జాతీయ ఆయుష్ మిషన్‌లో 6 పోస్టుల భర్తీ

పెద్దపల్లి: జాతీయ ఆయుష్ మిషన్‌ కింద పెద్దపల్లి జిల్లాలో అవుట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన 6 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. మెడికల్ ఆఫీసర్‌ 3, ఫార్మాసిస్ట్‌, సైకోసోషల్ కౌన్సెలర్‌, యోగా ప్రొఫెషనల్‌ పోస్టులు ఒక్కొక్కటి చొప్పున భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్‌ 22 నుంచి 27 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు peddapalli.telangana.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

▲