గోదావరిఖని ప్రెస్ క్లబ్ పై తప్పుడు వార్తలు రాస్తే ఖబర్దార్..

– క్లబ్ అద్యక్షులు మాధవరావు హెచ్చరిక

గోదావరిఖని,(తెలంగాణ నేత్రం) గోదావరిఖని ప్రెస్ క్లబ్, క్లబ్ నాయకత్వంపై తప్పుడు వార్త కథనాలను రాస్తూ క్లబ్ ఔన్నత్యాన్ని దెబ్బతీయాలని చూడడాన్ని వ్యతిరేకిస్తూ క్లబ్ అధ్యక్షునితో కలిసి, కార్యవర్గ సబ్యులు, క్లబ్ సభ్యులు మంగళవారం రామగుండం డీసీపీ అడ్మిన్ శ్రీనివాస్ కు ఆ వార్త కథనాలను ప్రచురించి , సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వారిపై ఫిర్యాదు చేశారు. కొందరు క్రిమినల్ చరిత్ర ఉన్నవారు కొందరు తమ క్లబ్ సఖ్యతను దెబ్బతీయాలని ప్రయత్నిస్తూ వారికి సంబంధించిన పత్రికల్లో గోదావరిఖని క్లబ్ పై, క్లబ్ అధ్యక్షునిపై తప్పుడు ప్రచారం చేస్తూ వార్తలు రాశారని వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం గోదావరిఖని ప్రెస్ క్లబ్ అద్యక్షులు మాధవరావు మాట్లాడుతూ విచ్ఛిన్నకర శక్తులు, క్రిమినల్స్, దోపిడి వ్యవస్థ చేసేవారు కొందరు ప్రతిష్ఠ కలిగిన గోదావరిఖని ప్రెస్ క్లబ్ ఐక్యతను దెబ్బతీసే కుట్రలను చేస్తున్నారని, క్లబ్ పై, క్లబ్ అధ్యక్షుడినినైన తనపై నీచమైన కథనాలు రాస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వస్తున్నారని తెలిపారు. ఈ కథనాలు రాసినవారు, పోస్ట్ చేసినవారు క్రిమినల్ చరిత్ర కలిగినవారే, జర్నలిజంకు కళంకితం తెచ్చిన వారే అని ఆరోపించారు. ఎలాంటి నీచులు అధ్యక్షుడినైన తమపై చిల్లర ఆరోపణలు చేస్తూ తప్పుడు కథనాలు రాస్తూ, పోస్ట్ చేస్తూ సునకానందం పొందుతున్నారని అన్నారు. ఇలాంటివి గోదావరిఖని ప్రెస్ క్లబ్ కు కొత్తకాదని, ఇలాంటివి ప్రెస్ క్లబ్, ప్రెస్ క్లబ్ నాయకత్వం ఎన్నో ఎదుర్కొందని ఖబర్దార్ అంటూ హెచ్చరించారు. క్లబ్ ను, క్లబ్ నాయకత్వాన్ని, నా తోటి రిపోర్టర్ లను దెబ్బతీసే కథనాలను రాస్తూ వాటితో వెలుగులోకి వస్తానని అనుకోవడం మీ అవివేకమని సమాజంలో మీరు ఇంకా చులకన అవుతారని గుర్తెరగాలని అన్నారు. మీ జర్నలిజాన్ని ప్రజా సమస్యలపై, కార్మికుల సమస్యలపై రాయడంలో ఫోకస్ పెట్టుకోండి అంతేగానీ ఇలాంటి తప్పుడు ఆలోచనలతో పోతే క్లబ్ ఆగ్రహానికి గురవుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గోదావరిఖని ప్రెస్ క్లబ్ కార్యవర్గ సబ్యులు రంగు రాజయ్య, దబ్బెట శంకర్, సందుపట్ల తిరుపతి రెడ్డి, బోల్లం మధు, మామిడి కుమార్, సుధాకర్ రావు, గసిగంటి రవీందర్, బోల్లం రవీందర్, మూల శంకర్, సభ్యులు కరాటే శ్రీను, గంట రవి, రంగు తిరుపతి, శేఖర్, దండే విజయ్, కెనడి, కేపి శ్రీనివాస్, ఉదయ్, రఘు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

▲