రోడ్డు ప్రమాదంలో అంబులెన్స్ బోల్తా.పలువురికి గాయాలు

గోదావరిఖని , సెప్టెంబరు 26:(తెలంగాణ నేత్రం)మంచిర్యాల నుంచి వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రికి వెళ్తున్న అంబులెన్స్‌ ప్రమాదానికి గురై బోల్తాపడింది. శనివారం తెల్లవారుజామున 1.30 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో గాయపడిన పవన్‌ను అంబులెన్స్‌లో తరలిస్తుండగా ఎదురుగా వచ్చిన TS 19 C 7580 నంబర్‌ గల హీరో గ్లామర్‌ బైక్‌ అంబులెన్స్‌ను ఢీకొట్టింది. దీంతో అంబులెన్స్‌ అదుపుతప్పి బోల్తాపడింది.

ఈ ప్రమాదంలో అంబులెన్స్‌ డ్రైవర్‌ సతీష్‌తో పాటు పవన్‌, సుధీర్‌, పవన్‌ తల్లి రమక్క, అక్క కవిత గాయపడ్డారు. బైక్‌పై ప్రయాణిస్తున్న ఎస్‌కే మహిమోద్దీన్‌, ఎండ్‌ పర్వేజ్‌ కూడా గాయపడినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే విధుల్లో ఉన్న ఇన్‌స్పెక్టర్‌ ఏ. ఇంద్రసేనారెడ్డి, సిబ్బంది క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. అంబులెన్స్‌ యజమాని అనంతుల వెంకటేశ్వర్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ కే. రాజశేఖర్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

▲