ఉమ్మడి జిల్లా సెలక్షన్స్‌లో రామగుండం విద్యార్థులకు ప్రతిభ.. రాష్ట్రస్థాయికి 9 మంది ఎంపిక
గోదావరిఖని,(తెలంగాణ నేత్రం)జగిత్యాల పట్టణంలోని పొన్నాల గార్డెన్‌లో శనివారం నిర్వహించిన 70వ ఎస్‌జీఎఫ్ ఉమ్మడి జిల్లా కరాటే సెలక్షన్స్‌లో పెద్దపల్లి జిల్లా రామగుండానికి చెందిన జేఎస్‌కేఎస్ విద్యార్థులు సత్తా చాటారు. అండర్-14, అండర్-17 విభాగాల్లో మొత్తం తొమ్మిది మంది విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు.
ఈ పోటీలకు ముఖ్య అతిథిగా హాజరైన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి క్రీడలకు ప్రాధాన్యతనిస్తూ సీఎం కప్, ఖేలో ఇండియా వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని తెలిపారు. కరాటే నేర్చుకోవడం వల్ల విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, శారీరక దృఢత్వం, మానసిక ఆరోగ్యం, ధైర్యం పెరుగుతాయని పేర్కొన్నారు. జగిత్యాలలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి అండర్-14 పోటీల నిర్వాహకులకు తన పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.
రాష్ట్రస్థాయికి ఎంపికైన విద్యార్థులు
అండర్-14 విభాగం
• 25 కిలోల విభాగం: ఎం. కార్తికేయన్
• 30 కిలోల విభాగం: ఎన్. మితాళి
• 34 కిలోల విభాగం: హేమలత మాజీ
• 42 కిలోల విభాగం: బి. సహస్ర
• 46 కిలోల విభాగం: బి. ఆశ్రిత
• 50 కిలోలకు పైగా: ఎం. గాయత్రి సాయి దివ్య
అండర్-17 విభాగం
• 32 కిలోల విభాగం: ఫిదా సహరిష్
• 44 కిలోల విభాగం: ఎం. ముక్తిశ్రీ
• 52 కిలోల విభాగం: స్నేహ సుల్తానా
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులతో పాటు కోచ్ కరాటే శ్రీనివాస్‌ను జపాన్ షిటోరియో కరాటే స్కూల్ అధ్యక్షుడు ఎం. రమేష్, సీనియర్ ఇన్‌స్ట్రక్టర్లు ఎస్. శ్రీనివాస్, శ్రావణ్ కుమార్ పటేల్, బి. పరమేష్, నిదిష్ కుమార్, రోహిత్ కుమార్, సంజన, శుభశ్రీ తదితరులు అభినందించారు.
స్పందన క్లబ్ కార్యదర్శి డాక్టర్ కె. నరేంద్ర సోనీ, స్పోర్ట్స్ కౌన్సిల్ కార్యదర్శి శ్రీరామ్, చిరంజీవి ఆదిత్య, వంశీకృష్ణ, గణేష్ రాజ్‌తో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.


Leave a Reply