
గోదావరిఖని,(తెలంగాణ నేత్రం)అక్రమ కార్యకలాపాల నియంత్రణకు ప్రజలు పోలీసులకు సహకరించాలని ఏసీపీ ఎం. రమేష్ కోరారు. సప్తగిరి కాలనీలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించిన పోలీసులు 65 వాహనాలు, 6 ఆటోలను తనిఖీ చేసి, సరైన ధ్రువపత్రాలు లేని 15 వాహనాలను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పిల్లల మొబైల్ వినియోగంపై తల్లిదండ్రులు పర్యవేక్షణ కలిగి ఉండాలని, గంజాయి, మాదకద్రవ్యాలు, అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలపై సమాచారం ఉంటే వెంటనే 112కు తెలియజేయాలని ఏసీపీ సూచించారు. కాలనీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, అద్దెదారుల వివరాలను యజమానులు నమోదు చేసుకోవాలని కోరారు.కార్యక్రమంలో ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, ఎస్‌ఐలు మనోహర్, సంధ్యారాణి, రాజశేఖర్, అనూష, ఎన్‌టీపీసీ ఎస్‌ఐ వెంకట్, రామగుండం ఎస్‌ఐ హరీశేఖర్, కమాన్‌పూర్ ఎస్‌ఐ ప్రసాద్, కార్పొరేటర్ గడ్డం శ్రీనివాస్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.


Leave a Reply