గోదావరిఖని,(తెలంగాణ నేత్రం)రామగుండం ఏరియా-1 పరిధిలో వర్క్ పీపుల్స్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ (WPS&GA) ఆధ్వర్యంలో ఫుట్‌బాల్ పోటీలు శనివారం జవహర్‌లాల్ నెహ్రూ క్రీడా మైదానంలో ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి.

ఏరియా సేఫ్టీ ఆఫీసర్, ఇన్‌చార్జ్ ఎస్‌వో టు జీఎం ఎస్. సాయి ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై క్రీడాకారులను పరిచయం చేసుకుని పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడాకారులు క్రీడాస్ఫూర్తి, క్రమశిక్షణతో ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు. సింగరేణి సంస్థ క్రీడలకు ప్రాధాన్యత ఇస్తోందని, రామగుండం ఏరియా క్రీడాకారులు జాతీయ స్థాయితో పాటు కోల్‌ఇండియా స్థాయి పోటీల్లో రాణించి ఏరియాకు పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు.
పోటీల్లో ఆర్‌జీ-1 పరిధిలోని వివిధ గనులు, విభాగాలకు చెందిన జట్లు పాల్గొంటున్నాయి. కార్యక్రమంలో WPS&GA కార్యదర్శి జి. హనుమంతరావు, సిఎంఓఏఐ ప్రతినిధి సి.హెచ్. రాజన్న, ఐటీయూసీ నాయకుడు రంగు శ్రీను, స్పోర్ట్స్ కోఆర్డినేటర్ గాండ్ల రాజయ్య, కెప్టెన్ సామల సత్యనారాయణ, క్రీడాకారులు, క్రీడాభిమానులు, ఉద్యోగులు పాల్గొన్నారు.


Leave a Reply