మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌కు ప్రమాదం జరగలేదు

• సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవం

• మంత్రి పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారు: పీఏ సంగి సాయికిరణ్

జగిత్యాల,(తెలంగాణ నేత్రం)జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఓ బాంకెట్ హాల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ లిఫ్ట్ ప్రమాదానికి గురై గాయపడినట్లు సోషల్ మీడియా, ఇతర ప్రచార మాధ్యమాల్లో వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని ఆయన వ్యక్తిగత సహాయకుడు సంగి సాయికిరణ్ స్పష్టం చేశారు. మంత్రికి ఎలాంటి లిఫ్ట్ ప్రమాదం జరగలేదని, ఆయన పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. ఈ వార్తలపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పార్టీ నాయకులు, కార్యకర్తలు వాస్తవాలను గమనించాలని విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

▲