ఆర్జీ-వన్‌ అభివృద్ధిలో కార్మికుల పాత్ర కీలకం.

– జీఎం లలిత్‌కుమార్‌

గోదావరిఖని,(తెలంగాణ నేత్రం)
ఆర్జీ-వన్‌ అభివృద్ధిలో కార్మికులు, అధికారుల పాత్ర కీలకమని ఆర్జీ-వన్‌ జీఎం లలిత్‌కుమార్‌ అన్నారు. సెప్టెంబర్‌ నెలలో ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకత, రవాణాలో నిర్దేశిత లక్ష్యాలను అధిగమించినట్లు తెలిపారు.

గురువారం ఆర్జీ-వన్‌ జీఎం కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు.ఆర్జీ-వన్‌ విజయానికి కృషి చేసిన కార్మికులు, అధికారులు అభినందనీయులన్నారు. విద్యుత్‌తో పాటు బొగ్గు ఆధారిత పరిశ్రమలకు అవసరమైన బొగ్గును సింగరేణి అందిస్తోందని తెలిపారు. సామాజిక బాధ్యతలో భాగంగా ఓసీపీ గుట్టలపై మొక్కలు నాటుతున్నట్లు పేర్కొన్నారు.
సింగరేణి ప్రభావిత ప్రాంతాల్లోని నిరుద్యోగులకు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ద్వారా వివిధ శిక్షణలు అందిస్తున్నట్లు చెప్పారు. వరల్డ్‌ హార్ట్‌ డే సందర్భంగా కార్మికులకు సీపీఆర్‌ శిక్షణ కూడా ఇస్తున్నామని తెలిపారు. సంస్థ అభివృద్ధితో పాటు కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తూ ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు జీఎం ‌ వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో ఆర్జి. 1 యస్. ఒ. టు జియం చంద్రశేఖర్ ఏరియా ఇంజనీర్ కాశీ విశ్వేశ్వర్ ఏజిఎం ఐఇడి ఆంజనేయులు పర్సనల్ మేనేర్ రెడ్డిమల్ల తిరుపతి డీజిఎం ఫైనాన్స్ ధనలక్ష్మి భాయి, డిజియం సివిల్ వరప్రసాద్ oc5 ప్రాజెక్టు ఆఫీసర్ రమేష్ , ఫారెస్ట్ ఆఫీసర్ కర్ణ అధికారులు సీనియర్ పిఓ శ్రావణ్ కుమార్ హనుమంతరావు
సీనియర్ సెక్యూరిటీ ఆఫీసర్ మురళీమోహన్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

▲