
కాగజ్‌నగర్: (తెలంగాణ నేత్రం)కాళేశ్వరం జోన్-I డీఐజీ అంబర్ కిషోర్ ఝా మంగళవారం కాగజ్‌నగర్ టౌన్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ రికార్డులు, సిబ్బంది విధులు, సీసీటీఎన్‌ఎస్‌లో డేటా నమోదు, అప్‌లోడ్ ప్రక్రియను పరిశీలించారు. ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరించి, బాధితులకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. రౌడీషీటర్లు, సస్పెక్ట్‌షీట్ వ్యక్తులు, నేర చరిత్ర ఉన్నవారిపై నిరంతర నిఘా ఉంచాలని ఆదేశించారు. ఈ నెల 25న జరగనున్న గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు, ముందస్తు చర్యలు చేపట్టి ప్రశాంతంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో డీఎస్పీ, సీఐ ప్రేమ్ కుమార్, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


Leave a Reply