో భాగమైంది.
చిన్న వయసులోనే ప్రపంచ స్థాయి క్రీడా వేదికపై నితీష్ ఠాకూర్ తన ప్రతిభను చాటుకోవడం పట్ల రామగుండం ప్రాంత క్రీడాభిమానులు, తైక్వాండో శిక్షకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. నితీష్ సాధించిన ఈ ఘనత యువతకు స్ఫూర్తిగా నిలుస్తుందని వారు అభినందించారు.


Leave a Reply