పేకాట స్థావరంపై పోలీసుల దాడి

ఆరుగురు అరెస్ట్‌.. రూ.28,120 నగదు, కార్డులు, మొబైల్‌ ఫోన్లు స్వాధీనం

పెద్దపల్లి,(తెలంగాణ నేత్రం)భూమ్‌నగర్‌ ప్రాంతంలో డబ్బులు పందెంగా పెట్టి మూడు ముక్కలాట ఆడుతున్నారన్న సమాచారంతో టాస్క్‌ఫోర్స్‌, పెద్దపల్లి టౌన్‌ పోలీసులు సంయుక్తంగా దాడి నిర్వహించారు. ఈ ఘటన అక్టోబర్‌ 2న చోటుచేసుకుంది.

టాస్క్‌ఫోర్స్‌ ఏసీపీ బి.శ్రీనివాసరావు నేతృత్వంలో ఎస్‌ఐ దీకొండ రమేష్‌, టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది, పెద్దపల్లి టౌన్‌ పోలీసులు భూమ్‌నగర్‌లో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పేకాట ఆడుతున్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు.

వారి వద్ద నుంచి 52 ప్లేయింగ్‌ కార్డులు, రూ.28,120 నగదు, ఏడు మొబైల్‌ ఫోన్లు, ఒక స్కూటీని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిని, స్వాధీనం చేసుకున్న వస్తువులను తదుపరి చట్టపరమైన చర్యల కోసం పెద్దపల్లి టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌హెచ్‌ఓకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

▲