=అవస్థలు పడుతున్న విద్యార్థులు ఉద్యోగస్తులు.
=గంటల కొద్దీ వేచి చూడాల్సిన వైనం.
=మంత్రి ఇలా కాలలో ఆర్టీసీ దుస్థితి.
=ఉదయం సాయంత్రం ఇదే దుస్థితి.
= భూపాలపల్లి, మంథని ,గోదావరిఖని వరకు ప్రయాణికుల అవస్థలు.
భూపాలపల్లి,మంథని,గోదావరిఖని (తెలంగాణ నేత్రం)
భూపాలపల్లి, మంథని, గోదావరిఖని ప్రాంతాల మధ్య నిత్యం రాకపోకలు సాగించే విద్యార్థులు, ఉద్యోగులు, వివిధ పనుల నిమిత్తం ప్రయాణించే ప్రజలకు ఆర్టీసీ బస్సుల కొరత తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. నిర్ణీత సమయానికి బస్సులు అందుబాటులో లేకపోవడంతో ప్రయాణికులు గంటల తరబడి బస్టాండ్లు, రహదారుల వెంట వేచి చూడాల్సిన పరిస్థితి నెల కొంది.
=గంటల కొద్దీ వేచి చూడాల్సిన వైనం.
ప్రత్యేకంగా ఉదయం పాఠశాలలు, కళాశాలలు, ఉద్యోగాలకు వెళ్లే సమయంలో, సాయంత్రం తిరిగి వచ్చే వేళల్లో రద్దీ అధికంగా ఉంటున్నప్పటికీ అందుకు అనుగుణంగా బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెబుతున్నారు. సమయానికి గమ్యస్థానాలకు చేరుకోలేక విద్యార్థులు, ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
=మంత్రి ఇలా కాలలో ఆర్టీసీ దుస్థితి.
మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతంలోనే ప్రజా రవాణా పరిస్థితి ఇలా ఉండటంపై ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో బస్సుల కోసం విద్యార్థులు, ఉద్యోగులు, ఇతర ప్రయాణికులు గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంటోందని చెబుతున్నారు
=ఉదయం సాయంత్రం ఇదే దుస్థితి.
భూపాలపల్లి, మంథని, గోదావరిఖని తదితర ప్రాంతాలకు రాకపోకలు సాగించే ప్రయాణికులకు బస్సుల కొరత ఇబ్బందిగా మారిందని, ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరచేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు తక్షణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
మధ్యాహ్నం మూడు తర్వాత మా డిపో నుంచి బస్సులు లేవు.
మధ్యాహ్నంమూడు తర్వాత మా డిపో నుంచి మంథని,
గోదావరిఖని వైపు వెళ్లే బస్సులు వెళ్లవు. గోదావరిఖని,మంథని డిపో వాళ్లే షేరింగ్ చేసుకొని నడిపించుకోవాలి అని భూపాల్ పల్లి డిపో మేనేజర్ తెలిపారు.
భూపాలపల్లి డిపో మేనేజర్….


Leave a Reply