గోదావరిఖని,(తెలంగాణ నేత్రం)భక్తులు, పర్యాటకుల సౌకర్యార్థం TGSRTC గోదావరిఖని డిపో ఆధ్వర్యంలో కర్ణాటక, గోవా, మంత్రాలయం పుణ్యక్షేత్రాల ప్రత్యేక యాత్రను నిర్వహిస్తున్నట్లు డిపో మేనేజర్ కవిత తెలిపారు.ఈ యాత్ర సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 4 వరకు 7 రోజులు, 6 రాత్రులు కొనసాగుతుంది. యాత్రలో మంత్రాలయం, హంపీ, కుక్కే సుబ్రహ్మణ్య, ధర్మస్థల, ఉడుపి, మురుడేశ్వర, గోకర్ణతో పాటు గోవా బీచ్లను సందర్శించే అవకాశం ఉంటుంది.సూపర్ లగ్జరీ బస్సులో నిర్వహించే ఈ యాత్రకు ఒక్కొక్కరికి రూ.6,800 ఛార్జీగా నిర్ణయించారు. భోజనం, వసతి ఖర్చులను ప్రయాణికులే భరించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. కుటుంబ సమేతంగా, బంధుమిత్రులతో కలిసి ఈ ఆధ్యాత్మిక–పర్యాటక యాత్రను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
గోదావరిఖని నుంచి పుణ్యక్షేత్రాలకు 7 రోజుల ప్రత్యేక యాత్ర
◷ September 20, 2026 | telangananetramtv


Leave a Reply