సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి: సీపీ అంబర్ కిషోర్ ఝా

మంచిర్యాల: (తెలంగాణ నేత్రం)
సైబర్ మోసాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సూచించారు. సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిగత, కుటుంబ, ఆర్థిక వివరాలను బహిర్గతం చేయవద్దని యువతకు సూచించారు.

జాతీయ సైబర్ భద్రత అవగాహన మాసంలో భాగంగా బుధవారం మంచిర్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా “Pause. Think. Verify.” విధానాన్ని పాటించాలని సీపీ సూచించారు. అనుమానాస్పద కాల్స్, సందేశాలు, లింకులు, యాప్‌లకు స్పందించవద్దన్నారు.

రైతుల నమోదు, యూరియా యాప్ డౌన్‌లోడ్ తదితర పేర్లతో ఫోన్ చేసి OTP, పిన్, పాస్‌వర్డ్, బ్యాంకు వివరాలు అడిగితే ఇవ్వవద్దని హెచ్చరించారు. సైబర్ మోసం జరిగినా, అనుమానాస్పద లావాదేవీ గుర్తించినా వెంటనే 1930కు సమాచారం ఇవ్వాలని సూచించారు.

కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్, ఏసీపీ ఆర్. ప్రకాష్, సైబర్ క్రైమ్ ఏసీపీ డి.వి. రంగారెడ్డి, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

▲