రూ.40,840 నగదు, 10 సెల్‌ఫోన్లు, 5 ద్విచక్ర వాహనాలు స్వాధీనం
మంచిర్యాల: (తెలంగాణ నేత్రం)మంచిర్యాల పట్టణంలోని ఏసీసీ కాలనీలో డబ్బులు పందెంగా పెట్టి మూడు ముక్కలాట ఆడుతున్నారనే సమాచారంతో టాస్క్‌ఫోర్స్, మంచిర్యాల టౌన్ పోలీసులు సంయుక్తంగా దాడి నిర్వహించారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న 10 మందిని అదుపులోకి తీసుకున్నారు.
నార్కోటిక్ టీమ్/టాస్క్‌ఫోర్స్ ఏసీపీ శ్రీనివాస్ నేతృత్వంలో టాస్క్‌ఫోర్స్ ఎస్‌ఐలు దీకొండ రమేష్, లక్ష్మణ్ రావు, మంచిర్యాల టౌన్ ఎస్‌ఐ శ్రావణ్, సిబ్బంది ఈ దాడిలో పాల్గొన్నారు.
పోలీసులు నిందితుల నుంచి 52 పేకముక్కలు, రూ.40,840 నగదు, 10 సెల్‌ఫోన్లు, ఐదు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిని స్వాధీనం చేసుకున్న వస్తువులతో సహా తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం మంచిర్యాల టౌన్ పోలీసులకు అప్పగించారు.


Leave a Reply