జనగామ పాఠశాలలో అల్పాహార పథకం ప్రారంభం

గోదావరిఖని,(తెలంగాణ నేత్రం)
తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో అమలు చేస్తున్న ముఖ్యమంత్రి అల్పాహార పథకం జనగామ గ్రామంలోని ప్రాథమిక పాఠశాల, జెడ్పీహెచ్‌ఎస్‌లో గురువారం ప్రారంభమైంది.

ఈ కార్యక్రమంలో స్థానిక 6వ డివిజన్ కార్పొరేటర్ తోకల (ఆవుల) శ్యామణి రమేష్ పాల్గొని విద్యార్థులకు అల్పాహారం అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోషకాలతో కూడిన అల్పాహారం తీసుకోవడం ద్వారా విద్యార్థుల ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు చదువుపై ఏకాగ్రత పెరుగుతుందని అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న అల్పాహార పథకాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎంలు జ్యోష్నలత, స్వప్న, ఉపాధ్యాయులు వీ. శ్రీధర్, సంతోష్, వెంకటరాజం, రాజిరెడ్డి, సత్యనారాయణ, రమ్య, పీడీ శ్రీధర్, విద్యా కమిటీ చైర్మన్లు తతిజా బేగం, మల్క భవానితో పాటు అరెళ్ల రవితేజ, ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

▲