– నిమజ్జనాలకు నీరు లేక భక్తుల ఇబ్బందులు
– ఎల్లంపల్లి నీటిని విడుదల చేయాలని డిమాండ్

గోదావరిఖని,(తెలంగాణ నేత్రం)గోదావరి నదిలో నీటి కొరతపై రామగుండం మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకుడు కోరుకంటి చందర్ ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం గోదావరి బ్రిడ్జి వద్ద విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో గోదావరిలో నీటి ప్రవాహం తగ్గిపోయిందని విమర్శించారు. ప్రస్తుతం వినాయక నిమజ్జనోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో నదిలో నీరు లేక భక్తులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఎల్లంపల్లి ప్రాజెక్టులోని నీటిని గోదావరిలోకి వెంటనే విడుదల చేయడంతో పాటు కన్నెపల్లి పంప్‌హౌస్‌ను ప్రారంభించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేసీఆర్ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరిలో నీటి లభ్యత పెరిగిందని చందర్ పేర్కొన్నారు.


Leave a Reply