మంథని,(తెలంగాణ నేత్రం)అనారోగ్యంతో నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మంథని మండలం ఖాన్‌సాయిపేటకు చెందిన మెరుగు రాజయ్యకు వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం సహాయనిధి (CMRF) ద్వారా రూ.3 లక్షల ఎల్ఓసీ మంజూరైంది. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబును కుటుంబ సభ్యులు సంప్రదించగా, ఆయన చొరవతో ఎల్ఓసీ మంజూరైనట్లు తెలిపారు. హైదరాబాద్‌లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆయన ఆస్పత్రి సహాయకులు రాజయ్య కుటుంబ సభ్యులకు ఎల్ఓసీ పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
చికిత్సకు రూ.3 లక్షల ఎల్ఓసీ మంజూరు
◷ October 3, 2026 | telangananetramtv


Leave a Reply