14న కార్మిక గర్జనకాంగ్రెస్ ప్రభుత్వంపై కొప్పుల ఈశ్వర్, బాల్క సుమన్ విమర్శలు

గోదావరిఖని,(తెలంగాణ నేత్రం)సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం, సంస్థ పరిరక్షణే లక్ష్యంగా ఈ నెల 14న రామగుండం సింగరేణి స్టేడియంలో సాయంత్రం 5 గంటలకు ‘సింగరేణి కార్మిక గర్జన’ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు బీఆర్‌ఎస్ నాయకులు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అధ్యక్షతన జరిగిన నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, బాల్క సుమన్ పాల్గొని సభకు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు.కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలులో విఫలమైందని కొప్పుల ఈశ్వర్ విమర్శించగా, కార్మికుల బోనస్, డిపెండెంట్ ఉద్యోగాలు, జీవో 3 వంటి అంశాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని బాల్క సుమన్ డిమాండ్ చేశారు. కేటీఆర్ నాయకత్వంలో జరిగే కార్మిక గర్జనను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.


Leave a Reply