ఏఎస్ఆర్ నగర్‌లో పేకాట స్థావరంపై పోలీసుల దాడి

పేకాట ఆడుతున్న 8 మంది అరెస్ట్‌.. రూ.15,300 నగదు, 6 సెల్‌ఫోన్లు స్వాధీనం

తెలంగాణ నేత్రం , అక్టోబర్ 11: రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సీసీసీ నస్పూర్ పోలీస్ స్టేషన్ పరిధి ఏఎస్ఆర్ నగర్‌లో ఆదివారం సాయంత్రం పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్, సీసీసీ నస్పూర్ పోలీసులు సంయుక్తంగా దాడి చేశారు. డబ్బులు పందెంగా పెట్టి మూడు ముక్కలాట ఆడుతున్న ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు.

ఈ దాడిలో 52 పేక ముక్కలు, రూ.15,300 నగదు, ఆరు సెల్‌ఫోన్లు, మూడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ దాడిలో టాస్క్‌ఫోర్స్ ఏసీపీ నేతృత్వంలో ఎస్‌ఐ దీకొండ రమేష్, లచ్చన్న, సీసీసీ నస్పూర్ ఎస్‌ఐ తైసీనుద్దీన్, సిబ్బంది పాల్గొన్నారు.

పట్టుబడిన ఎనిమిది మందిని, స్వాధీనం చేసుకున్న వస్తువులతో సహా సీసీసీ నస్పూర్ పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. వారిపై కేసు నమోదు చేసి తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులు తెలిపారు. అక్రమ జూదం లేదా ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలకు సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

▲